AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రమాప్రభ అల్లుడు తెలుగులో తోప్ హీరో.. ఇప్పటికీ ఫుల్ బిజీ నటుడు.. ఎవరంటే

నటి రమాప్రభ గుర్తుందా… ? టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు 1000కి పైగా చిత్రాల్లో నటించి తనదైన ముద్రవేసింది. స్టార్ హీరోల సినిమాల్లో కీలకపాత్రలు పోషించి జనాలకు దగ్గరయ్యింది. దశాబ్దాల సినీప్రయాణంలో దాదాపు 1500లకు పైగా సినిమాలలో విభిన్న పాత్రలు పోషించింది. కృష్ణంరాజు హీరోగా నటించిన చిలక గోరింకా సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది.

రమాప్రభ అల్లుడు తెలుగులో తోప్ హీరో.. ఇప్పటికీ ఫుల్ బిజీ నటుడు.. ఎవరంటే
Rama Prabha
Rajeev Rayala
|

Updated on: Jan 02, 2026 | 8:16 AM

Share

సీనియర్ సినీ నటి రమా ప్రభ.. రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ఆడియెన్స కు పరిచయం అక్కర్లేదు వ్యక్తి ఆమె. హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టిన రమా ప్రభ.. ఆతర్వాత లేడీ కమెడియన్ గా మారి తెలుగు ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించారు. తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు రమా ప్రభ. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి దిగ్గజ నటీనటులతో కలిసి నటించిన ఘనత రమా ప్రభ సొంతం. సీనియర్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోల వరకు అందరి సినిమాల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం వయో భారంతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు రమా ప్రభ. ఇక శరత్ బాబుతో పెళ్ళి, విడాకులు రమా ప్రభ జీవితాన్ని మరో మలుపు తిప్పాయి. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న రామ ప్రభ ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులపై పలు రకాల పుకార్లు తెర మీదకు వచ్చాయి. అయితే అవన్నీ అబద్ధాలేనని తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని ఆమె చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం తన సోదరుడి కుటుంబంతో కలిసి ఉంటున్నారు. రమా ప్రభ అల్లుడు ఇప్పుడు ఇండస్ట్రీలో తోపు నటుడు. ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. ఇంతకూ ఆయన ఎవరో తెలుసా.? ఆయనే నట కిరీటి రాజేంద్ర ప్రసాద్. ఆయన హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కామెడీ హీరోగా ఎన్నో సినిమాల్లో నటించాడు. ఇప్పటికీ సపోర్టింగ్ రోల్స్ తో ఆడియెన్స్ ను మెప్పిస్తున్నాడు. ఈ మధ్యన వివాదాస్పద వ్యాఖ్యలతోనూ వార్తల్లో నిలుస్తున్నాడు నట కిరిటీ. ఈ క్రమంలో రాజేంద్ర ప్రసాద్, రమా ప్రభల మధ్య ఉన్న బంధుత్వం గురించి చాలా మందికి తెలియదు.

రమా ప్రభకు వరుసకు అల్లుడు అవుతారు రాజేంద్ర ప్రసాద్. పిల్లలే లేని రమా ప్రభాకు రాజేంద్ర ప్రసాద్ అల్లుడు ఎలా అయ్యాడని అనుకోవచ్చు. రమా ప్రభ తన చెల్లెలి కూతురిని దత్తత తీసుకుంది. తనే పెంచి పెద్దది చేసింది. ఆ తర్వాత తనే దగ్గరుండి రాజేంద్ర ప్రసాద్‌ తో తన కూతురి పెళ్లి కూడా చేసింది. అలా రమా ప్రభకు రాజేంద్ర ప్రసాద్ అల్లుడయ్యాడు. దగ్గరి బంధుత్వం ఉండబట్టే తరచూ హైదరాబాద్ లోని రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వస్తుంటారు రమా ప్రభ. ఇక రాజేంద్ర ప్రసాద్ కూడా అప్పుడప్పుడు రమా ప్రభ ఇంటికి వెళ్తుంటారు.

ఇవి కూడా చదవండి

Rajendra Prasad

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.