తాగునీటిలో కలిసిన డ్రైనేజీ నీరు.. 10 మంది మృతి
ఇండోర్‌లోని భగీరథ్‌పురాలో కలుషిత నీటి సరఫరా కారణంగా పది మంది మరణించారు, వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. తాగునీటి పైప్‌లైన్‌లో డ్రైనేజీ నీరు కలవడమే ఈ విషాదానికి కారణం. దేశంలోనే స్వచ్ఛమైన నగరంగా పేరొందిన ఇండోర్‌లో ఈ ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. నిర్లక్ష్యం వహించిన అధికారులను తొలగించి, బాధితులకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది.
ఇండోర్ నగరంలో కలుషిత నీటి సరఫరా కారణంగా పది మంది మృతి చెందడం సంచలనంగా మారింది. కలుషిత నీరు తాగి వందల మంది ప్రజలు అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలయ్యారు. ఐసీయూలో చికిత్స తీసుకుంటున్న32 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. తాగునీటి పైప్‌లైన్‌లో డ్రైనేజీ నీరు కలవడం పై విచారణ జరిపి మున్సిపల్ కమిషనర్, అడిషనల్ కమిషనర్‌పై ప్రభుత్వం వేటు వేసింది. ప్రభుత్వం బాధితులకు ఉచిత వైద్యం, మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించింది. భగీరథ్‌పురా ప్రాంతంలో మున్సిపల్ నీటిని తాగిన సుమారు 10 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దుమారం రేపుతోంది. ఆ నీటిని తాగిన మరో 100 మందికి పైగా అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. అయితే దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా పేరొందిన ఇండోర్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. భగీరథ్‌పురా ప్రాంతంలో గత కొన్ని రోజులుగా సరఫరా అవుతున్న మున్సిపల్ నీటిని తాగిన స్థానికులు.. వాంతులు, విరేచనాలు, తీవ్రమైన డీహైడ్రేషన్‌కు గురయ్యారు. మెయిన్ నీటి సరఫరా పైప్‌లైన్ పైన ఒక మరుగుదొడ్డి నిర్మించారని.. ఆ పైప్‌లైన్ లీకేజీ వల్ల అక్కడ ఉన్న డ్రైనేజీ నీరు తాగునీటిలో కలిసిపోయిందని ప్రాథమిక విచారణలో అధికారులు తేల్చారు. సరఫరా అవుతున్న నీరు తీవ్ర దుర్వాసన వస్తోందని డిసెంబర్ 25న స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదనే ఆరోపణలు వస్తున్నాయి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలకు ఆదేశించారు. ఈ ఉదంతంపై విచారణకు ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: చిరు కూల్.. అఖండ2 కు షాక్ | హాలీవుడ్ గడ్డపై రాజా సాబ్ ప్రభంజనం
మానవ ప్రమేయం లేకుండా ఏఐ సాయంతో ఎగిరిన యుద్ధ డ్రోన్లు
Telangana: గుడ్ న్యూస్.. సంక్రాంతి లోపే రైతు భరోసా
తైల నూనే వారికి మహా ప్రసాదం.. రెండున్నర కిలోల నూనెను తాగేసింది..
ఓర్నీ.. స్మశానంలో అదేంపనిరా సామీ.. చివరికి వీటిని కూడా వదలరా!
ఓ ప్రాణం కాపాడేందుకు.. కూతురికి ఇచ్చిన మాట తప్పా
బాలుడికి కలలో దేవుడు చెప్పినమాట.. అక్కడ తవ్విచూడగా.. షాక్
ప్రింటింగ్ ప్రెస్‌లో వింత శబ్ధాలు.. అది చూసి అందరూ షాక్
సర్పంచ్ ఉదారత.. పుట్టిన ప్రతి ఆడబిడ్డకు రూ.5000 డిపాజిట్
కంచే చేను మేయడమంటే ఇదే.. ఏకంగా దేవుడికే పంగనామాలు పెట్టారుగా
వైద్యులు చేసిన పనికి నిండు ప్రాణం.. ఏం జరిగిందంటే

