AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈవెంట్‌లో పన్నీరు చల్లితే రూ.1800 ఇచ్చారు.. అప్పులు చేస్తూ జీవితం గడిపా.. కష్టాలు గుర్తుచేసుకున్న అరియానా

బిగ్ బాస్ గేమ్ షోతో చాలా మంది మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. అప్పటివరకు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేనివారు కూడా బిగ్ బాస్ తర్వాత పాపులర్ అయ్యారు. అలాగే ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెంచుకున్నారు. అలాంటివారిలో అరియానా గ్లోరీ ఒకరు. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఈవెంట్‌లో పన్నీరు చల్లితే రూ.1800 ఇచ్చారు.. అప్పులు చేస్తూ జీవితం గడిపా.. కష్టాలు గుర్తుచేసుకున్న అరియానా
Ariyana
Rajeev Rayala
|

Updated on: Jan 05, 2026 | 1:15 PM

Share

బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన వారిలో అరియానా గ్లోరీ ఒకరు. ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ కంటే ముందు యాంకర్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అందాల భామ.. ఇక బిగ్ బాస్ హౌస్ లో బోల్డ్ బ్యూటీగా అడుగుపెట్టింది ఈ చిన్నది. హౌస్ లో తన అందంతో ఆటతో ప్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు టీవీ షోలతో ఆకట్టుకుంది అరియానా.. ఆతర్వాత పలు ఇంటర్వ్యూలో కనిపించి ఆసక్తికర విషయాలను పంచుకుంటుంది. తాజాగా ఈ అమ్మడి ఇంటర్వ్యూ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది అరియానా..

బిగ్ బాస్ 4 తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది అరియానా గ్లోరీ, తన ప్రారంభ కెరీర్ లో ఎదుర్కొన్న అనేక సవాళ్ల గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. అరియనా మాట్లాడుతూ.. తాను వికారాబాద్ జిల్లా తాండూర్ లో పుట్టి పెరిగినట్లు తెలిపింది. డిగ్రీ తరువాత యాంకర్ కావాలనే కోరికతో హైదరాబాద్‌కు వచ్చానని.. ఆఫర్లు ఎక్కువగా ఉంటాయనే నమ్మకంతో ఒక టీవీ ఛానెల్‌కు ప్రయత్నించి, 2015 మే 2న నెలకు 4000 రూపాయల జీతంతో ఉద్యోగంలో చేరానని.. మొదట 7000 రూపాయలు ఇస్తామని చెప్పినా, మొదటి జీతం 4000 మాత్రమే అందింది తెలిపింది అరియనా. కుటుంబం నుండి పెద్దగా మద్దతు లేకపోయినా, తన కష్టాలను వారికి చెప్పకుండా, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నానని.. 4000 రూపాయల జీతంతో ఇంటి అద్దె 3000 కట్టాలి. మిగిలిన 1000 రూపాయలు పెట్రోల్ వంటి ఇతర ఖర్చులకు సరిపోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డాను అని తెలిపింది. అలాగే స్నేహితురాలి సలహా మేరకు పార్ట్‌టైమ్ ఈవెంట్లలో యాంకరింగ్ అవకాశాల కోసం వెతుకున్నా. మొదట ఎన్ కన్వెన్షన్‌లో జరిగిన ఓ ఈవెంట్ లో వచ్చిన వారికి పన్నీరు చల్లే పనికి 1800 రూపాయలు తీసుకున్నా అని తెలిపింది.

ఆ 1800 రూపాయలు అద్దె కట్టడానికి చాలా ముఖ్యమని.. ఎలాంటి ఖర్చు చేయకుండా వర్షంలో స్కూటీపై ఇంటికి వెళ్లి, ఆ డబ్బులతో రెంట్ కట్టాలనుకున్నా.. కానీ దురదృష్టవశాత్తు, ఆఫీసులో మేకప్ రూమ్‌లో ఉన్నప్పుడు ఆ 1800 రూపాయలు పోయాయి. ఆ క్షణంలో తాను ఎంతగానో బాధపడి, ఆ చిన్న గదిలో కూర్చొని ఏడ్చినట్లు అరియానా గ్లోరీ గుర్తుచేసుకుంది. ఆ తరువాత స్నేహితుల దగ్గర అప్పు చేసి మూడు నెలలు గడిపాను.. ఈవెంట్లలో ఆమె పనితీరును చూసిన ఒక మహిళ, యాంకరింగ్ అవకాశాలు ఇస్తానని మాట ఇవ్వడంతో జీవితం మలుపు తిరిగిందని గుర్తుచేసుకుంది. ఈవెంట్లలో 5000 నుంచి 10,000 రూపాయలు సంపాదించడం మొదలుపెట్టా అని తెలిపింది. అయితే ఛానెల్‌కు తెలియకుండా ఈవెంట్లు సీక్రెట్ గా చేయాల్సి వచ్చింది. చివరకు ఛానెల్ వారికి ఈ విషయం తెలిసి, బయట ఈవెంట్లు చేస్తున్నారని చెప్పి జాబ్ నుంచి తీసేశారని. ఉద్యోగం కోల్పోయినా, ఇంటి దగ్గర డబ్బులు అడగలేక, హాస్టల్ ఫీజు కట్టలేక, స్నేహితుల దగ్గర అప్పులు చేస్తూ, ఈవెంట్లతో బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చా అని తెలిపింది అరియానా.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.