మూడు గంటలు తాటిచెట్టుపై వేలాడుతూ గీత కార్మికుడు
మహబూబాబాద్‌లో కల్లుగీత కార్మికుడు వెంకన్న ప్రాణాపాయం నుండి తృటిలో తప్పించుకున్నాడు. తాటిచెట్టుపై కాలుకు ఆధారమైన గుజి ఊడిపోవడంతో, గాలిలో మూడు గంటలపాటు వేలాడుతూ సహాయం కోసం ఎదురుచూశాడు. స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సమయానికి స్పందించి అతన్ని సురక్షితంగా రక్షించారు. ఈ సంఘటన దైనందిన కూలీల ప్రాణాంతక వృత్తులను, మధ్యతరగతి ప్రజల నిరంతర పోరాటాన్ని కళ్ళకు కట్టింది.
మధ్యతరగతి ప్రజల జీవితాలు నిరంతరం పోరాటమే అంటే ఇదేనేమో… రెక్కాడితే కానీ డొక్కాడని వీరు ఎన్నో ప్రమాదాలను ఎదుర్కోవలసి వస్తుంది. తాపీ పని చేసేవారు, పెయింటింగ్ పనిచేసేవారు, చెట్లు ఎక్కి కల్లు గీసేవారు ఇలాంటి వారు ప్రాణాలను పణంగా పెట్టి పనులు చేయాల్సి ఉంటుంది. ఎత్తయిన భవనాలు కట్టేటప్పుడు, పెయింటింగ్‌లు వేసేటప్పుడు, పొడవాటి చెట్టెక్కి కల్లు గీసేటప్పుడు ప్రమాదాలకు గురవుతూ ఉంటారు. అదృష్టం బావుంటే బ్రతికి బయటపడతారు. ఒక్కోసారి ప్రాణాలే కోల్పోవాల్సి వస్తుంది. తాజాగా ఓ కల్లు గీత కార్మికుడు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. మహబూబాబాద్ జిల్లా రాజోలుకు చెందిన గీత కార్మికుడు వెంకన్న రోజూలాగే కల్లు గీసేందుకు వెళ్లాడు. ఎప్పటిలాగే చెట్టు ఎక్కాడు. అయితే చెట్టు పైకి ఎక్కి కల్లు గీస్తుండగా కాలుకు ఉన్న గుజి ఊడిపోయింది. దీంతో వెంకన్న చెట్టుపైన వేలాడుతూ నిస్సహాయంగా ఉండిపోయాడు. తాటి కొమ్మను పట్టుకొని గాలిలో మూడుగంటలపాటు వేలాడుతూ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని సహాయం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. ఇంతలో అటుగా వెళ్తున్న స్థానికులు చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే పోలీసులు అగ్నిమాపక సిబ్బందిని వెంటపెట్టుకొని ఘటనాస్థలికి చేరుకున్నారు. వెంకన్నను కిందికి దింపారు. దాంతో వెంకన్న కుటుంబం, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
78 ఏళ్ల తర్వాత తొలిసారి ఆ గ్రామానికి తొలిబస్సు
గోవిందరాజ స్వామి ఆలయ గోపురం పైకెక్కిన వ్యక్తి
Bhagavanth Kesari: ఓటీటీలో టాప్ లో భగవంత్ కేసరి మూవీ
మాలీవుడ్‌కి గుడ్ న్యూస్.. రూ.100 కోట్ల క్లబ్‌లో ప్రేమమ్ హీరో
ఓర్నీ.. స్మశానంలో అదేంపనిరా సామీ.. చివరికి వీటిని కూడా వదలరా!
ఓ ప్రాణం కాపాడేందుకు.. కూతురికి ఇచ్చిన మాట తప్పా
బాలుడికి కలలో దేవుడు చెప్పినమాట.. అక్కడ తవ్విచూడగా.. షాక్
ప్రింటింగ్ ప్రెస్లో వింత శబ్ధాలు.. అది చూసి అందరూ షాక్
సర్పంచ్ ఉదారత.. పుట్టిన ప్రతి ఆడబిడ్డకు రూ.5000 డిపాజిట్
కంచే చేను మేయడమంటే ఇదే.. ఏకంగా దేవుడికే పంగనామాలు పెట్టారుగా
వైద్యులు చేసిన పనికి నిండు ప్రాణం.. ఏం జరిగిందంటే

