Cucumber: ఇదేం చేస్తుందిలే అనుకునేరు.. పొరపాటున కూడా వీళ్లు అస్సలు తినకూడదు.. తింటే..
కీర దోసకాయ సాధారణంగానే ఆరోగ్యకరం. అయితే పలువురికి ఈ కీరదోస విషంతో సమానం అని న్యూట్రిషనిస్ట్ శ్వేతా షా తెలిపింది. ఆస్తమా, కీళ్ల నొప్పులు, మూత్రపిండాల సమస్యలు, డయాబెటిస్ మందులు తీసుకునేవారు, అలాగే రాత్రిపూట దోసకాయ తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తీవ్రతరం కావచ్చునని చెప్పింది.

కీర దోసకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తరచుగా సలాడ్లలో, రైతాలలో లేదా జ్యూస్‌లా తీసుకుంటూ ఉంటారు. ఇందులో దాదాపు 95 శాతం నీరు ఉండటం వల్ల ఇది శరీరానికి హైడ్రేషన్ అందిస్తుంది. బరువు తగ్గడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి కీరదోస అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా, విటమిన్ కె, విటమిన్ సి, పొటాషియం లాంటి ముఖ్యమైన పోషకాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. అయితే, ఈ పోషక ప్రయోజనాలతో పాటు, కొందరికి కీర దోసకాయ ఆరోగ్య సమస్యలను తీవ్రతరం చేయవచ్చని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ శ్వేతా షా తెలిపింది.
ఆయుర్వేదం ప్రకారం.. కీర దోసకాయ తింటే చలవ చేస్తుందని అంటారు. శరీరంలో చల్లదనం వల్ల వచ్చే సమస్యలతో బాధపడేవారు దీనిని అస్సలు తినకూడదు. ముఖ్యంగా ఆస్తమా, జలుబు, దగ్గు, శ్లేష్మం, సైనస్ లేదా ఉబ్బసం లాంటి సమస్యలున్నవారు పూర్తిగా పక్కకు పెట్టాలి. అలాగే కీరదోస ఎక్కువగా తీసుకోవడం వల్ల వాతాన్ని పెంచుతుంది. ఇప్పటికే కీళ్ల నొప్పులు లేదా శరీరంలో వాపుతో బాధపడేవారు కీరదోసకు దూరంగా ఉండటం మంచిది. కీర దోసకాయలో ఫైబర్ అధికంగా ఉన్నప్పటికీ, సెన్సిటివ్ జీర్ణవ్యవస్థ ఉన్నవారికి ఇది కొన్ని ఇబ్బందులను కలిగించవచ్చు. ఇందులో ఉండే కుకుర్బిటాసిన్ అనే సమ్మేళనం వల్ల ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్(IBS) లాంటి జీర్ణ సమస్యలున్నవారికి గ్యాస్, ఉబ్బరం లేదా అజీర్ణం లాంటి లక్షణాలు కనిపించవచ్చు.
కీర దోసకాయలో అధిక నీటి శాతం ఉండటం వల్ల మూత్ర విసర్జన సమస్యలతో బాధపడేవారు దీనిని ఎక్కువగా తీసుకుంటే తరచుగా మూత్ర విసర్జన అవసరమై అసౌకర్యానికి గురికావచ్చు. డయాబెటిస్ రోగులకు కీరదోసకాయలు సాధారణంగా సురక్షితమైనవిగా పరిగణిస్తారు. అయితే, కీరదోసకాయ గింజలు ఇన్సులిన్ లేదా గ్లూకోజ్ తగ్గించే మందులు తీసుకునేవారిలో సమస్యలను సృష్టించవచ్చు. పెద్ద మొత్తంలో గింజలు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా తగ్గి, వణుకు, తలతిరగడం లాంటివి వస్తాయి. నిపుణులు తరచుగా రాత్రి భోజనం తర్వాత కీరదోస తినకూడదని సలహా ఇస్తారు. ఇది జీర్ణం కావడానికి సమయం పడుతుంది. దాని అధిక నీటి శాతం నిద్రకు భంగం కలిగించవచ్చునని చెబుతుంటారు.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.




