AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైద్యులు చేసిన పనికి నిండు ప్రాణం.. ఏం జరిగిందంటే

వైద్యులు చేసిన పనికి నిండు ప్రాణం.. ఏం జరిగిందంటే

Phani CH
|

Updated on: Jan 07, 2026 | 1:18 PM

Share

బీహార్‌లో వైద్య నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. సిజేరియన్ ఆపరేషన్ సమయంలో డాక్టర్లు కడుపులో కత్తెరలు మర్చిపోవడంతో ఉషాదేవి ఏడాదిన్నర పాటు తీవ్ర నొప్పితో బాధపడింది. ఇటీవలి CT స్కాన్‌లో ఇది బయటపడినా, కత్తెర తొలగించే ప్రయత్నంలో ఆమె మరణించింది. బాధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని కుటుంబం డిమాండ్ చేస్తోంది.

మనదేశంలో వైద్యులను దేవుడిగా భావిస్తారు. ప్రాణం పోసేది దేవుడైతే.. ఆ ప్రాణాన్ని నిలిపే శక్తి ఒక్క వైద్యుడికి మాత్రమే ఉంటుంది. అందుకే వైద్యులను దేవుడిగా భావించి తమ ఆరోగ్యాన్ని కాపాడమని చేతులెత్తి మొక్కుతారు. అంతటి విలువైన వృత్తికే కలంకం తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు కొందరు వైద్యులు. వారి నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణాలు బలైపోతున్నాయి. అలాంటి ఘటనే బీహార్‌లో జరిగింది. బీహార్‌కు చెందిన మణిభూషణ్ కుమార్ భార్య ఉషా దేవి డెలివరీ కోసం ఓ ఆస్పత్రిలో చేరింది. ఆమెకు ఆపరేషన్‌ చేయగా ఆడశిశువు జన్మించింది. అయితే ఆపరేషన్‌ చేసిన వైద్యురాలు ఉషా దేవి కడుపులో ఏకంగా రెండు కత్తెరలను వదిలేసి కుట్లు వేసింది. చికిత్స అనంతరం ఇంటికి వెళ్లిన ఉషా దేవికి కొన్ని రోజుల తర్వాత కడుపు నొప్పి రావడం మొదలైంది. వైద్యులు అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకోవాలని సూచించారు. కానీ అందులో సమస్య ఏంటనేదీ వెల్లడికాలేదు. దీంతో ఆమెకు కొన్ని నొప్పి నివారణ మందులు ఇచ్చి పంపించారు. కొంత ఉపశమనం కలిగించినా మళ్లీ కడుపునొప్పి ప్రారంభమైంది. దీంతో ఉషా దేవి అనేక సార్లు అల్ట్రాసౌండ్లు చేయించుకుంది. ఈ పరీక్షల్లో ఆమె కడుపులో అసాధారణంగా ఏమీ వెల్లడి కాలేదు. దీంతో డాక్టర్లు ఆమె ఆరోగ్యంగానే ఉందని, నొప్పిని తగ్గించడానికి మందులు ఇస్తూవచ్చారు. ఇలా దాదాపు ఏడాదిన్నర సంవత్సరం గడిచిపోయింది. ఇటీవల ఉషాదేవికి కడుపు నొప్పి ఎక్కువైపోయింది. నొప్పి భరించలేనంతగా రావడంతో కుటుంబ సభ్యులు ఉషా దేవిని పట్టణంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ CT స్కాన్ చేయగా ఆమె కడుపులో ఓ కత్తెర ఉన్నట్లు వైద్యుడు గుర్తించాడు. వెంటనే ఉషా దేవిని వేరే ఆస్పత్రికి తరలించమని కుటుంబ సభ్యులకు సూచించారు. అక్కడ వైద్యులు కత్తెరను తొలగించడానికి శస్త్రచికిత్స నిర్వహించారు. కానీ ఆ ప్రక్రియ ముగిసే సమయానికి ఉషా దేవి ప్రాణాలు కోల్పోయింది. అప్పటికే బాధితురాలి కడుపులో పేగులను కత్తెర చీల్చివేయడంతో తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ సోకింది. గతంలో నిర్లక్ష్యంగా సీజేరియన్‌ చేసిన డాక్టర్ పై ఆగ్రహించిన మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఇది ముమ్మాటికి డాక్టర్ నిర్లక్ష్యమేనని, ఆపరేషన్ సమయంలో కత్తెర ఎలా మరచిపోతుందని ప్రశ్నించారు. దోషులైన వైద్యులపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశాడు. దాంతో జిత్నా పోలీస్ స్టేషన్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని ఉషా దేవి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించింది. పోస్ట్‌మార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. నివేదికలో నిర్లక్ష్యం ఉన్నట్లు ఆధారాలు లభ్యమైతే నిందితులపై FIR నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దేశీ స్టయిల్‌లో రోడ్డు దాటిన రష్యన్‌ మహిళలు.. నెట్టింట వీడియో ఫుల్ వైరల్

చలి కాచుకోవడానికి వచ్చిన పాముతో ముచ్చట్లు పెట్టిన వ్యక్తి.. మీరు ఇలా ఉన్నారేంట్రా

మీ జుట్టు రాలుతుందా ?? ఈ నేచురల్‌ హెయిర్‌ మాస్క్‌ ట్రై చేయండి.. ఒక్క వెంట్రుక కూడా రాలదు