Gold Price: బంగారం ఇక కొనలేమా.. 24 క్యారెట్ల పసిడి ధర ఎంతంటే
బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. 2026లోనూ పసిడి ధరలు తగ్గే సూచనలు లేవు. జనవరి 7న 24 క్యారెట్ల బంగారం రూ.660 పెరిగి రూ.1,39,480కి, కిలో వెండి రూ.12,000 పెరిగి రూ.2,83,000కి చేరింది. వినియోగదారులు కొనే ముందు తాజా ధరలు తనిఖీ చేసుకోవడం మంచిది. బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి.
బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. 2025లో వినియోగదారులకు చుక్కలు చూపించిన పసిడి ధరలు 2026లో అయినా తగ్గుతాయని భావిస్తే.. తగ్గేదే లేదంటూ దూసుకుపోతున్నాయి. జనవరి మొదటి వారంలోనే బంగారం ధరలు నింగిని తాకాయి. సామాన్యులకు కొనాలంటేనే వణుకు పుడుతోంది. జనవరి 7 బుధవారం కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.660 లు పెరిగి రూ.1,39,480లకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.600లు పెరిగి రూ. 1,27,850లకు చేరింది. కిలో వెండిపై రూ. 12,000 పెరిగి రూ.2,83,000 పలుకుతోంది. పెరిగిన తర్వాత దేశంలోని వివిధ నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,39,630, పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,28,000 పలుకుతోంది. ముంబై, కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,480 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,27,850 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,400, ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,700 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,39,480 ఉంటే.. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,27,850 పలుకుతోంది. కిలో వెండి ధర రూ.2,83,000 పలుకుతోంది. ఈ ధరలు మధ్యాహ్నం 12 గంటలకు నమోదైనవి.. ఇవి పెరగవచ్చు, తగ్గవచ్చు. బంగారం కొనడానికి వెళ్లేముందు మరోసారి ధరలు చెక్‌చేసుకుంటే మంచిది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఓర్నీ.. స్మశానంలో అదేంపనిరా సామీ.. చివరికి వీటిని కూడా వదలరా!
ATMలలో రూ. 500 ఆపేస్తున్నారా ?? మార్చి 2026 డెడ్‌లైన్‌పై కేంద్రం క్లారిటీ
ఓ ప్రాణం కాపాడేందుకు.. కూతురికి ఇచ్చిన మాట తప్పా.. వైరల్‌గా డాక్టర్ పోస్ట్
కోతుల కొరత.. ఒక్కో కోతికి రూ.25 లక్షలు ఇస్తాం
అనకొండ తలపై నాగిని డాన్స్.. జోక్ కాదు.. ఇది సీరియస్ మ్యాటర్
గోదావరిలో చిక్కిన బాహుబలి చేప.. ధర ఎంతంటే
భారతీయుడి మంచితనానికి కన్నీళ్లు పెట్టుకున్న అమెరికన్ జంట
ఇక్కడ కాబట్టి అర్ధరాత్రి ఒంటరిగా నడుస్తున్నా.. అదే ఆ దేశం అయితే
వేగంగా దూసుకెళ్తున్న రైలు.. రైలుకు వేళాడుతూ యువకుడు
టెన్షన్ పెడుతోన్న బాబా వంగా జ్యోతిష్యం.. ఈ ఏడాది జరిగేది ఇదేనట

