Allu Arjun: అభిమానమా.. పైత్యమా..! మితిమీరిన అభిమానంతో ఏకంగా బన్నీనే భయపెట్టేశారుగా..
బన్నీ అక్కడ ఉన్నాడన్న విషయం తెలిసిన క్షణాల్లోనే పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకున్నారు. సెల్ఫీలు, వీడియోల కోసం అభిమానులు ఒక్కసారిగా గుమిగూడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అల్లు అర్జున్ తన భార్య భద్రతపై అప్రమత్తంగా ఉంటూ ఆమె చేయి పట్టుకుని ముందుకు తీసుకెళ్లారు.

హైదరాబాద్‌లో మరోసారి స్టార్ క్రేజ్ ఎలా ఉంటుందో చూపించే ఘటన చోటుచేసుకుంది. ఈ మధ్య సెలబ్రిటీలకు అభిమానుల తాకిడితో ఇబ్బంది పడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఆ మధ్య నిధి అగర్వాల్, సమంత, విజయ్ వంటి స్టార్స్ చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఈ జాబితాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరారు. శనివారం రాత్రి నగరంలోని ఓ సినీ కార్యక్రమానికి హాజరైన అల్లు అర్జున్, అనంతరం భార్య స్నేహారెడ్డితో కలిసి హైటెక్ సిటీ పరిసరాల్లోని నిలోఫర్ కేఫ్‌కు వెళ్లారు. ప్రశాంతంగా గడపాలన్న ఉద్దేశంతో వెళ్లిన ఈ జంటకు అక్కడ ఊహించని పరిస్థితి ఎదురైంది. బన్నీ అక్కడ ఉన్నాడన్న విషయం తెలిసిన క్షణాల్లోనే పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకున్నారు. సెల్ఫీలు, వీడియోల కోసం అభిమానులు ఒక్కసారిగా గుమిగూడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అల్లు అర్జున్ తన భార్య భద్రతపై అప్రమత్తంగా ఉంటూ ఆమె చేయి పట్టుకుని ముందుకు తీసుకెళ్లారు. అభిమానుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో సెక్యూరిటీ సిబ్బందికీ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం కష్టంగా మారింది. చివరకు భారీ భద్రత మధ్య బన్నీ దంపతులు కారులోకి చేరారు. వెళ్లే ముందు అభిమానులను శాంతంగా ఉండాలని కోరుతూ, కారు కిటికీ నుంచి అభివాదం చేశారు.
గత నెలలో హీరోయిన్లు నిధి అగర్వాల్, సమంతకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది.రాజాసాబ్ పాటను KPHBలోని ఓ మాల్‌లో రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ కార్యక్రమానికి వచ్చిన హీరోయిన్ నిధి అగర్వాల్‌ను ఫ్యాన్స్ ఉక్కిరిబిక్కిరి చేసేశారు. ఈవెంట్ తర్వాత బయటకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వకుండా అంతా ఆమెను చూసేందుకు ఎగబడ్డారు. ఆమెను చుట్టుముట్టినంత పనిచేశారు అభిమానులు. కాని బాడీగార్డుల సాయంతో ఆమె ఎలాగోలా కారు దగ్గరకు చేరుకుని.. ఎక్కిన తర్వాత ఊపిరిపీల్చుకున్నారు.
ఇక హీరోయిన్ సమయంత హైదరాబాద్‌లో ఓ షాప్ ఓపెనింగ్‌కి వెళ్లారు. కారు దిగి షాప్‌లోకి వెళ్లడానికి సమంత చాలా ఇబ్బంది పడ్డారు. బౌన్సర్ల సాయంతో సేఫ్‌గా లోపలికి వెళ్లారు. ఈవెంట్ తర్వాత తిరిగి వెళ్లేప్పుడు ఫ్యాన్స్‌కి గ్రీటింగ్స్ చెప్పి బయలుదేరారు. ఇక ఆ టైమ్‌లో సమంతను దగ్గరగా చూసేందుకు ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు జనం ఎగబడ్డారు. నడవడానికి దారి కూడా ఇవ్వలేదు. బౌన్సర్లు ఎంత కంట్రోల్ చేస్తున్నా అడుగు ముందుకు వెయ్యడానికి వీల్లేనంతగా చుట్టుముట్టేశారు. వేదికపైనుంచి నిర్వాహకులు ఫ్యాన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా ఎవ్వరూ ఆ మాటలు వినిపించుకోలేదు. ఎలాగోలా జాగ్రత్తగా సమంతను కారు ఎక్కించి అక్కడి నుంచి పంపించారు. అసలు సెలబ్రిటీస్‌కు ప్రైవసీనే కరువైంది. బయటకు రావాలంటేనే వారికి నరకంలా కనిపిస్తోంది. పర్సనల్ పనులు అటుంచితే కనీసం సినిమా ఈవెంట్లకు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంటోంది. పెద్ద హీరోల సినిమాలకు అయితే సెక్యూరిటీకి నరకమే. ఆర్గనైజర్లు బౌన్సర్లు, పోలీసులను ఏర్పాటు చేసినా.. ఫ్యాన్స్ తాకిడికి … సెలబ్రిటీలను సేఫ్‌గా చూసుకోవాలంటే వారికి వాచిపోతోంది. ఏమాత్రం తేడా వచ్చినా.. పరిస్థితి ఇదిగో ఇలా మారుతోంది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




