లంచం తీసుకుంటూ అడ్డగా బుక్కైన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్.. నెట్టింట వీడియో వైరల్..!
అవినీతి అధికారులపై ఓ వైపు ఏసీబీ వరుస దాడులు చేస్తున్నా.. కొందరు అధికారుల్లో మార్పు రావడం లేదు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ జయప్రకాష్ లంచం తీసుకుంటున్న వీడియోలు సోషల్ మీడియోలో వైరల్‌గా మారాయి. ఈ విషయం కాస్తా, ఉన్నతాధికారులకు చేరింది. సదరు అధికారిపై శాఖాపరమైన చర్యలకు సిద్దమయ్యారు.

అవినీతి అధికారులపై ఓ వైపు ఏసీబీ వరుస దాడులు చేస్తున్నా.. కొందరు అధికారుల్లో మార్పు రావడం లేదు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ జయప్రకాష్ లంచం తీసుకుంటున్న వీడియోలు సోషల్ మీడియోలో వైరల్‌గా మారాయి. ఈ విషయం కాస్తా, ఉన్నతాధికారులకు చేరింది. సదరు అధికారిపై శాఖాపరమైన చర్యలకు సిద్దమయ్యారు..
జిన్నారం మండలం గడ్డపోతారం మునిసిపల్ పరిధిలోని అల్లీపూర్ గ్రామంలోని సర్వే నెంబర్ 27 లోని ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఈ విషయంలో ఓ వ్యక్తి దగ్గర నుంచి లంచం తీసుకుంటూన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే సదరు సర్వే నెంబర్ లో చేపట్టిన నిర్మాణాన్ని రెవెన్యూ అధికారులు మంగళవారం (జనవరి 06) కూల్చివేశారు. దాంతో తన వద్ద అధికారులు లంచం తీసుకుని నిర్మాణాన్ని తొలగించడంపై సదరు వ్యక్తి ఆర్ఐకి లంచం ఇచ్చిన వీడియో ను బయటపెట్టినట్లు తెలుస్తోంది.
ఈ విషయంపై జిన్నారం తహశీల్దార్ దేవదాసు స్పందించారు.. సోషల్ మీడియాలో వచ్చిన కథనాల అధారంగా ఆర్ఐపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. డిప్యూటీ తహశీల్దార్ ఆధ్వర్యంలో ఎంక్వయిరీ జరుగుతోందని, వచ్చిన నివేదికను జిల్లా కలెక్టర్, ఉన్నత స్థాయి అధికారులకు పంపించి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ తెలిపారు…
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
