సర్కారు వారి మాట కోసం సంక్రాంతి సినిమాల వెయిటింగ్
సంక్రాంతికి భారీ సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో టికెట్ ధరల పెంపుపై తెలంగాణ, ఏపీలో తీవ్ర చర్చ నడుస్తోంది. అఖండ 2 వివాదం తర్వాత, ప్రభుత్వాలు ధరల పెంపుపై ఆచితూచి అడుగులేస్తున్నాయి. ప్రీమియర్లతో పాటు భారీ రేట్లను సామాన్యులు ఆమోదిస్తారా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు.
సంక్రాంతి సినిమాలు దగ్గరికి వచ్చేస్తున్నాయి.. పైగా అన్నీ భారీ సినిమాలే. లెక్కలేయట్లేదు కానీ వేస్తే.. 1000 కోట్లకు పైగానే బడ్జెట్ కళ్ల ముందు కనిపిస్తుంది. పైగా ప్రీమియర్స్ కూడా ఉంటాయంటున్నారు.. మరి టికెట్ రేట్లపై క్లారిటీ వచ్చేదెప్పుడు..? తెలంగాణలో రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారు రేట్లు పెరుగుతున్నాయా లేదంటే పాత రేట్లకు వస్తున్నాయా..? ఏపీలో పరిస్థితేంటి..? సంక్రాంతి పండగ దగ్గరపడుతున్న కొద్దీ టాలీవుడ్‌లో బాక్సాఫీస్ హీట్ మాత్రమే కాదు.. టికెట్ రేట్లపై చర్చ కూడా తారాస్థాయికి చేరుతుంది. ఒకవైపు పాన్ ప్రభాస్.. మరోవైపు చిరంజీవి రంగంలోకి దిగుతున్నారు. నిర్మాతలు తమ కంటెంట్‌పై నమ్మకంతో పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు. అంతా బానే ఉన్నా.. టికెట్ రేట్ల విషయంలో మాత్రం సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇదివరకటిలా ఇష్టమొచ్చినట్లు రేట్లు పెంచితే జనం థియేటర్లకు వస్తారా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. మొన్న అఖండ 2కు తెలంగాణలో రేట్లు పెంచితే.. విపరీతమైన వ్యతిరేకత రావడమే కాదు.. ఏకంగా మంత్రి కోమటిరెడ్డి సీరియస్ అయ్యారు. ఇకపై నో హైక్స్ అన్నారు. ఆ ఎఫెక్ట్ సంక్రాంతి సినిమాలపై పడుతుందిప్పుడు. అందుకే సర్కార్ రేట్ల పెంపు విషయంలో ఆచితూచి అడుగులేస్తుంది. అందరి దృష్టి రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారు సినిమాలపైనే ఉందిప్పుడు. ఏపీలో రేట్ల పెంపుకు పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు కానీ.. తెలంగాణ పరిస్థితే ఉత్కంఠ రేపుతోంది. 295 దాటి.. 400, 500 రూపాయలు అంటూ ప్రపోజల్స్ పెడితే ప్రభుత్వం రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. పైగా అఖండ 2 టైంలో వచ్చిన హీట్ ఇంకా చల్లారలేదు. మరోవైపు ఈ రేట్లతో సంబంధం లేకుండా భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారి నారి నడుమ మురారి, అనగనగా ఒక రాజు బరిలో దిగుతున్నాయి. ఇవి సేఫ్ జోన్‌లోనే ఉన్నాయి. హైక్స్ జోలికి వెళ్లకుండా.. రెగ్యులర్ రేట్లకే ప్రేక్షకుల ముందుకొస్తున్నారు వీళ్లు. మొత్తానికి పండగ సినిమాల రేట్లు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bala Krishna: NBK111 సినిమాపై ఇంట్రెస్టింగ్ విషయాలు.. నిజంగా అలా ఉండబోతుందా
Allu Arjun: కెరీర్ కోసం కత్తిలాంటి ప్లానింగ్.. అల్లు అర్జున్ అంటే ఆమాత్రం ఉంటది
మేటర్ లేకుండానే.. సీక్వెల్స్ అనౌన్స్ చేస్తున్నారు.. ఏంటి బాస్ ఇది
Pawan Kalyan: మరో సినిమా అనౌన్స్ చేసిన పవర్ స్టార్.. సర్‌ప్రైజ్ అదిరిందిగా
Sreeleela: ఇప్పటి వరకు నా ఫెయిల్యూర్స్ మాత్రమే చూసారు.. ఇక నుండి నా సక్సెస్ చూస్తారు
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ... కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు
తల్లికి ఉన్న రూ.12 లక్షల అప్పును తీర్చిన టీనేజ్ కొడుకు
కోతుల కొరత.. ఒక్కో కోతికి రూ.25 లక్షలు ఇస్తాం
అనకొండ తలపై నాగిని డాన్స్.. జోక్ కాదు.. ఇది సీరియస్ మ్యాటర్
గోదావరిలో చిక్కిన బాహుబలి చేప.. ధర ఎంతంటే
భారతీయుడి మంచితనానికి కన్నీళ్లు పెట్టుకున్న అమెరికన్ జంట
ఇక్కడ కాబట్టి అర్ధరాత్రి ఒంటరిగా నడుస్తున్నా.. అదే ఆ దేశం అయితే

