TTD: ఇకపై శ్రీవారి భక్తుల చెంతకే జల ప్రసాదం..
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గత 25 ఏళ్లుగా శ్రీవారి సేవ ద్వారా భక్తులకు అద్భుత సేవలు అందిస్తోంది. 17 లక్షల మందికి పైగా సేవకులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఇప్పుడు మొబైల్ జల ప్రసాదం ప్రయోగాత్మకంగా మొదలైంది. వైకుంఠ ద్వార దర్శనాల కోసం క్యూలైన్లలో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు వాటర్ క్యాన్లతో తాగునీటిని నేరుగా అందిస్తారు. ఇది భక్తులకు గొప్ప సౌకర్యం.
తిరుమల తిరుపతి దేవస్థానం పాతికేళ్లుగా శ్రీవారి సేవకులతో వెంకన్న దర్శనం కోసం వచ్చే భక్తులకు సేవలు అందిస్తుంది. 25 ఏళ్లలో 17 లక్షల మందికి పైగా సేవకులు.. శ్రీవారి సేవలో తరించారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు శ్రీవారి సేవకులు అన్నీ తామై సేవలందిస్తున్నారు. ఈ సేవలో సామాన్యులనుంచి సంపన్నులదాకా అందరూ ఎంతో భక్తితో పాల్గొంటారు. ఈ క్రమంలోనే టీటీడీ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 2000 సంవత్సరం నవంబర్ లో టీటీడీ.. శ్రీవారి సేవను ప్రారంభించింది. నాటి నుంచి దశల వారీగా వివిధ రకాల సేవలను శ్రీవారి సేవకులు అందిస్తూ వస్తున్నారు. తాజాగా, ఇప్పుడు తిరుమలలో మొబైల్ జల ప్రసాదం విధానాన్ని టీటీడీ ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. వైకుంఠ ద్వార దర్శనాల కోసం తిరుమలకు వస్తున్న భక్తుల వద్దకే తాగునీటిని తీసుకెళ్లటమే ఈ కార్యక్రమం లక్ష్యం. స్వామి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం ప్రస్తుతం క్యూ లైన్లలో అక్కడక్కడ కుళాయిలు, చల్లని నీరు అందించే యంత్రాలు ఉన్నాయి. కాగా, ఆలయ కాంప్లెక్స్ బయట క్యూ లైన్లలో నిలబడే భక్తుల కోసం ఇకపై.. 10 లీటర్ల వాటర్ క్యాన్ లను శ్రీవారి సేవకులు వీపుకు తగిలించుకుని భక్తుల వద్దకే వెళ్లి తాగునీటిని అందించనున్నారు. తిరుమలలో నిరంతరం 15 క్యాన్లతో ప్రారంభించిన ఈ సేవను కొన్నాళ్లు అమలు చేసి.. ఫలితాలను బట్టి దీనిని మరింత విస్తరించాలని టీటీడీ నిర్ణయించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కంచే చేను మేయడమంటే ఇదే.. ఏకంగా దేవుడికే పంగనామాలు పెట్టారుగా
విజయ్ సినిమాకు సెన్సార్ చిక్కులు కోర్టుకెక్కిన హీరో
Janhvi Kapoor: ఆస్కార్‌కు అడుగు దూరంలో జాన్వీ మూవీ
The Raja Saab: క్లైమాక్స్ నెక్స్ట్ లెవల్.. మామూలుగా ఉండదు
ఓవైపు జైల్లో భర్త.. మరోవైపు వేధింపులు.. దారుణంగా దర్శన్ భార్య పరిస్థితి
పండగ వేళ ప్రాణాలు తీసే హంతకి.. జర భద్రం
పంటచేలో కూలీలకు గన్తో పహారా కాస్తున్న రైతు
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ... కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు
తల్లికి ఉన్న రూ.12 లక్షల అప్పును తీర్చిన టీనేజ్ కొడుకు
కోతుల కొరత.. ఒక్కో కోతికి రూ.25 లక్షలు ఇస్తాం
అనకొండ తలపై నాగిని డాన్స్.. జోక్ కాదు.. ఇది సీరియస్ మ్యాటర్
గోదావరిలో చిక్కిన బాహుబలి చేప.. ధర ఎంతంటే

