పెను విషాదం.. గంట వ్యవధిలోనే తండ్రి, కొడుకు మృతి
పెద్దపల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొడుకు గుండెపోటుతో మరణించిన గంటలోనే తండ్రి కూడా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయని ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది. ఒకే కుటుంబంలో రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ఇలాంటి జంట మరణాలు సంభవించడం స్థానికంగా శోకం నింపింది.
ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుకు గురవుతున్నారు. సకాలంలో చికిత్స అందితే ప్రాణాలతో బటయపడుతున్నారు.. చాలా సందర్భాల్లో స్పాట్‌లోనే చనిపోతున్నారు. తాజాగా పెద్దపల్లి జిల్లాలో కొడుకు మరణాన్ని తట్టుకోలేకపోయిన తండ్రి గంట వ్యవధిలోనే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగెపల్లి గ్రామానికి చెందిన ఎరుకల శ్రీకాంత్ గుండె పోటు తో మృతి చెందారు. కుటుంబ సభ్యులు కన్నీరు..మున్నీరుగా విలపించారు. తనకు తలకొరివి పెడతాడనుకున్న కొడుకు కళ్లముందు నిర్జీవంగా పడిఉండటం చూసి తట్టుకోలేకపోయిన తండ్రి గుండె బద్దలైపోయింది. గుండెలవిసేలా రోధించాడు. చివరికి గుండెఆగిపోయి గంట వ్యవధిలో తండ్రి ఎరుకల రాజేశం కూడా మృతి చెందాడు. ఒకేసారి తండ్రి, కొడుకు మృతి చెందడంతో ఆ కుటుంబం సోకసంద్రంలో మునిగిపోయింది. కాగా, ఇరువై సంవత్సరాల క్రితం ఇదే కుటుంబంలో.. రాజేశం తల్లిదండ్రులు కూడా ఒకే రోజు మృతి చెందారని గ్రామస్తులు తెలిపారు. ఇప్పుడు ఒకేసారి తండ్రీ కొడుకులు మృతి చెందడంతో ఆ కుటుంబంలో జంటమరణాలు శాపమా అంటూ చర్చించుకుంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టీ20 ప్రపంచకప్‌లో ఊహించని మార్పులు.. భారత్‌లో ఆడలేమంటున్న బంగ్లాదేశ్
తాగునీటిలో కలిసిన డ్రైనేజీ నీరు.. 10 మంది మృతి
TOP 9 ET News: చిరు కూల్.. అఖండ2 కు షాక్ | హాలీవుడ్ గడ్డపై రాజా సాబ్ ప్రభంజనం
ఓర్నీ.. స్మశానంలో అదేంపనిరా సామీ.. చివరికి వీటిని కూడా వదలరా!
ఓ ప్రాణం కాపాడేందుకు.. కూతురికి ఇచ్చిన మాట తప్పా
బాలుడికి కలలో దేవుడు చెప్పినమాట.. అక్కడ తవ్విచూడగా.. షాక్
ప్రింటింగ్ ప్రెస్లో వింత శబ్ధాలు.. అది చూసి అందరూ షాక్
సర్పంచ్ ఉదారత.. పుట్టిన ప్రతి ఆడబిడ్డకు రూ.5000 డిపాజిట్
కంచే చేను మేయడమంటే ఇదే.. ఏకంగా దేవుడికే పంగనామాలు పెట్టారుగా
వైద్యులు చేసిన పనికి నిండు ప్రాణం.. ఏం జరిగిందంటే

