Sindhu Tolani: ‘గౌతమ్ SSC’ హీరోయిన్ సింధూ తులాని గుర్తుందా? ఇప్పుడేంటిలా మారిపోయింది.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
ముంబైలో పుట్టి పెరిగినా చూడ్డానికి పక్కింటమ్మాయిలా కనిపించింది సింధు తులానీ. అందుకే తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యింది. కేవలం హీరోయిన్ గానే కాకుండా సహాయక నటిగానూ మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు అసలు గుర్తు పట్టేలేకుండా మారిపోయింది. ఆమెకు సంబంధించిన లేటెస్ట్ ఫొటోస్ ఇప్పుడు నెట్టింట బాగా వైరలవుతున్నాయి.

చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు నాట మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో సింధూ తులాని ఒకరు. ముంబైకు చెందిన ఈ ముద్దుగుమ్మ చంద్రశేఖర్ ఏలేటి తెరకెక్కించిన ఐతే సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయమైంది. మొదటి సినిమాతోనే అందం, అభినయం పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత కల్యాణ్ రామ్ అతనొక్కడే సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. నవదీప్ నటించిన గౌతమ్ ఎస్‌ఎస్‌సీ, ప్రభాస్ పౌర్ణమి, పోతేపోనీ, బతుకమ్మ, హరేరామ్ తదితర సినిమాలు సింధుకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఇక మన్మథ సినిమాలో సింధు చేసిన నెగెటివ్ రోల్ లో ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేదు. కాగా హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో సహయ నటిగానూ మెప్పించిందీ అందాల తార. కిక్, ప్రేమ కావాలి, ఇష్క్, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల్లో హీరో, హీరోయిన్లకు అక్కగా, వదిన పాత్రలు చేసి మెప్పించింది.
తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసింది సింధు తులానీ. అయితే పెళ్లి తర్వాత సినిమా ఇండస్ట్రీ నుంచి కనుమరుగైపోయింది. 2017 తర్వాత ఏ సినిమాలోనూ కనిపించలేదీ అందాల తార. అయితే ఇటీవల రిలీజైన రామ్ పోతినేని ఆంధ్రా కింగ్ తాలుకా సినిమాలో ఓ కీలక పాత్ర పోషించి సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చిందీ అందాల తార. ఇందులో ఆమె హీరో ఉపేంద్ర భార్య పాత్రలో కనిపించింది.
సింధు తులాని లేటెస్ట్ ఫొటోస్..
Sindhu Tolani 🔥🫴🔥🫴#Sindhu #SindhuTolani pic.twitter.com/3FGn1Lve9q
— Movie🎥Mart (@TeluguMovieMart) January 6, 2026
ఇక సింధు భర్త పేరు చేతన్. ముంబైలోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో అతను సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఈ దంపతులకు శ్వేత అనే కుమార్తె ఉంది. ప్రస్తుతం తన కూతురు ఆలనాపాలనలోనే బిజీగా గడుపుతోంది సింధు. కాగా ఇప్పుడీ ముద్దగుమ్మకు సంబంధించిన లేటెస్ట్ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇందులో ఆమె కాస్త బొద్దుగా తయారైగుర్తుపట్టలేని స్థితిలో ఉంది. వీటిని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ వెండి తెరపై.. ఆంధ్రా కింగ్ తాలుకా సినిమాలో సింధు తులాని సడెన్ సర్ ప్రైజ్..
Sindhu Tolani 🔥🫴🔥🫴#Sindhu #SindhuTolani pic.twitter.com/QCIWIuBP9u
— Movie🎥Mart (@TeluguMovieMart) December 23, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




