ఆ హీరోకు నాపై చాలా నమ్మకం.. ఆయన కొడుకుతో సినిమా తీసే అవకాశం వస్తే వదులుకోను
ఆర్ఎక్స్ 100 లాంటి సెన్సేషనల్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అజయ్ భూపతి.. ఆ తర్వాత ఆ మ్యాజిక్ చేయలేదు. మహా సముద్రం ఫ్లాప్ కావడంతో.. దాదాపు మూడేళ్లకు పైగా గ్యాప్ తీసుకొని మంగళవారం సినిమాతో వచ్చాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఆర్ఎక్స్ 100 సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీ హాట్ టాపిక్ అయ్యాడు దర్శకుడు అజయ్ భూపతి. ఆతర్వాత మహాసముద్రం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత మంగళవారం అనే సినిమాతో హిట్ అందుకున్నాడు. మంగళవారం సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు మహేష్ బాబు అన్న కొడుకు జయకృష్టతో సినిమా చేస్తున్నారు అజయ్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్స్ త్వరలోనే రానున్నాయి. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో అజయ్ భూపతి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
17 ఏళ్ల అమ్మాయి గర్భవతి అని చూపించా.. నాపై కేసులు వేశారు: దర్శకుడు తేజ
దర్శకుడు అజయ్ భూపతి సూపర్ స్టార్ మహేష్ బాబుతో తనకున్న అనుబంధం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మహేష్ బాబు తనపై ఉంచిన నమ్మకాన్ని వివరించారు.. అలాగే ఆయన కుమారుడు గౌతమ్‌ను సినిమాలకు పరిచయం చేసే అవకాశం వస్తే ఎలా ఉంటుందో కూడా చెప్పారు అజయ్. అజయ్ భూపతి “RX100” విజయం తర్వాత మహేష్ బాబు తనను పిలిపించి అభినందించారని గుర్తు చేసుకున్నారు. అప్పటి నుంచి మహేష్ బాబు తన ప్రాజెక్ట్‌ల గురించిన అప్డేట్స్‌ను తెలుసుకుంటూ ఉంటారని అన్నారు.
EMI కట్టలేదని దాన్ని తీసుకెళ్లారు.. ఎన్నో కష్టాలు చూశా.. ఎమోష్నలైన జబర్దస్త్ నరేష్
అజయ్‌కి నాపై బాగా నమ్మకం ఉంది అని మహేష్ బాబు ఇతరులతో చెప్పడం విన్నానని, ఇది తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో మహేష్ బాబు కుమారుడు గౌతమ్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని అజయ్ భూపతి అన్నారు. గౌతమ్‌తో సినిమా తీసే అవకాశం వస్తే, ఆ కథలో ఖచ్చితంగా చిన్న మాస్ టచ్ ఉంటుందని, క్యారెక్టరైజేషన్‌లో మాస్ ఎలిమెంట్స్ ఉంటాయని వివరించారు. అయితే అది ఊరమాస్ కాకుండా, క్లాసీగా ఉంటుందని, కొంతవరకు మాస్ అంశాలను తాను పట్టుకుంటానని స్పష్టం చేశారు.
ఆ సినిమా నుంచి తప్పుకుంటా అని చెప్పా.. అది క్లాసిక్ అవుతుందని అప్పుడే చెప్పా..: కృష్ణవంశీ
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.




