AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేచురల్ గ్లో కోసం ముల్తానీ మట్టి బెస్ట్ ఆప్షన్.. కానీ అందరికీ కాదు! ఈ 3 రకాల చర్మం ఉన్నవారు పొరపాటున కూడా దీనిని తాకవద్దు!

ప్రస్తుత కాలంలో మార్కెట్‌లో ఎన్నో క్రీములు అందుబాటులో ఉన్నాయి. అయితే సహజసిద్ధమైన పద్ధతుల్లో ముఖాన్ని మెరిపించుకోవాలని అనుకునేవారు ముందుగా ఆశ్రయించేది 'ముల్తానీ మట్టి'. తరతరాలుగా వస్తున్న ఈ బ్యూటీ సీక్రెట్ మొటిమలను తగ్గించడంలో, చర్మంపై ఉండే అదనపు నూనెను తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

నేచురల్ గ్లో కోసం ముల్తానీ మట్టి బెస్ట్ ఆప్షన్.. కానీ అందరికీ కాదు! ఈ 3 రకాల చర్మం ఉన్నవారు పొరపాటున కూడా దీనిని తాకవద్దు!
Multani Matti.
Nikhil
|

Updated on: Jan 07, 2026 | 11:38 PM

Share

అందుకే చాలామంది దీనిని ఒక సంజీవనిలా భావిస్తుంటారు. అయితే, నాణేనికి రెండో వైపు ఉన్నట్లుగా.. ముల్తానీ మట్టి అందరికీ అమృతంలా పనిచేయదు. సరైన అవగాహన లేకుండా, చర్మ స్వభావాన్ని గుర్తించకుండా దీనిని వాడితే ముఖంపై లేనిపోని సమస్యలు కొనితెచ్చుకున్నట్లేనని సౌందర్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇది చర్మానికి మేలు చేయడం పక్కన పెడితే, తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. అసలు ముల్తానీ మట్టిని ఎప్పుడు వాడకూడదు? ఎవరికి ఇది ముప్పుగా పరిణమిస్తుందో తెలుసుకుందాం..

చాలామంది తమ చర్మ స్వభావాన్ని గమనించకుండా అందరూ వాడుతున్నారని ముల్తానీ మట్టిని అప్లై చేస్తుంటారు. ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవారు దీనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ముల్తానీ మట్టికి చర్మంలోని తేమను పీల్చుకునే గుణం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే పొడిగా ఉన్న చర్మంపై దీనిని రాస్తే.. చర్మం మరింత బిగుతుగా మారి, పొరలుగా ఊడిపోయే ప్రమాదం ఉంది.

ఇది చర్మంపై పగుళ్లను కూడా కలిగిస్తుంది. సెన్సిటివ్ స్కిన్ లేదా సున్నితమైన చర్మ స్వభావం ఉన్నవారు ముల్తానీ మట్టిని నేరుగా ముఖానికి రాసుకోవడం ఏమాత్రం మంచిది కాదు. కొందరిలో ఇది తీవ్రమైన చికాకును, దురదను కలిగిస్తుంది. నేరుగా వాడే బదులు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం లేదా నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.

సోరియాసిస్, తామర వంటి చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు ముల్తానీ మట్టి జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఇది ఆ సమస్యలను మరింత తీవ్రం చేస్తుంది. అలాగే ముఖంపై చిన్నపాటి గాయాలు ఉన్నప్పుడు గానీ, ఏదైనా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు గానీ దీనిని అప్లై చేయొద్దు. అలా చేయడం వల్ల బ్యాక్టీరియా లోపలికి వెళ్లి ఇన్ఫెక్షన్ ముఖం అంతా పాకే అవకాశం ఉంటుంది.

ముల్తానీ మట్టిని వాడేటప్పుడు చర్మం మరీ పొడిబారకుండా ఉండాలంటే అందులో పాలు లేదా రోజ్ వాటర్ కలిపి వాడాలి. కేవలం వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే దీనిని ఉపయోగించాలి. ముఖంపై ప్యాక్ వేసుకున్న తర్వాత అది పూర్తిగా ఎండిపోయే వరకు ఉంచుకోకుండా, కాస్త తడిగా ఉన్నప్పుడే కడిగేయడం వల్ల చర్మ తేమను కాపాడుకోవచ్చు.

ప్రకృతి ప్రసాదించిన ప్రతి వస్తువు అందరికీ ఒకేలా పనిచేయదు. ముల్తానీ మట్టి విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. మీ చర్మం స్వభావాన్ని తెలుసుకుని, తగిన జాగ్రత్తలతో వాడితేనే అది మీకు అందాన్ని ఇస్తుంది. లేదంటే చర్మంపై మచ్చలు, దురద వంటి ఇబ్బందులు తప్పవు. మరి మీ చర్మ స్వభావానికి ముల్తానీ మట్టి సెట్ అవుతుందా లేదా అనేది ఒకసారి గమనించుకోండి!

అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు
అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు
ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు పెరుగుతుందని నమ్ముతారని తెలుసా?
ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు పెరుగుతుందని నమ్ముతారని తెలుసా?
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?
ఆ 21 దేశాలకు ట్రావెల్ బ్యాన్ విధించిన ట్రంప్ సర్కార్ !
ఆ 21 దేశాలకు ట్రావెల్ బ్యాన్ విధించిన ట్రంప్ సర్కార్ !