దుర్గమ్మ దర్శనానికి వెళుతున్నారా ?? ఇంద్రకీలాద్రిపై మారిన రూల్స్ తెలుసుకోండి
విజయవాడ కనకదుర్గ ఆలయంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. వీఐపీ, వీవీఐపీ దర్శనాలకు ఇకపై తప్పనిసరిగా టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆలయ ఆదాయ పెంపునకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, రూ. 500 అంతరాలయ దర్శనం టికెట్ తీసుకున్న భక్తులకు నేరుగా ఉచిత లడ్డు ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ఇది భక్తుల సౌకర్యార్థం, పారదర్శకత కోసం ప్రవేశపెట్టారు.
వీఐపీ అయినా వీవీఐపీ అయినా ఇక నుంచి టికెట్ ఉంటేనే దర్శనం.. ఎంతటి వారైనా టికెట్ కొనుగోలు చేయాల్సిందే అంటోంది విజయవాడ కనకదుర్గ టెంపుల్. ఈ మేరకు ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వీఐపీ, వీవీఐపీ దర్శనాలకు వచ్చే వారు సైతం తప్పనిసరిగా దర్శనం టికెట్లు కొనుగోలు చేయాల్సిందేనని నిర్ణయించారు. అమ్మవారి హుండీ ఆదాయాన్ని, ఆలయ నిర్వహణ నిధులను పెంచడమే లక్ష్యంగా ఈ కొత్త నిబంధన తీసుకొచ్చినట్లుగా అధికారులు తెలిపారు. సాధారణ రోజుల్లో సుమారు 30 వేల మంది ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. అదే వీకెండ్ లో 50 వేల వరకు భక్తులు వస్తున్నారు. అయితే ఇందులో 200 నుంచి 300 మంది వరకు వీఐపీ, వీవీఐపీ సిఫారసు లేఖలతో ఆలయానికి వస్తున్నారు. వారు టికెట్ కొనకుండానే దర్శనం చేసుకుంటున్నట్లు ఆలయ ఈవో శీనా నాయక్ దృష్టికి వచ్చింది. మరికొంతమంది ప్రొటోకాల్ పేరుతో టికెట్ లేకుండానే దర్శనాలు చేసుకుంటారని కూడా తెలిసింది. దీనివల్ల ఆలయ ఆదాయానికి గండి పడుతుందని ఆలయ అధికారులు భావించారు. దీనికి అడ్డుకట్ట వేయాలని ధర్మకర్తల మండలి సమావేశంలో చర్చించారు. ఈ క్రమంలోనే వీఐపీ, వీవీఐపీ దర్శనం చేసుకునే వారు సైతం టికెట్లు కొనుగోలు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సిఫారసు లేఖలతో వచ్చే ప్రతి ఒక్కరూ టికెట్ కొనాల్సిందేనని ఆదేవాలు జారీ చేశారు. మరోవైపు.. భక్తుల సౌకర్యార్థం విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయ అధికారులు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే ఇంద్రకీలాద్రి ఆలయంలో కూడా ఉచిత లడ్డు ప్రసాద విధానాన్ని ప్రారంభించారు. 500 రూపాయల అంతరాలయ దర్శనం టికెట్ తీసుకున్న భక్తులకు ఇకపై లడ్డు ప్రసాదాన్ని నేరుగా టికెట్ స్కానింగ్ వద్దనే ప్రసాదం అందజేయమన్నారు. దర్శనానికి వెళ్లే సమయంలోనే భక్తులకు ప్రసాదం అందించడంతో ప్రక్రియ మరింత సులభంగా మారనుందని అధికారులు భావిస్తున్నారు. టికెట్ స్కాన్ అయిన వెంటనే లడ్డు అందజేయడం ద్వారా ప్రసాద పంపిణీలో పూర్తి పారదర్శకత సాధ్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సర్పంచ్ ఉదారత.. పుట్టిన ప్రతి ఆడబిడ్డకు రూ.5000 డిపాజిట్
TTD: ఇకపై శ్రీవారి భక్తుల చెంతకే జల ప్రసాదం..
కంచే చేను మేయడమంటే ఇదే.. ఏకంగా దేవుడికే పంగనామాలు పెట్టారుగా
పండగ వేళ ప్రాణాలు తీసే హంతకి.. జర భద్రం
పంటచేలో కూలీలకు గన్తో పహారా కాస్తున్న రైతు
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ... కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు
తల్లికి ఉన్న రూ.12 లక్షల అప్పును తీర్చిన టీనేజ్ కొడుకు
కోతుల కొరత.. ఒక్కో కోతికి రూ.25 లక్షలు ఇస్తాం
అనకొండ తలపై నాగిని డాన్స్.. జోక్ కాదు.. ఇది సీరియస్ మ్యాటర్
గోదావరిలో చిక్కిన బాహుబలి చేప.. ధర ఎంతంటే

