AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: గుడ్‌ న్యూస్‌.. సంక్రాంతి లోపే రైతు భరోసా

Telangana: గుడ్‌ న్యూస్‌.. సంక్రాంతి లోపే రైతు భరోసా

Phani CH
|

Updated on: Jan 06, 2026 | 6:38 PM

Share

తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి కానుకగా రైతు భరోసా నిధులను విడుదల చేయనుంది. యాసంగి సాగు కోసం ఎకరాకు రూ.6,000 చొప్పున పెట్టుబడి సాయం అందించనుంది. శాటిలైట్ సర్వే ద్వారా గుర్తించిన పంట భూములకు మాత్రమే ఈ డబ్బులు జమ చేస్తారు. సంక్రాంతికి ముందే రైతుల ఖాతాల్లో రూ.9 వేల కోట్ల నిధులు జమ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, రైతుల ఆనందం రెట్టింపు కానుంది.

తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి కానుక ఇవ్వనుంది. పండుగ సందర్భంగా రైతు భరోసా నిధులు రైతు అకౌంట్లలో జమ చేసేందుకు సిద్దమవుతోంది. సంక్రాంతి పండక్కి ముందే నిధులు రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రంలోని రైతులందరూ త్వరలోనే రైతు భరోసా డబ్బులు అందుకోనున్నారు. యాసంగి సాగు కోసం ఈ పెట్టుబడి సాయం అందించనుంది. శాటిలైట్ సర్వే ఆధారంగా… పంటలు వేసిన భూములను ప్రభుత్వం గుర్తిస్తోంది. ఈ నివేదిక ఆధారంగా పంట భూములకు మాత్రమే రైతు భరోసా డబ్బులు ఇవ్వనుంది. రైతుబంధు పథకంలో భాగంగా గతంలో ఎకరానికి రూ.5 వేలు అందించేవారు. ప్రస్తుతం రైతు భరోసా పథకం కింద ఎకరానికి ప్రభుత్వం రూ.6 వేలు అందిస్తోంది. యాసంగి సీజన్‌లో దాదాపు కోటిన్నర ఎకరాలకు డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమైంది. గత ఏడాది యాసంగిలో సుమారు 79.54 లక్షల ఎకరాల్లో పంట సాగయినట్లు అధికారులు క్షేత్రస్థాయి సర్వే ఆధారంగా గుర్తించారు. ఈసారి అంతకంటే ఎక్కువ స్థాయిలో పంట సాగవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అధికారులు సాగు వివరాలను సేకరిస్తున్నారు. ఈ వివరాలన్నీ త్వరలోనే వ్యవసాయశాఖకు అందనుండగా.. ఆ తర్వాత డబ్బులు రిలీజ్ చేయనున్నారు. ఈ యాసంగి సీజన్‌కు రైతు భరోసా పధకం అమలు చేయడానికి రూ.9 వేల కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు నిధులు విడుదల చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సంక్రాంతి పెద్ద పండుగ కావడంతో ముందే రైతులకు నిధులు జమ చేస్తే అన్నదాతల ఆనందం రెట్టింపు అవుతుందని ప్రభుత్వం భావించింది. దీంతో పండుగలోపే లబ్దిదారులందరికీ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తైల నూనే వారికి మహా ప్రసాదం.. రెండున్నర కిలోల నూనెను తాగేసింది..

ఆకాశం రంగులోకి మారిన నీరు.. క్యూ కడుతున్న పర్యాటకులు

వాల్మీకి విగ్రహానికి ఎలుగుబంట్లు ప్రదక్షిణలు

భారతీయ వీధికుక్కకు అమెరికన్లు ఫిదా.. శాంతియాత్రలో శునకం

మూడు గంటలు తాటిచెట్టుపై వేలాడుతూ గీత కార్మికుడు