Telangana: మెల్లమెల్లగా కోరలు చాస్తున్న మత్తు రాక్షసి.. పోలీస్ ఆపరేషన్లలో బయటపడ్డ షాకింగ్ నిజాలు!
తెలంగాణలో డ్రగ్స్ నెట్‌వర్క్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అటు ఐటీ హబ్ గచ్చిబౌలి ఇటు కొమురం భీం జిల్లాలో జరిగిన వేర్వేరు ఆపరేషన్లలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. హోటల్‌లో పట్టుబడ్డ వారందరికీ డ్రగ్ కిట్స్ ద్వారా పరీక్షలు నిర్వహించగా.. ఐదుగురికి గంజాయి పాజిటివ్ అని తేలింది. నిందితులంతా స్టార్ హోటల్స్‌లో పనిచేసే వారిగా గుర్తించారు.

తెలంగాణలో డ్రగ్స్ కట్టడికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, మత్తు రాక్షసి కోరలు చాస్తూనే ఉంది. హైదరాబాద్ గచ్చిబౌలిలో తెలంగాణ ఈగల్ టీమ్, స్థానిక పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ దాడుల్లో ఓ పోలీస్ కానిస్టేబుల్ కూడా గంజాయి సేవిస్తూ దొరికిపోవడం చర్చనీయాంశంగా మారింది. గచ్చిబౌలిలోని ఒక హోటల్‌పై పోలీసులు దాడి చేయగా, గంజాయి తాగుతూ ఒక AR కానిస్టేబుల్ అడ్డంగా బుక్కయ్యాడు. ఇక హోటల్‌లో పట్టుబడ్డ వారందరికీ డ్రగ్ కిట్స్ ద్వారా పరీక్షలు నిర్వహించగా.. ఐదుగురికి గంజాయి పాజిటివ్ అని తేలింది. నిందితులంతా స్టార్ హోటల్స్‌లో పనిచేసే వారిగా గుర్తించారు.
నగరాలకే పరిమితం అనుకున్న డ్రగ్స్ మహమ్మారి ఇప్పుడు జిల్లాల గల్లీల్లోకి పాకింది. కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని బజార్ వాడి ఏరియాలో పోలీసులు ఒక డ్రగ్ దందాను ఛేదించారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు బజార్ వాడి ప్రాంతంలో ఆకస్మిక దాడులు నిర్వహించి, మత్తు పదార్థాలను విక్రయిస్తున్న నలుగురిని పట్టుకున్నారు. నిందితుల నుంచి 150 గ్రాముల గంజాయి, మత్తు కోసం ఉపయోగిస్తున్న డ్రగ్ సిరంజీలు, ఇతర నిషేధిత మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులను రిమాండ్‌కు తరలించారు.
నగరాల నుంచి పల్లెల వరకు పాకుతున్న ఈ డ్రగ్ కల్చర్‌పై తెలంగాణ పోలీస్ శాఖ సీరియస్ యాక్షన్‌కు దిగింది. నిందితులు ఎవరైనా, ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని హెచ్చరిస్తోంది. యువతను మత్తు ఊబిలోకి లాగుతున్న ఇలాంటి ముఠాల సమాచారం తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు పోలీసులు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
