AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆకాశం రంగులోకి మారిన నీరు.. క్యూ కడుతున్న పర్యాటకులు

ఆకాశం రంగులోకి మారిన నీరు.. క్యూ కడుతున్న పర్యాటకులు

Naresh Gollana
| Edited By: |

Updated on: Jan 06, 2026 | 6:26 PM

Share

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని మూతపడిన డోర్లి 2 ఓపెన్ కాస్ట్ గనిలో నీరు రసాయనాలతో కలిసి నీలి రంగులోకి మారింది. ఈ 'బ్లూ వాటర్' ప్రాంతం పర్యాటక ఆకర్షణగా మారింది. పోలీసులు ప్రమాదకరమని హెచ్చరిస్తున్నా, ప్రజలు సెల్ఫీలు, డ్రోన్ వీడియోలతో తరలి వస్తున్నారు. ఈ అద్భుతమైన, ప్రమాదకరమైన అందం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ మూతపడిన ఓపెన్ కాస్ట్ గని అందరిని ఆకట్టుకుంటోంది. ఆ గనిలోకి చేరిన నీరు బ్లూ కలర్ లోకి మారడంతో ఆ వాటర్ ను చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. స్థానిక పోలీసులు మాత్రం అది ప్రమాదకర ప్రాంతం అక్కడికి వెళ్ల వద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు ఆ బ్యూ వాటర్ గని వద్ద పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు స్థానికులు. ప్రమాదం అంచునే సెల్పీలతో సందండి చేస్తున్నారు. కొమురంభీం జిల్లా తిర్యాణి మండలంలో రెండేళ్ల క్రితం మూత పడిన డోర్లి 2 ఓపెన్ కాస్ట్ నుంచి బయటకు వచ్చిన నీరు రసాయనాలతో కలవడం వల్ల బ్లూ కలర్ లోకి మారాయి. దీంతో చుట్టూ కొండల మధ్య ఉన్న ఆ బ్లూ‌కలర్ నీటిని చూసేందుకు చుట్టు పక్కల గ్రామస్తులతో పాటు, ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి తరలి వెళ్తున్నారు. కానీ ఆ ప్రాంతంలో నీటి అడుగు దాదాపు 70 అడుగుల లోతు ఉందని అటు వైపు వెళ్ళవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నీటిలోనికి దిగనివ్వక పోవడంతో గట్టుపై నుంచే దూరంగా చూసి చాలా మంది సెల్ ఫోన్ లలో ఆ బ్లూ వాటర్ అందాలను బందిస్తున్నారు‌. డ్రోన్ లతో మరింత అందంగా ఆ బ్లూ వాటర్ వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వాల్మీకి విగ్రహానికి ఎలుగుబంట్లు ప్రదక్షిణలు

భారతీయ వీధికుక్కకు అమెరికన్లు ఫిదా.. శాంతియాత్రలో శునకం

మూడు గంటలు తాటిచెట్టుపై వేలాడుతూ గీత కార్మికుడు

78 ఏళ్ల తర్వాత తొలిసారి ఆ గ్రామానికి తొలిబస్సు

గోవిందరాజ స్వామి ఆలయ గోపురం పైకెక్కిన వ్యక్తి