తైల నూనే వారికి మహా ప్రసాదం.. రెండున్నర కిలోల నూనెను తాగేసింది..
ఆదిలాబాద్ జిల్లాలోని తొడసం వంశీయుల అద్భుత సంప్రదాయం: పుష్యమాసంలో ఖందేవ్ ఆలయంలో ఆడపడుచులు 2.5 కిలోల నువ్వుల నూనెను తాగే ఆచారం. విశ్వశాంతి, వంశ అభివృద్ధి కొరకు జరిగే ఈ మహోత్సవంలో తెలంగాణ, మహారాష్ట్రల నుండి భక్తులు పాల్గొంటారు. తరతరాలుగా కొనసాగుతున్న ఈ ఆచారం ఆదివాసీ సంస్కృతిలో ప్రత్యేకతను చాటుతుంది.
ఒకటి కాదు రెండు కాదు.. రెండున్నర కిలోల నువ్వుల నూనేను.. ఒక్కరే అవలీలగా తాగేశారు. ఇది తరతరాలుగా ఆదివాసీల్లో కొనసాగుతున్న సంప్రదాయం తొడసం వంశీయుల ఆడపడుచులకు దక్కే అపూర్వం అవకాశం. అడవుల జిల్లా ఆదిలాబాద్ లో పుష్యమాసంలో ఈ మహా ఘట్టం సాక్షాత్కారిస్తుంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా 2.5 కిలోల నువ్వుల నూనేను తాగి మొక్కు తీర్చుకున్నారు తొడసం వంశీయురాలు. ఈ అద్బుత ఘట్టం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ ఖాందేవుడి ఆలయం లో సాక్ష్యాత్కారం అయింది. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని ఖందేవ్ ఆలయం పుష్యపౌర్ణమి సంద ర్భంగా జనసంద్రమైంది. తెలంగాణ, మహారాష్ట్ర , చత్తీస్‌గఢ్ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చిన తొడసం వంశస్తులతో ఆధ్మాత్మిక శోభను సంతరించుకుంది ఖాందేవ్ ఆలయం. తొడసం వంశీయులు ఈ నెల 1న గురువారం మాన్కాపూర్ వద్ద మాసేమాల్ పేన్ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వ హించి రాత్రి అక్కడే బస చేశారు. 2న శుక్రవారం సాయంత్రం ఖందేవ్ ఆలయానికి చేరుకున్నారు. అదేరోజు రాత్రి మహాపూజతో జాతర ప్రారంభమైంది. 3న శనివారం తొడసం వంశీయుల సంప్రదాయ భేటి నిర్వహించారు. ఈ భేటీలోనే కొత్త కోడళ్లను దేవునికి పరిచయం చేశారు.మహాపూజ అనంతరం మరుసటి రోజు దేవుడి ఎదుట తైలం తాగే వ్రతాన్ని ఆదిలాబాద్ మండలం ఖండాల గ్రామానికి చెందిన తొడసం దుర్గుబాయి-దుర్గు దంపతుల కుమార్తె సుర్పం సకృబాయి మల్కు 2.5 కిలోల నువ్వుల నాటునూనె (తైలాన్ని) తాగారు. ఈమెకు ముందు విశ్వశాంతిని కోరే ఈ వ్రతాన్ని గతేడాది వరకు 21 మంది తొడసం ఆడపడుచులు పూర్తి చేశారు. అనంతరం తొడసం వంశీ యుల 80 మంది కోడళ్లతో భేటింగ్ కార్యక్రమం నిర్వహించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన తొడసం వంశీయులు వారి సాధక బాధలతో పాటు ఆలయ అభివృద్ధిపై చర్చించారు. భావితరాలకు ఆదర్శంగా ఉండేలా ఆలయ అభివద్ధి నిర్మాణ పనులు చేప ట్టాలని నిర్ణయించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆకాశం రంగులోకి మారిన నీరు.. క్యూ కడుతున్న పర్యాటకులు
వాల్మీకి విగ్రహానికి ఎలుగుబంట్లు ప్రదక్షిణలు
భారతీయ వీధికుక్కకు అమెరికన్లు ఫిదా.. శాంతియాత్రలో శునకం
ఓర్నీ.. స్మశానంలో అదేంపనిరా సామీ.. చివరికి వీటిని కూడా వదలరా!
ఓ ప్రాణం కాపాడేందుకు.. కూతురికి ఇచ్చిన మాట తప్పా
బాలుడికి కలలో దేవుడు చెప్పినమాట.. అక్కడ తవ్విచూడగా.. షాక్
ప్రింటింగ్ ప్రెస్లో వింత శబ్ధాలు.. అది చూసి అందరూ షాక్
సర్పంచ్ ఉదారత.. పుట్టిన ప్రతి ఆడబిడ్డకు రూ.5000 డిపాజిట్
కంచే చేను మేయడమంటే ఇదే.. ఏకంగా దేవుడికే పంగనామాలు పెట్టారుగా
వైద్యులు చేసిన పనికి నిండు ప్రాణం.. ఏం జరిగిందంటే

