AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bala Krishna: NBK111 సినిమాపై ఇంట్రెస్టింగ్ విషయాలు.. నిజంగా అలా ఉండబోతుందా

Bala Krishna: NBK111 సినిమాపై ఇంట్రెస్టింగ్ విషయాలు.. నిజంగా అలా ఉండబోతుందా

Phani CH
|

Updated on: Jan 07, 2026 | 4:03 PM

Share

బడ్జెట్ అంచనాలు, నాన్-థియేట్రికల్ రెవెన్యూ మార్పుల కారణంగా బాలయ్య, గోపీచంద్ మలినేనిల NBK111 స్క్రిప్ట్ మారబోతుందా? ముందుగా అనుకున్న చారిత్రక కథను పక్కనపెట్టి, నిర్మాత‌లు మాస్ స్క్రిప్ట్‌తో ముందుకెళ్లాలని చూస్తున్నారా? అఖండ 2 ఫలితాల తర్వాత భారీ బడ్జెట్ రిస్క్ అని భావిస్తున్నారా? ఈ మార్పు వెనుక ఉన్న కారణాలు, NBK111 భవిష్యత్తుపై తాజా సమాచారం ఇక్కడ తెలుసుకోండి.

బడ్జెట్ కారణంగా బాలయ్య, గోపీచంద్ మలినేని సినిమా స్క్రిప్ట్ మారిపోయిందా..? ముందు అనుకున్న కథ కాదని కమర్షియల్ వైపు అడుగులేస్తున్నారా..? భారీ బడ్జెట్ అవుతుందని హిస్టారికల్ కాకుండా సింపుల్ మాస్ వైపు ఆలోచిస్తున్నారా..? అఖండ 2 రిజల్ట్ తర్వాత బడ్జెట్ భారీగా ఉంటే వర్కవుట్ అవ్వదనే నిర్మాతలు ఇలా చేస్తున్నారా..? అసలేం జరుగుతుంది NBK111 విషయంలో..? అఖండ 2 తర్వాత బాలయ్య ఫోకస్ అంతా ఇప్పుడు గోపీచంద్ మలినేని సినిమాపైనే ఉంది. వీరసింహారెడ్డి తర్వాత ఈ కాంబో రిపీట్ అవుతుంది. చారిత్రక నేపథ్యంతో ఈ సినిమా వస్తుందని ఫస్ట్ లుక్ చూడగానే అర్థమైంది. ఇందులోనూ బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్నాడని తెలిపారు. అయితే తాజాగా బడ్జెట్ కారణంగా అంతా మారిపోతుంది.. ముందనుకున్న హిస్టారికల్ ప్రాజెక్ట్ పక్కనపెట్టి.. సింపుల్ మాస్ స్క్రిప్ట్‌తో ముందుకెళ్ళాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. దీనికి కారణం భారీ బడ్జెట్ ప్లస్ అఖండ 2కు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాకపోవడమే అని వార్తలొస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బాలయ్యపై అంత బడ్జెట్ పెట్టడం రిస్క్ అనే.. నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. నాన్ థియేట్రికల్ రెవెన్యూ మునపట్లా లేదిప్పుడు. పైగా చారిత్రక సినిమా అంటే బడ్జెట్ కంట్రోల్ కష్టం.. షూటింగ్‌కు ఎక్కువ టైమ్ కావాలి.. ఈ లెక్కలన్నీ వేసుకున్నాకే నిర్మాతలు సేఫ్ గేమ్ వైపు అడుగులేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. చివరిసారిగా గౌతమీపుత్ర శాతకర్ణిలో హిస్టారికల్ రోల్ చేసారు బాలయ్య. మరి NBK111పై ఈ ప్రచారం నిజమా కాదా అనేది మేకర్సే క్లారిటీ ఇవ్వాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Allu Arjun: కెరీర్ కోసం కత్తిలాంటి ప్లానింగ్.. అల్లు అర్జున్ అంటే ఆమాత్రం ఉంటది

మేటర్ లేకుండానే.. సీక్వెల్స్ అనౌన్స్ చేస్తున్నారు.. ఏంటి బాస్ ఇది

Pawan Kalyan: మరో సినిమా అనౌన్స్ చేసిన పవర్ స్టార్.. సర్‌ప్రైజ్ అదిరిందిగా

Sreeleela: ఇప్పటి వరకు నా ఫెయిల్యూర్స్ మాత్రమే చూసారు.. ఇక నుండి నా సక్సెస్ చూస్తారు

బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న బ్యూటీస్