Allu Arjun: కెరీర్ కోసం కత్తిలాంటి ప్లానింగ్.. అల్లు అర్జున్ అంటే ఆమాత్రం ఉంటది
అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా స్టార్‌డమ్ లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. తెలుగు, హిందీ, మలయాళం, కన్నడలో ఇప్పటికే బలమైన పునాది ఉన్న ఆయన, ఇప్పుడు తమిళ మార్కెట్‌పై దృష్టి సారించారు. అట్లీ, లోకేష్ కనకరాజ్ వంటి దర్శకులతో సినిమాలతో పాటు త్రివిక్రమ్‌తో మైథలాజికల్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తూ, అన్ని భాషల్లోనూ తన ఆధిపత్యాన్ని విస్తరింపజేయాలని చూస్తున్నారు. ఇది కేవలం తెలుగుకే పరిమితం కాకుండా, దేశవ్యాప్తంగా తన స్టార్‌డమ్‌ను నిలబెట్టుకోవడానికి ఆయన చేస్తున్న తెలివైన వ్యూహం.
అల్లు అర్జున్ ప్లానింగ్ మామూలుగా లేదు.. ఆయన ఆలోచిస్తున్న తీరుకే మిగిలిన హీరోలకు చెమటలు పడుతున్నాయి. ఒక్కో సినిమా విషయంలో బన్నీ వేస్తున్న అడుగులు నెక్ట్స్ లెవల్‌లో ఉన్నాయి. ఒక్కో ఇటుక పేరుస్తూ తన స్టార్ డమ్‌ను ప్యాన్ ఇండియాకు పాకేలా చేస్తున్నారీయన. మరి బన్నీ ఫాలో అవుతున్న ఆ రూట్ ఏంటి..? దానికోసం ఆయనేం చేస్తున్నారు..? ఇది నా అడ్డ అని కేవలం తెలుగు ఇండస్ట్రీ వరకు మాత్రమే కాదు.. ఇండియా మొత్తం పాడాలని చూస్తున్నారు బన్నీ. ఇప్పటికే తెలుగు, హిందీలో అల్లు అర్జున్ టాప్‌లో ఉన్నారు. టాలీవుడ్‌లో ఐకాన్ స్టార్ మార్కెట్ గురించి ఏం చెప్పాలి..? పుష్ప ఫ్రాంచైజీతో అగ్ర పీఠం వైపు అడుగేస్తున్నారు బన్నీ. అలాగే హిందీలోనూ టాప్ చైర్ ఇప్పటికీ పుష్ప చేతుల్లోనే ఉంది. కెరీర్ విషయంలో చాలా తెలివిగా అడుగులేస్తున్నారు అల్లు అర్జున్. తెలుగు, హిందీలోనే కాదు.. మలయాళంలోనూ బన్నీ ఫాలోయింగ్ పీక్స్‌లో ఉంది. కన్నడలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది ఈ హీరోకు..! ఇప్పుడు తమిళంపై కన్నేస్తున్నాడు. అందుకే వరసగా అరవ దర్శకులతో పని చేస్తున్నారీయన. ఈ క్రమంలోనే అట్లీ సినిమా సెట్స్‌పై ఉంది. జవాన్‌తో హిందీలోనూ తన మార్క్ చూపించారు అట్లీ. ఇక పుష్పతో బన్నీ ఫాలోయింగ్ చెప్పనక్కర్లేదు. అట్లీ కారణంగా అల్లు అర్జున్ కూడా తమిళంలో సెటిల్ అయిపోతారు. ఎందుకంటే పుష్ప ఫ్రాంచైజీ తమిళనాట బాగా కలెక్ట్ చేసింది. ఇప్పుడు అట్లీతో అక్కడ సెటిల్ అవ్వాలని చూస్తున్నారు.. మరోవైపు నెక్ట్స్ సినిమాను లోకేష్ కనకరాజ్‌తో ప్లాన్ చేస్తున్నారు బన్నీ. కూలీ యావరేజ్‌గా ఆడినా.. లోకేష్ కనకరాజ్ సినిమాలకు సపరేట్ ఫాలోయింగ్ ఉంటుంది. బన్నీ ఇమేజ్‌కు లోకేష్ మ్యాజిక్ వర్కవుట్ అయితే తమిళంలోనూ టాప్‌లోకి చేరడమే కాదు.. అసలైన ప్యాన్ ఇండియన్ హీరోగా అన్ని చోట్లా జెండా పాతేస్తారు అల్లు వారబ్బాయి. వీటితో పాటే త్రివిక్రమ్‌తో మైథలాజికల్ సినిమా కూడా లైన్‌లోనే ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మేటర్ లేకుండానే.. సీక్వెల్స్ అనౌన్స్ చేస్తున్నారు.. ఏంటి బాస్ ఇది
Pawan Kalyan: మరో సినిమా అనౌన్స్ చేసిన పవర్ స్టార్.. సర్‌ప్రైజ్ అదిరిందిగా
Sreeleela: ఇప్పటి వరకు నా ఫెయిల్యూర్స్ మాత్రమే చూసారు.. ఇక నుండి నా సక్సెస్ చూస్తారు
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న బ్యూటీస్
Dhurandhar: ఏ మాత్రం తగ్గని ధురంధర్ హవా.. ఒక్కో రికార్డులు తిరగరాస్తుందిగా
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ... కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు
తల్లికి ఉన్న రూ.12 లక్షల అప్పును తీర్చిన టీనేజ్ కొడుకు
కోతుల కొరత.. ఒక్కో కోతికి రూ.25 లక్షలు ఇస్తాం
అనకొండ తలపై నాగిని డాన్స్.. జోక్ కాదు.. ఇది సీరియస్ మ్యాటర్
గోదావరిలో చిక్కిన బాహుబలి చేప.. ధర ఎంతంటే
భారతీయుడి మంచితనానికి కన్నీళ్లు పెట్టుకున్న అమెరికన్ జంట
ఇక్కడ కాబట్టి అర్ధరాత్రి ఒంటరిగా నడుస్తున్నా.. అదే ఆ దేశం అయితే

