దేశీ స్టయిల్‌లో రోడ్డు దాటిన రష్యన్ మహిళలు.. నెట్టింట వీడియో ఫుల్ వైరల్
నగరాల్లో రోడ్డు దాటడం ప్రాణాంతకంగా మారింది. వాహనాల రద్దీ, వేగం వల్ల పాదచారులకు, ముఖ్యంగా మహిళలకు చాలా కష్టం. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని దాటాల్సి వస్తుంది. వాహనాల నియంత్రణ లేకపోవడం ప్రమాదాలకు దారి తీస్తోంది. జైపూర్‌లో ఓ రష్యన్ మహిళ రోడ్డు దాటడానికి 'దేశీ స్టైల్' చూపిన వీడియో వైరల్ కావడంతో, ఈ సమస్య తీవ్రత మరోసారి చర్చనీయాంశమైంది.
నగరాలలో రోడ్డు దాటడం గగనంగా మారుతోంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దాటాల్సి వస్తోంది. వేగంగా దూసుకొచ్చే వాహనాలు ఎప్పుడు ఎవరిని ప్రమాదంలోకి నెట్టేస్తాయో తెలియని పరిస్థితి. రోడ్లపై వాహనాల రద్దీ మామూలుగా ఉండదు. రోడ్డు దాటాలంటే భయమేసే పరిస్థితి. అటు ఇటుగా ప్రతి రోజూ ఉదయం నుంచి రాత్రి వరకు వేలాది సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. కానీ వాహనాల నియంత్రణ ఎవరికీ పట్టదు. కార్లు, ద్విచక్ర వాహనాలు అతి వేగంగా వస్తుంటాయి. కాసేపు ఆలోచించి అడుగు తీసి అడుగు వేసేలోగా వాహనాలు వాయువేగంతో దూసుకొస్తాయి. ఇక మహిళలు రోడ్డు దాటే పరిస్థితి అస్సలు ఉండదు. రోడ్డు దాటితే మీరు పునర్జన్మ ఎత్తినట్లే. ఔను.. ముమ్మాటికీ ఇది వాస్తవం. కాలి నడకన రోడ్డు దాటాలనుకునే వారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఒక్క పరుగున వెళ్లాల్సి వస్తుంది. తరచుగా అనేక ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. రోడ్డు దాటడానికి సంబంధించి ఓ ఫన్నీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. జైపూర్ సందర్శనకు వచ్చిన రష్యన్ మహిళ పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతోంది. ఇద్దరు రష్యన్ మహిళలు జైపూర్ లోని పింక్ సిటీ సందర్శనకు వచ్చారు. ఓ మహిళ రోడ్డు దాటడానికి ఇబ్బందిపడ్డారు. ఎంత సేపు నుంచున్నా వాహనాలు ఆగేలా కనిపించలేదు. ఇంతలో ఆమెతో వచ్చిన మరో మహిళ రోడ్డు దాటడం ఎలాగో నేర్పుతా అంటూ ముందుకొచ్చారు. ప్రమాదమని తెలిసినా వాహనాలకు అడ్డువెళ్లి వాటిని ఆపి మరీ రోడ్డు దాటారు. ఇలా రోడ్డు దాటడం దేశీ స్టయిల్ అంటూ ఆమె చెప్పడంతో అంతా ఆమె కామెంట్‌కు పగలబడి నవ్వారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చలి కాచుకోవడానికి వచ్చిన పాముతో ముచ్చట్లు పెట్టిన వ్యక్తి.. మీరు ఇలా ఉన్నారేంట్రా
మీ జుట్టు రాలుతుందా ?? ఈ నేచురల్ హెయిర్ మాస్క్ ట్రై చేయండి.. ఒక్క వెంట్రుక కూడా రాలదు
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ... కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు
తల్లికి ఉన్న రూ.12 లక్షల అప్పును తీర్చిన టీనేజ్ కొడుకు
కోతుల కొరత.. ఒక్కో కోతికి రూ.25 లక్షలు ఇస్తాం
అనకొండ తలపై నాగిని డాన్స్.. జోక్ కాదు.. ఇది సీరియస్ మ్యాటర్
గోదావరిలో చిక్కిన బాహుబలి చేప.. ధర ఎంతంటే
భారతీయుడి మంచితనానికి కన్నీళ్లు పెట్టుకున్న అమెరికన్ జంట
ఇక్కడ కాబట్టి అర్ధరాత్రి ఒంటరిగా నడుస్తున్నా.. అదే ఆ దేశం అయితే

