AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాల్మీకి విగ్రహానికి ఎలుగుబంట్లు ప్రదక్షిణలు

వాల్మీకి విగ్రహానికి ఎలుగుబంట్లు ప్రదక్షిణలు

Phani CH
|

Updated on: Jan 06, 2026 | 6:10 PM

Share

శ్రీ సత్యసాయి జిల్లాలో వాల్మీకి మహర్షి విగ్రహానికి ఎలుగుబంట్లు ప్రదక్షిణలు చేసి, నిలబడి నమస్కరించిన దృశ్యం ఇప్పుడు వైరల్‌గా మారింది. బోయవాడిగా వేట వదిలి కవిగా మారిన వాల్మీకి మహర్షి గొప్పదనాన్ని ఈ సంఘటన మరోసారి చాటిచెప్పింది. పశుపక్ష్యాదులు సైతం ఆయన పట్ల చూపిన భక్తి అద్భుతం. ఈ వీడియో సోషల్ మీడియాలో విశేష స్పందన పొందుతోంది.

కిరాతుడైన బోయవాడు జంట పక్షులలో ఓ పక్షిని వేటాడగా.. దాని జంటపక్షి విలపించిన తీరును చూసి చలించిపోయాడు. కన్నీటితో వాటికి నివాళి అర్పించి వేటను వదిలి మానవత్వం పరిమలించగా కవిగా మారాడు. అద్భుతమైన రామాయణాన్ని రచించాడు. అందుకే మానవులే కాదు, పశుపక్ష్యాదులు కూడా ఆ మహాకవి రూపాన్ని చూడగానే నమస్కరించకుండా ఉండలేరు. శ్రీసత్యసాయి జిల్లాలో అదే జరిగింది. వాల్మీకి విగ్రహం చుట్టూ ఎలుగుబంట్లు ప్రదక్షిణలు చేశాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలం పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ సక్తికర ఘటన జరిగింది. వాల్మీకి విగ్రహం దగ్గరకు వచ్చిన ఎలుగుబంట్లు విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేశాయి. ఆ తర్వాత తిరిగి వెళుతూ లేచి నిలుచుని నమస్కరించి వెళ్లాయి. ఎలుగుబంట్లు వచ్చి వెళ్లిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భారతీయ వీధికుక్కకు అమెరికన్లు ఫిదా.. శాంతియాత్రలో శునకం

మూడు గంటలు తాటిచెట్టుపై వేలాడుతూ గీత కార్మికుడు

78 ఏళ్ల తర్వాత తొలిసారి ఆ గ్రామానికి తొలిబస్సు

గోవిందరాజ స్వామి ఆలయ గోపురం పైకెక్కిన వ్యక్తి

Bhagavanth Kesari: ఓటీటీలో టాప్ లో భగవంత్ కేసరి మూవీ