OTT Movie: ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో బిగ్గెస్ట్ కాంట్రవర్సీ మూవీ.. ఈ రియల్ స్టోరీకి IMDBలోనూ టాప్ రేటింగ్
వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. అందుకే థియేటర్లలో రిలీజ్ కు ముందే ఈ సినిమా వివాదాల్లో నిలిచింది. ముఖ్యంగా ఇందులోని కొన్ని సన్నివేశాలు, డైలాగులపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఓ సామాజిక వర్గం మనోభావాలు దెబ్బతినడంతో మూవీపై నిషేధం చేయాలన్న డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది

ఈ మధ్యన ఓటీటీలో రియల్ స్టోరీలకు మంచి ఆదరణ ఉంటోంది. నిజ జీవిత సంఘటనలు, ప్రముఖ వ్యక్తులు, సంచలన కేసుల ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమాలు, వెబ్ సిరీస్ లకు టాప్ వ్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక రియల్ స్టోరీనే. కొన్నేళ్ల క్రితం దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఒక కేసు ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. అయితే రిలీజ్ కు ముందు ఈ సినిమా పలు వివాదాల్లో చిక్కుకుంది. ఇందులోని సన్నివేశాలు, డైలాగులపై ఓ సామాజిక వర్గం నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మూవీపై నిషేధం విధించాలన్న డిమాండ్లు కూడా తెరపైకి వచ్చాయి. అయితే ఎలాగోలా నవంబర్ 07న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు కూడా వచ్చాయి. ఇక ఇటీవలే ఈ కాంట్రవర్సీ మూవీ ఓటీటీలోకి రాగా ఇక్కడ కూడా మంచి ఆదరణ దక్కించుకుంటోంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఇదొక రియల్ స్టోరీ. 1975లో దేశవ్యాప్తంగా సంచలనం రేకేత్తించిన షా బానో కేసు ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. షా బానోను ఆమె భర్త, న్యాయవాది మొహమ్మద్ అహ్మద్ ఖాన్ ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు ఇచ్చి ఆమెను వదిలేశాడు. అయితే తనకు జరిగిన అన్యాయంపై షాబానో న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తుంది. భర్త నుంచి భరణం ఇప్పించాలంటూ కోర్టు మెట్లెక్కుతుంది. మరి చివరకు ఆ కేసు ఏమైంది? ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు ఇవ్వడం కరేక్టేనా? షాబోనుకు న్యాయం జరిగిందా? లేదా? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే
షా బానో వర్సెస్ అహ్మద్ ఖాన్ కేసు ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా పేు హక్. సుపర్ణ్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాలో యామీ గౌతమ్, ఇమ్రాన్ హష్మీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ కాంట్రీవర్సీ మూవీ కొత్త సంవత్సరం కానుకగా జనవరి 02 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్న ఈ సినిమాపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినిమా చాలా అద్బుతంగా ఉందంటూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
హక్ సినిమాపై ఓ నెటిజన్ రివ్యూ..
What a movie #Haq is on #Netflix!!! Hats off #YamiGautam for the restrained yet graceful portrayal of her character of Shazia Bano!!! She deserves every award for the best actor this year.@yamigautam pic.twitter.com/cM8zXddjbM
— Miss Sunshine 🌄 (@SidHeartzzz) January 7, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




