నాకు పెద్దగా ఫ్రెండ్స్ లేరు.. ఇండస్ట్రీలో నా స్నేహితుడు అతనే.. బాలకృష్ణ ఓపెన్ కామెంట్స్
నందమూరి నటసింహం బాలకృష్ణకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. 60 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలతో వెండితెరపై సందడి చేస్తున్నారు. మాస్ యాక్షన్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నారు. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో కుర్ర హీరోలకు సైతం గట్టిపోటీ ఇస్తున్నారు బాలయ్య.

నటసింహం నందమూరి బాలకృష్ణ ఇటీవలే అఖండ 2 సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. వరుసగా 5 బ్లాక్ బస్టర్ అందుకొని దూసుకుపోతున్నారు బాలయ్య అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, అఖండ 2 సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నారు బాలకృష్ణ.. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. వీరసింహారెడ్డి సినిమా తర్వాత మరోసారి ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్నారు. కాగా బాలయ్యకు సంబందించిన ఓ ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ ఇంటర్వ్యూలో బాలయ్య ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఈ పాత ఇంటర్వ్యూలో నందమూరి బాలకృష్ణ నర్తనశాల చిత్రం, అందులో నటుడు శ్రీహరి పాత్ర, అలాగే తన బృహన్నల పాత్ర గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. శ్రీహరిని భీముడి పాత్రకు ఎంపిక చేయడంపై మాట్లాడుతూ, ఆయనే మొదటి ఎంపిక అని, ఇతర నటులను పరిగణనలోకి తీసుకోలేదని స్పష్టం చేశారు. శ్రీహరికి ఫోన్ చేసి ఈ పాత్ర చేయమని అడిగినప్పుడు, ఈ చిత్రం ఆయన భవిష్యత్తును మారుస్తుందని తాను చెప్పానని బాలకృష్ణ గుర్తుచేసుకున్నారు. శ్రీహరి ఓపెన్‌గా మాట్లాడే మనిషి అని, కొండ బద్దలు కొట్టినట్లు మాట్లాడుతాడని అన్నారు బాలయ్య. ఆయనకు ఇండస్ట్రీలో అవకాశం కోసం తన వద్దకు వచ్చే వారికి, నేను కాదయ్యా బాబు, మీరేదో వెళ్లి బాలకృష్ణ దృష్టిలో పడండి. మీరు దృష్టిలో పడగలిగితే మాత్రం మీకు అదృష్టం కలిసి వచ్చినట్టే అని చెప్పేవారని బాలకృష్ణ తెలిపారు.
ఒక నటుడికి ఫిజిక్, టాలెంట్ రెండూ ఉండాలని, శ్రీహరిలో ఆ రెండు లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇండస్ట్రీలో తనకు పెద్దగా స్నేహితులు లేరని.. ఉన్న వారిలో శ్రీహరి ఒక మంచి స్నేహితుడు అని అన్నారు బాలయ్య. అలాగే నర్తనశాలలో బృహన్నల పాత్ర తాను పోషించిన అత్యంత సవాలుతో కూడుకున్నదని బాలకృష్ణ అన్నారు. నందమూరి తారకరామారావు గారు ఈ పాత్రను అద్భుతంగా పోషించిన తర్వాత తాను చేయడానికి సంకోచించినా, చివరకు ఒక రాత్రి ఆలోచించి ఒప్పుకున్నానని చెప్పారు. ఈ పాత్ర కోసం విస్తృతమైన పరిశోధన చేశానని, పెద్ద పెద్ద ఋషులు, పండితులు రాసిన గ్రంథాలను అధ్యయనం చేశానని తెలిపారు. స్క్రిప్ట్‌లో ఊర్వశి సంభాషణను మార్చి, అది పిక్టోరియల్‌గా చూపిస్తేనే ప్రేక్షకులకు చేరువవుతుందని భావించి, నరవరా పాటను చేర్చమని చెప్పా అని బాలయ్య అన్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.




