భారతీయ వీధికుక్కకు అమెరికన్లు ఫిదా.. శాంతియాత్రలో శునకం
19 మంది బౌద్ధ సన్యాసులు అమెరికాలో శాంతి, ఐక్యత కోసం టెక్సాస్ నుండి వాషింగ్టన్ డీసీ వరకు 2300 మైళ్ల పాదయాత్ర చేపట్టారు. వారికి 'పీస్ డాగ్' అలోకా తోడుగా ఉంది, నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. నాలుగు సంవత్సరాల అలోకా, తన నుదుటిపై ప్రేమ చిహ్నంతో, ఈ యాత్రకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సమాజంలో సామరస్యాన్ని పెంపొందించడం వీరి లక్ష్యం.
అమెరికాలో శాంతి, ఐక్యత, దయను పెంపొందించే లక్ష్యంతో 19 మంది బౌద్ధ సన్యాసులు టెక్సాస్ నుండి వాషింగ్టన్ డి.సి. వరకు 2,300 మైళ్లు అంటే సుమారు 3,700 కి.మీ. సుదీర్ఘ పాదయాత్ర చేపట్టారు. అక్టోబర్ 26, 2025న ప్రారంభమైన ఈ 120 రోజుల పాటు యాత్ర కొనసాగనుంది. వారు అలోకా అనే ఒక కుక్కతో కలిసి యాత్ర సాగిస్తున్నారు. సమాజంలో సామరస్యాన్ని పెంపొందించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే బౌద్య సన్యాసుల యాత్రలో శునకం అలోకా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ప్రతి అడుగులోనూ వారికి తోడుగా ఉండి యాత్రలో భాగంగా మారింది. దీంతో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. శాంతి యాత్ర జార్జియా గుండా సాగుతున్నప్పుడు, హైవేల వెంబడి కేవలం సన్యాసులు మాత్రమే కాదు, అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. సోషల్ మీడియాలో ముద్దుగా “పీస్ డాగ్” అని పిలువబడే అలోకా, ఈ యాత్రలో అత్యంత సుపరిచితమైన ముఖాలలో ఒకటిగా మారింది. తన నుదుటిపై ప్రేమకు ప్రతిరూపంగా భావించే లవ్ సింబల్ ఉంది. అలోకా తరచుగా సన్యాసుల పక్కన నిశ్శబ్దంగా నడుస్తూ కనిపిస్తుంది. కొన్నిసార్లు ముందుకు పరుగెడుతుంది. అప్పుడప్పుడు విశ్రాంతి అవసరమైనప్పుడు వాహనంలో ప్రయాణిస్తుంది. అలోకాకు సుమారు నాలుగు సంవత్సరాల వయస్సు ఉంటుంది. అది ఒక భారతీయ వీధి కుక్క అని చెబుతున్నారు. అంతకు ముందు జరిగిన ఒక శాంతి యాత్రలో సన్యాసులతో చేరింది. వారిని నమ్మకంగా అనుసరించింది. వారిని విడిచి వెళ్ళడానికి నిరాకరించిన తర్వాత, అలోకా వారి ప్రయాణంలో శాశ్వత భాగమైంది. దాని విధేయత ఇప్పుడు అమెరికా అంతటా మైళ్ల కొద్దీ విస్తరించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మూడు గంటలు తాటిచెట్టుపై వేలాడుతూ గీత కార్మికుడు
78 ఏళ్ల తర్వాత తొలిసారి ఆ గ్రామానికి తొలిబస్సు
గోవిందరాజ స్వామి ఆలయ గోపురం పైకెక్కిన వ్యక్తి
Bhagavanth Kesari: ఓటీటీలో టాప్ లో భగవంత్ కేసరి మూవీ
మాలీవుడ్‌కి గుడ్ న్యూస్.. రూ.100 కోట్ల క్లబ్‌లో ప్రేమమ్ హీరో
స్కూల్ హెడ్మాస్టర్ నిర్వాకం.. పిల్లలతో మసాజ్..
రూపాయికే బ్రాండెడ్ షూస్.. ఎగబడిన జనం.. మరి మీకు కావాలా..
లైవ్ వీడియోలో యూట్యూబర్ ఆత్మహత్యా యత్నం.. బాబోయ్
అయ్యో లోతైన బావిలోపడిపోయిన ఏనుగుపిల్ల.. ఎలా బయటపడిందంటే
Viral Video: కారులో కోబ్రా.. షాక్‌లో యజమాని
వీడసలు భర్తేనా.. కట్టుకున్న భార్యను ఎరగా వేసి.. కుర్రాడిని..
విధి ఆడిన వింత నాటకం.. భర్తను బలిగొన్న కరెంటు తీగ

