టీ20 ప్రపంచకప్‌లో ఊహించని మార్పులు.. భారత్‌లో ఆడలేమంటున్న బంగ్లాదేశ్
బీసీసీఐ ఆదేశాలతో కేకేఆర్ ముస్తాఫిజుర్‌ను విడుదల చేయగా, భారత్-బంగ్లాదేశ్ మధ్య క్రికెట్ వివాదం రాజుకుంది. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల కారణంగా ముస్తాఫిజుర్‌ను భారత్‌లో ఆడనివ్వకూడదని బీసీసీఐ నిర్ణయించింది. దీనిపై స్పందించిన బంగ్లాదేశ్, తమ టీ20 ప్రపంచకప్ మ్యాచ్ వేదికలను మార్చాలని ఐసీసీని కోరింది. ఇది ఇరు దేశాల దౌత్య సంబంధాలపై ప్రభావం చూపుతోంది.
బీసీసీఐ ఆదేశాల మేరకు, బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్‌కు చెందిన కోల్‌కతా నైట్ రైడర్స్ శనివారం ముస్తాఫిజుర్ రెహమాన్‌ను జట్టు నుంచి విడుదల చేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ వివాదం మరింత రాజుకున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐని ఇబ్బందుల్లో పెట్టేందుకు బంగ్లాదేశ్ పలు నిర్ణయాలు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో తమ మ్యాచ్‌ల వేదికలను మార్చాలని ఐసీసీని కోరాలని బంగ్లా క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించున్నట్లు సమాచారం. షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ జట్టు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఫిబ్రవరి 7న వెస్టిండీస్‌తో ఫిబ్రవరి 9న ఇటలీతో ఫిబ్రవరి 14న ఇంగ్లాండ్ తో అదే విధంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఫిబ్రవరి 17న నేపాల్‌తో ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో దేశంలో వెల్లువెత్తిన నిరసనల కారణంగా, ముస్తాఫిజుర్‌ను భారత్‌లో ఆడనివ్వకూడదని బీసీసీఐ నిర్ణయించింది. దీనిపై స్పందించిన బంగ్లాదేశ్ బోర్డు, భారత్‌లో తమ ఆటగాళ్ల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ వేదికలను మార్చాలని కోరినట్లు సమాచారం. ముస్తాఫిజుర్‌ను ఇటీవల జరిగిన మినీ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 9.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఒక బంగ్లాదేశ్ ఆటగాడికి ఐపీఎల్ చరిత్రలో లభించిన అత్యధిక ధర ఇదే. అయితే బంగ్లాదేశ్‌లో నెలకొన్న అస్థిర పరిస్థితుల కారణంగానే ముస్తాఫిజుర్‌ను విడుదల చేయాలని కేకేఆర్ జట్టును కోరినట్లు బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా తెలిపారు. అతనికి బదులుగా మరొక ఆటగాడిని ఎంచుకునేందుకు కేకేఆర్‌కు అనుమతినిచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో ఇటీవల జరిగిన పాలనా మార్పుల తర్వాత హిందువులపై దాడులు పెరగడంతో భారత్-బంగ్లాదేశ్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తాగునీటిలో కలిసిన డ్రైనేజీ నీరు.. 10 మంది మృతి
TOP 9 ET News: చిరు కూల్.. అఖండ2 కు షాక్ | హాలీవుడ్ గడ్డపై రాజా సాబ్ ప్రభంజనం
మానవ ప్రమేయం లేకుండా ఏఐ సాయంతో ఎగిరిన యుద్ధ డ్రోన్లు
Telangana: గుడ్ న్యూస్.. సంక్రాంతి లోపే రైతు భరోసా
తైల నూనే వారికి మహా ప్రసాదం.. రెండున్నర కిలోల నూనెను తాగేసింది..
విధి నిర్వహణలో ప్రాణాల్ని కూడా లెక్కచేయని ఆర్టీసీ డ్రైవర్
టీడీపీ జెండాతో సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి..
వారెవా.. లిటిల్ జీనియస్ రూబిక్ క్యూబ్ ఆర్ట్‌తో రికార్డులు
మందుకు డబ్బుల్లేక.. ఆర్టీసీ బస్ కాజేశాడు.. మహానుభావుడు
మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని.. చావు దాకా వెళ్లిన చిన్నారులు
లిఫ్ట్ ఓపెన్.. మంగళసూత్రం ఖతం !!
అద్భుతం.. సాగర గర్భంలో త్రివర్ణపతాక ధగధగలు

