ఓర్నీ.. స్మశానంలో అదేంపనిరా సామీ.. చివరికి వీటిని కూడా వదలరా!
హైదరాబాద్ పాతబస్తీలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. స్మశానంలోని సమాధులపై జనం భక్తితో ఉంచిన పూలను ఓ వ్యక్తి ఏరుకుంటున్న వీడియో వైరల్ అయ్యింది. మొగల్‌పురా పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికులను, నెటిజన్లను షాక్‌కు గురిచేసింది. ఆ పూలను దేనికి ఉపయోగిస్తాడు, మళ్ళీ అమ్ముతాడా అని ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా బంగారమో, డబ్బో ఎత్తుకెళ్లే వారిని మనం చూస్తుంటాం. కానీ పూలను దొంగతనం చేసేవాళ్లను మీరెప్పుడైనా చూశారా.. అది కూడా స్మశానంలో సమాధులపై ఉన్న పూలను ఎత్తుకెళ్లే వాళ్లను చూశారా. అయితే ఇప్పుడు చూడండి. స్మశానానికి వచ్చి, చనిపోయిన తమ పెద్దలను తలచుకుని, వారి పట్ల గౌరవంతో జనాలు సమాధిపై పూలు పరిచి వెళ్ళిపోతుంటే.. ఓ ప్రబుద్ధుడు వాటిని ఏరుకున్నాడు. దీనిని గమనించిన అక్కడి జనం.. ఆ దృశ్యాలను ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది. హైదరాబాద్ నగరం పాతబస్తీ ప్రాంతంలోని మొగల్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ శ్మశానంలో సమాధులపైన ఉన్న పూలను దొంగతనం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి ఓ సమాధిపై కూర్చుని ఆ ప్రాంతమంతా శుభ్రం చేశాడు. ఆ తర్వాత సమాధిపై ఉన్న పూలను తీసుకుని మూట గట్టుకున్నాడు. శుభ్రం చేసే వరకు బాగానే ఉంది.. కానీ అక్కడ ఉన్న పూలు ఎందుకు తీసుకెళ్లాడనేది అర్థం కావట్లేదని నిర్వాహకులు చెబుతున్నారు. పైగా సమాధులుండే స్మశానం అంటే టక్కున అడుగుపెట్టటానికి ఎవరైనా వెనకాడుతుంటారు. అక్కడ తిరగటం అశుభం అని కూడా చాలామంది భావిస్తుంటారు. అలాంటిది సమాధిపై ఉన్న పూలు తీసుకెళ్లడం ఏంటని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనా ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన జనాలు కొంపతీసి..ఆ వ్యక్తి ఆ పువ్వులను మళ్లీ అమ్మడు కదా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ATMలలో రూ. 500 ఆపేస్తున్నారా ?? మార్చి 2026 డెడ్‌లైన్‌పై కేంద్రం క్లారిటీ
ఓ ప్రాణం కాపాడేందుకు.. కూతురికి ఇచ్చిన మాట తప్పా.. వైరల్‌గా డాక్టర్ పోస్ట్
బాలుడికి కలలో దేవుడు చెప్పినమాట.. అక్కడ తవ్విచూడగా.. షాక్
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ... కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు
తల్లికి ఉన్న రూ.12 లక్షల అప్పును తీర్చిన టీనేజ్ కొడుకు
కోతుల కొరత.. ఒక్కో కోతికి రూ.25 లక్షలు ఇస్తాం
అనకొండ తలపై నాగిని డాన్స్.. జోక్ కాదు.. ఇది సీరియస్ మ్యాటర్
గోదావరిలో చిక్కిన బాహుబలి చేప.. ధర ఎంతంటే
భారతీయుడి మంచితనానికి కన్నీళ్లు పెట్టుకున్న అమెరికన్ జంట
ఇక్కడ కాబట్టి అర్ధరాత్రి ఒంటరిగా నడుస్తున్నా.. అదే ఆ దేశం అయితే

