గ్రామాల్లో ఇసుక లారీల దూకుడు ఆగమవుతున్న పల్లె జనం
కరీంనగర్ జిల్లాలో ఇసుక లారీల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు ప్రమాదాలు, దుమ్ము, ధూళి కారణంగా శ్వాసకోశ వ్యాధులు ప్రబలుతున్నాయి. పశువుల మరణాలు, రోడ్ల విధ్వంసం, ఇంటి బయట కూర్చోలేని పరిస్థితి నెలకొంది. బైపాస్ రోడ్లు నిర్మించి ఇసుక రవాణాను గ్రామాల్లోంచి మళ్ళించాలని స్థానికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.
ఇసుక లారీలు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. ఓ వైపు రోడ్డు ప్రమాదాలతో పాటు.. మరో వైపు దుమ్ము, దూళీ కారణంగా అనారోగ్యం పాలవుతున్నారు. ప్రభుత్వానికి ఇసుకతో వందల కోట్ల ఆదాయం వస్తున్నా ప్రభావిత గ్రామాలు మాత్రం నిత్యం నరకం చూస్తున్నాయి. ఇసుక లారీల రాకపోకలపై కరీంనగర్ జిల్లా వాసులు రోడ్డెక్కారు. ఇసుక లారీల బాధతో తాము గ్రామాల్లో నివసించలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. తరచూ లారీల కారణంగా జరుగుతున్న యాక్సిడెంట్ల వల్ల తమ ప్రాంతాల వారు వికలాంగులు మారుతుండగా, తరచూ పశువులు సైతం లారీల కింద పడి చనిపోతున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో మానకొండూరు, వీణవంక మండలాల్లో ఇసుక క్వారీలు ఉన్నాయి. ఇక్కడి నాణ్యమైన ఇసుకకు వివిధ ప్రాంతాల నుంచి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ప్రతి నిత్యం వందలాది ఇసుక లారీలు ఇక్కడి నుంచి ఇసుక సరఫరా చేస్తుంటాయి. నిబంధనలను ఉల్లంఘించి పరుగులు తీస్తున్నాయి. అయితే లారీలు వెళ్లే రోడ్లు అధ్వాన్నంగా మారిపోయాయి. విపరీతమైన వేగంతో రోడ్ల మీద దూసుకుపోతున్న లారీల వల్ల దుమ్ము ధూళి నేరుగా ఇళ్లల్లోకి చేరుతోంది. ఇసుక తుఫాన్ మాదిరిగా తమ వీధుల్లో రేగుతున్న దుమ్ముతో .. కాసేపు ఇంటి బయట కూర్చొనే అవకాశం కూడా లేకుండా పోతోందని వారు వాపోతున్నారు. లారీల మూలంగా వస్తున్న దుమ్ము ధాటికి రోడ్లు సమీపంలోని ఇళ్లలో అద్దెకుండే వారు మరో చోటికి మారిపోతున్నారు. దుమ్ము కారణంగా తాము శ్వాసకోశ వ్యాధుల పాలవుతున్నామని, తరచూ తమ ఇళ్లలోని చిన్నారులు, వృద్ధులను ఆసుపత్రులకు తీసుకుపోవాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ గ్రామాల మీదుగా ఇసుక లారీలు వెళ్లకూడదంటూ బాధిత గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. దుమ్ము, దూళీ కారణంగా తమ ఇళ్లకు బంధువులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కడుపు నిండా అన్నం కూడా తినని పరిస్థితి ఉందని అంటున్నారు. ఇకనైనా ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు స్పందించి.. ఇసుక రవాణా వాహనాలను గ్రామాల్లోంచి కాకుండా.. బైపాస్ ద్వారా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోకుంటే ఆందోళనను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు స్థానికులు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బస్సు డ్రైవర్‌గా మదురో ప్రస్తానం.. పుట్టపర్తి సాయిబాబాకు వీరభక్తుడు
బాక్స్‌లో పెట్టిన బిడ్డను ఎత్తుకొని పారిపోయిన తల్లి.. కారణం ఇదే
Hyderabad: గచ్చిబౌలి రోడ్డుపై జింక పరుగులు
పెను విషాదం.. గంట వ్యవధిలోనే తండ్రి, కొడుకు మృతి
టీ20 ప్రపంచకప్‌లో ఊహించని మార్పులు.. భారత్‌లో ఆడలేమంటున్న బంగ్లాదేశ్
ఓర్నీ.. స్మశానంలో అదేంపనిరా సామీ.. చివరికి వీటిని కూడా వదలరా!
ఓ ప్రాణం కాపాడేందుకు.. కూతురికి ఇచ్చిన మాట తప్పా
బాలుడికి కలలో దేవుడు చెప్పినమాట.. అక్కడ తవ్విచూడగా.. షాక్
ప్రింటింగ్ ప్రెస్లో వింత శబ్ధాలు.. అది చూసి అందరూ షాక్
సర్పంచ్ ఉదారత.. పుట్టిన ప్రతి ఆడబిడ్డకు రూ.5000 డిపాజిట్
కంచే చేను మేయడమంటే ఇదే.. ఏకంగా దేవుడికే పంగనామాలు పెట్టారుగా
వైద్యులు చేసిన పనికి నిండు ప్రాణం.. ఏం జరిగిందంటే

