పాపం..! అల్లుడు ఇంటికి వచ్చాడని మర్యాద చేస్తే.. ఎంతకూ తెగించాడు..!
‘మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు..’ అనే పాట అక్షర సత్యం అనిపిస్తుంది ఒక్కోసారి..! బంధాలన్నీ ఆర్థిక బంధాలుగా మారిపోతున్నాయి. డబ్బు.. అస్తి కోసం సొంత వాళ్ళను సైతం హతమారుస్తున్నారు కొంతమంది. వావి వరసలు మరిచి మృగాళ్ల వ్యవహరిస్తున్నారు. అచ్చు ఇలాగే వ్యవహరించాడు సిద్దిపేట జిల్లాలో ఓ వ్యక్తి.. ఆస్తి కోసం సొంత అల్లుడే అత్తను అత్యంత పాశవికంగా చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది.

కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రాములమ్మ రాజీవ్ రహదారి పక్కన హోటల్ నడుపుతూ జీవనం సాగిస్తోంది. రాములమ్మ తన కూతురుకి ములుగు మండలం తునికి బొల్లారం గ్రామానికి చెందిన జీవన్ రెడ్డితో వివాహం జరిపించింది. అయితే, రాములమ్మ పేరిట ఉన్న రెండెకరాల భూమి కోసం అల్లుడితో తరచూ గొడవలు జరుగుతుండేవి. కాగా, తాను చనిపోయిన తర్వాత భూమిని తీసుకోండి అని రాములమ్మ అల్లుడితో తేల్చి చెప్పినట్లుగా తెలిసింది.
ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న అల్లుడు జీవన్ రెడ్డి మంగళవారం (జనవరి 06) రోజున పథకం ప్రకారం తనతో మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి అత్తవారి ఇంటికి ముందు ద్వారం ద్వారా వెళ్ళాడు. అక్కడే ఛాయ్ తాగి ముందు డోర్ ను మూసివేసి రాములమ్మను టవల్ మెడకు బిగించి హత్య చేశాడు. వెనుకాల డోర్ నుండి నిందితుడు జీవన్ రెడ్డి, తనతో వచ్చిన ముగ్గురు వ్యక్తులు పరార్ అయ్యారు. అలస్యంగా విషయం గమనించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు చేపట్టారు. అయితే నిందితుడితోపాటు తనతో వచ్చిన వారి చెప్పులను, హెల్మెట్‌ను సైతం గుమ్మం ముందే వదిలి వెళ్ళినట్లుగా పోలీసులు గుర్తించారు. కుటుంబసభ్యులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..