AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హిట్ అయ్యింది అనుకున్నా.. కానీ డిజాస్టర్ అయ్యింది.. ఆ సినిమా వల్ల రూ. 6కోట్లు నష్టం..

తెలుగులో వరుసగా సినిమాలు నిర్మిస్తూ దూసుకుపోతున్నారు నిర్మాత బన్నీ వాస్. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. పెద్ద హీరోల సినిమాలతో పాటు , చిన్న హీరోలతోనూ సినిమాలు చేసి హిట్స్ అందుకున్నారు. అలాగే మిత్రమండలి సినిమా మాత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది.

హిట్ అయ్యింది అనుకున్నా.. కానీ డిజాస్టర్ అయ్యింది.. ఆ సినిమా వల్ల రూ. 6కోట్లు నష్టం..
Bunny Vasu
Rajeev Rayala
|

Updated on: Dec 31, 2025 | 11:34 AM

Share

తెలుగులో నిర్మాతగా రాణిస్తూ కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ దూసుకుపోతున్నారు నిర్మాత బన్నీ వాస్. హిట్స్ ఫ్లాప్స్ తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు బన్నీ వాస్. ఈ ఏడాది తన నిర్మాణంలో వచ్చిన మిత్రమండలి చిత్రం గురించి తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బన్నీ వాస్ తన సినిమాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నిర్మాత బన్నీ వాస్ మిత్రమండలి అనూహ్య పరాజయం గురించి మాట్లాడారు. ఈ సంవత్సరం తండేల్ నుంచి ఈషా వరకు పలు విజయవంతమైన ప్రాజెక్ట్‌లలో పాలుపంచుకున్న బన్నీ వాస్‌కు మిత్రమండలి నిరాశను మిగిల్చింది. తాను, ఇతర నిర్మాతలు కలిసి మిత్రమండలికి పెట్టుబడి పెట్టామని, చిత్రంలో వినోదానికి లోటు ఉండదని గట్టిగా నమ్మామని బన్నీ వాస్ పేర్కొన్నారు.

Year Ender 2025: ఓజీ, సంక్రాంతికి వస్తున్నాం, హిట్3 కాదు.. ఈ ఏడాది బిగెస్ట్ హిట్ సినిమా ఇదే

ఎడిటింగ్ రూమ్‌లో సినిమాను చూసినప్పుడు తామంతా చాలా సంతోషంగా ఉన్నామని, దర్శకుడు వంశీ కూడా చిత్రాన్ని చూసి సినిమా విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారని ఆయన తెలిపారు. అయితే, థియేటర్లలో ప్రేక్షకుల స్పందన తమ అంచనాలకు రివర్స్ లో ఉందని బన్నీ వాస్ ఒప్పుకున్నారు. సినిమా విడుదలైన తర్వాత, తాను థియేటర్లలో చిత్రాన్ని చూస్తున్నప్పుడు, సాధారణంగా ప్రేక్షకులు ఎక్కడ నవ్వుతారని తాను మార్క్ చేసుకున్న సన్నివేశాల వద్ద ఎటువంటి స్పందన లేకపోవడంతో ఏదో లోపం జరిగిందని అర్ధమైందని అన్నారు. నవ్వు అనేది రాలేదు. ఏదో మిస్ అయ్యింది అని బన్నీ వాస్ అన్నారు. ఈ లోపం ఎడిటింగ్, ముఖ్యంగా ఆర్‌ఆర్ (రీ-రికార్డింగ్/బ్యాక్‌గ్రౌండ్ స్కోర్) లో జరిగిందని తాను గుర్తించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ పొరపాటు తనదేనని 100 శాతం బాధ్యత తీసుకున్నారు.

ఆ స్టార్ హీరో నన్ను బెదిరించే వాడు.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్ మీనా

చివరి మూడు రోజులు తాను ఊరిలో వల్ల ఫైనల్ కాపీని చూడలేకపోయాను అన్నారు. మిక్సింగ్ థియేటర్‌లో సరిదిద్దగలిగే ఈ చిన్న లోపాన్ని తాను చూసి ఉంటే తప్పకుండా సరిదిద్దేవాడినని బన్నీ వాస్ చెప్పారు. ఈ సినిమా వల్ల మొత్తం రూ. 6 కోట్ల నష్టం వచ్చిందని ఆయన వెల్లడించారు. ఇండస్ట్రీలో సాఫ్ట్‌గా, గౌరవంగా మాట్లాడే వ్యక్తిగా బన్నీ వాస్‌కు మంచి పేరు ఉంది. అయితే, ఈ సంవత్సరం ఆయన చేసిన కొన్ని కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. దీని పై ఆయన మాట్లాడుతూ.. తనతో సన్నిహితంగా ఉండేవారికి కోపం వచ్చినప్పుడు తాను ఎంత దూకుడుగా ఉంటానో తెలుసని ఆయన అన్నారు. స్టేజ్‌పై తాను సంయమనంతో ఉన్నప్పటికీ, కొన్ని విషయాలు నాకు కోపం తెప్పించాయి.. అందుకే నేను దూకుడుగా మాట్లాడా అని అన్నారు బన్నీ వాస్.

ఇవి కూడా చదవండి

అందుకే ఇన్ స్టాలో అలాంటి ఫోటోలు షేర్ చేస్తా.. ఓపెన్‌గా చెప్పేసిన ఇనయ సుల్తానా

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.

చనిపోయిన తర్వాత మీతో వచ్చేవి ఇవే.. నీడలా వెంటాడే ఆ మూడు రహస్యాలు
చనిపోయిన తర్వాత మీతో వచ్చేవి ఇవే.. నీడలా వెంటాడే ఆ మూడు రహస్యాలు
ఏకంగా 37 సిక్స్‌లు.. మనిషివా, సిక్సర్ మెషినివా భయ్యా..!
ఏకంగా 37 సిక్స్‌లు.. మనిషివా, సిక్సర్ మెషినివా భయ్యా..!
ఒక్క తెల్ల వెంట్రుక పీకితే జుట్టంతా తెల్లగా అవుతుందా.. అపోహలు..
ఒక్క తెల్ల వెంట్రుక పీకితే జుట్టంతా తెల్లగా అవుతుందా.. అపోహలు..
ఇన్‌స్టంట్ లోన్ యాప్స్‌లో డబ్బులు తీసుకునేవారికి అలర్ట్..
ఇన్‌స్టంట్ లోన్ యాప్స్‌లో డబ్బులు తీసుకునేవారికి అలర్ట్..
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
షూట్‌లో అలా గాజులు పగలుగొట్టాలి.. బాలకృష్ణ వచ్చి ఏం అన్నారంటే.!
షూట్‌లో అలా గాజులు పగలుగొట్టాలి.. బాలకృష్ణ వచ్చి ఏం అన్నారంటే.!
ఆత్మలు, దెయ్యాలు నిజంగా ఉన్నాయా..
ఆత్మలు, దెయ్యాలు నిజంగా ఉన్నాయా..
గంభీర్, అగార్కర్‌ల పెద్ద స్కెచ్! ఇకపై రో-కో 'బీ గ్రేడ్' ప్లేయర్సా
గంభీర్, అగార్కర్‌ల పెద్ద స్కెచ్! ఇకపై రో-కో 'బీ గ్రేడ్' ప్లేయర్సా
ఒక్క ఫోన్‌తో ఇంటివద్దకే పోలీసులు.. క్షణాల్లో చర్యలు.. ఏఏ కేసుల్లో
ఒక్క ఫోన్‌తో ఇంటివద్దకే పోలీసులు.. క్షణాల్లో చర్యలు.. ఏఏ కేసుల్లో
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి