నాడు నోరు జారడం.. పొరపాటు! నేడు జారకపోతే.. ఏదో లోపించినట్టు!
ఇంగ్లీష్‌లో అక్షరాలు తక్కువే.. పదాలూ తక్కువే. ఆ సందర్భాన్ని వివరించడాన్ని పదాలు కూడా ఉండవు ఒక్కోసారి. ఆంగ్ల భాష అంతవరకే పరిమితం. అందుకే చూడండి.. 'S'తో వచ్చే షిట్ అనే వర్డ్‌ని, 'F'తో వచ్చే ఒక బూతుని పదే పదే వాడుతుంటారు. ఆ పదం లేకుండా మాట్లాడలేరు, ఒక్క హాలీవుడ్ మూవీ కూడా ఉండదు. సో, ఏదైనా చెప్పాలనుకుంటే బూతు ఒక్కటే ఆధారం వాళ్లకి. తెలుగు భాషకు ఆ ఇబ్బంది లేదు. ఒకే సిచ్యుయేషన్‌ను ఎన్నిరకాలుగానైనా చెప్పొచ్చు. బట్.. ఇంట, బయట, ఉద్యమానికి, రాజకీయానికి ఇలా అన్ని అవసరాలకు సరిపోయిన తెలుగు భాష.. ఇప్పుడెందుకనో సరిపోవడం లేదు. ఇక్కడ కూడా తిట్లు కమ్మేశాయి. ముఖ్యంగా రాజకీయాల్లో మరీ ఎక్కువైందీ పోకడ. ఒకనాడు నోరు జారితే.. 'అది పొరపాటే' అని చెప్పుకునేవారు. ఇప్పుడు నోరు జారకపోతే.. ఏదో లోపించినట్టుగా భావిస్తున్నారు. తిట్టుకోవడమే రాజకీయం అనేంతగా దిగజార్చారు. వాళ్లూ వీళ్లూ అని కాదు. అందరిదీ అదే దారి. తిట్టుకు తిట్టే ఆన్సర్.. తిట్టుకు తిట్టే కౌంటర్. అసలెందుకని ఇంతలా దిగజారాల్సి వస్తోంది? ఎందుకని ఎవరూ అడ్డుకట్ట వేయలేకపోతున్నారు?

ప్రశ్నించడమే రాజకీయం. బట్ ఎన్నాళ్లని ప్రశ్నిస్తూనే ఉంటారు. అందుకే, ప్రత్యర్ధికి చురుక్కుమనేలా విమర్శలు జోడించారు. అది ప్రజలకు నవ్వు తెప్పించింది, నచ్చింది. అందుకే విమర్శలు రాకూడదనేంతగా జాగ్రత్త పడ్డారు ఒకనాటి రాజకీయ నాయకులు. ఇప్పుడు ఆ విమర్శలకు కూడా కాలం చెల్లింది. వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. అందులో తిట్లను జోడిస్తున్నారు. అనవసరంగా కుటుంబ సభ్యులను లాగుతున్నారు. సిద్ధాంతాలపైనా, అభివృద్ధిపైనా జరగాల్సిన చర్చలు, రాజకీయాలు.. ఇప్పుడు కర్ణకఠోర భాషా ప్రయోగాలకు వేదిక అవుతున్నాయి. పిల్లలు గానీ ఆ నాయకుల భాష వింటే.. ‘భాష అంటే అదేనేమో, అలాగే మాట్లాడాలేమో’ అని అనుకున్నా అనుకుంటారు. ఆదర్శంగా ఉండాల్సిన ఒక స్థాయి నాయకులే తమ హోదాను, హుందాతనాన్ని పక్కనపెట్టి అలా మాట్లాడుతుండే సరికి.. ఇదే సరైన భాష అని కిందిస్థాయి వాళ్లు కూడా అనుసరిస్తున్నారు. రానున్న రోజుల్లో ఇదెంత ప్రమాదకరంగా మారబోతోందో ఊహించుకుంటేనే భయమేస్తోంది. తిట్టడమే.. విమర్శలనుకుంటున్నారు..! సన్నాసి.. డ్యాష్ కొడుకులు.. లుచ్చా నా కొడుకులు.. కిరికిరి నా కొడుకులు.. వెధవలు.. దరిద్రులు, భట్టేబాజ్, బేవకూఫ్, హౌలే, మల్లిగాడు, కోతల పోషిగాడు.. బ్రోకర్.. ఆరేయ్ కుక్క.. జోకుడుగాళ్లు, సాలే.. గూట్లే.. అసలు ఆపుదామంటే అంతే దొరకడం లేదు ఈ తిట్లకు, ఈ పదాలకు. ఇవన్నీ మన నేతల నోటి నుంచి జాలువారిన ఆణిముత్యాలే. ఒకరిని మించి మరొకరు ఇచ్చిపుచ్చుకున్న తిట్లబిరుదులు ఇవన్నీ. చట్టసభల్లో కూర్చుంటున్న వారు సైతం.. మరీ ఇలాంటి చిల్లర పదాలతో తిట్టిపోసుకుంటున్న తీరు చూస్తుంటే అసహ్యమేస్తోంది నిజంగా. ఎవరు...
