AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: గచ్చిబౌలి రోడ్డుపై జింక పరుగులు

Hyderabad: గచ్చిబౌలి రోడ్డుపై జింక పరుగులు

Phani CH
|

Updated on: Jan 06, 2026 | 7:20 PM

Share

హైదరాబాద్‌ గచ్చిబౌలి-లింగంపల్లి హైవేపై కారు ఢీకొని ఓ జింకకు తీవ్ర గాయాలయ్యాయి. HCU క్యాంపస్ నుంచి వచ్చిన జింకకు HCU యానిమల్ ప్రొటెక్షన్ టీమ్ చికిత్స కోసం తరలించింది. సరైన ఫెన్సింగ్ లేకపోవడం, వన్యప్రాణులు రోడ్లపైకి రావడం ఇలాంటి ప్రమాదాలకు కారణమని స్థానికులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా రోడ్డు భద్రత చర్యలు, అవగాహన అవసరం.

హైదరాబాద్ గచ్చిబౌలి-లింగంపల్లి ఓల్డ్ ముంబై జాతీయ రహదారిపై ఓ జింక పరుగులు తీసింది. రోడ్డుపై భారీగా వాహనాలు దూసుకెళ్తుండగా ఎక్కడినుంచి వచ్చిందో ఓ చుక్కల జింక రోడ్డు పక్కగా పరుగులు తీస్తూ కనిపించింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఊహించని విధంగా రద్దీగా ఉండే రోడ్డుపై జింక కనిపించడంతో అందరూ వింతగా చూశారు. HCU క్యాంపస్ చుట్టూ 240 ఎకరాల అటవి ప్రాంతం ఉండటంతో జీంకలు, నెమళ్ళు వంటి వన్యప్రాణులు తరచూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కు కనిపిస్తుంటాయి..ఆదివారం ఉదయం జింక అడవి నుంచి బయటకు వచ్చి ఏకంగా పాత ముంబై రహదారిపైకి ప్రవేశించడంతో వేగంగా వెళ్తున్న కారును ఢీకొన్నట్లు సాక్షులు చెప్పారు. తీవ్ర గాయాలతో రోడ్డు మధ్య పడిపోవడంతో చుట్టూ వాహనాలు ఆగిపోయాయి. సమాచారం అందుకున్న HCU యానిమల్ ప్రొటెక్షన్ టీమ్ వెంటనే స్పందించి ఘటనాస్థలికి చేరుకొని జీంకను సురక్షితంగా పట్టుకున్నారు.గాయాలతో ఉన్న జీంకను చికిత్స కోసం సమీప వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించారు. గతంలో కూడా జీంకలు, చిరుతలు బయటకు వచ్చి ప్రమాదాలు సృష్టించాయి, సరైన ఫెన్సింగ్ లేకపోవడంతో వన్యప్రాణులు రోడ్లపైకి వచ్చి ప్రమాదాలకు గురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అధికారులు రహదారి వెంబడి వార్నింగ్ సైన్‌ బోర్డులు, స్పీడ్ లిమిట్లు, నైట్ పెట్రోలింగ్ పెంచాలని కోరుతున్నారు. గచ్చిబౌలి, HCU, లింగంపల్లి మధ్య రహదారిపై రాత్రి, ఉదయం వేగం తగ్గించి వెళ్లాలి, జంతువులు ఉండే అవకాశం ఉందని డ్రైవర్లకు అవగాహన కల్పించాలి. అలాంటి ఘటనలు గమనించినప్పుడు వెంటనే HCU యానిమల్ ప్రొటెక్షన్ టీమ్ (040-23094501) లేదా ఫారెస్ట్ హెల్ప్‌లైన్‌కు సంప్రదించాలి. వన్యప్రాణుల రక్షణతో పాటు మానవ జీవన రక్షణ కోసం అటవీ-అర్బన్ ప్రాంతాల మధ్య సమతుల్యత అవసరమని నిపుణులు చెపుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెను విషాదం.. గంట వ్యవధిలోనే తండ్రి, కొడుకు మృతి

టీ20 ప్రపంచకప్‌‌లో ఊహించని మార్పులు.. భారత్‌లో ఆడలేమంటున్న బంగ్లాదేశ్

తాగునీటిలో కలిసిన డ్రైనేజీ నీరు.. 10 మంది మృతి

TOP 9 ET News: చిరు కూల్.. అఖండ2 కు షాక్ | హాలీవుడ్ గడ్డపై రాజా సాబ్ ప్రభంజనం

మానవ ప్రమేయం లేకుండా ఏఐ సాయంతో ఎగిరిన యుద్ధ డ్రోన్లు