‘యూట్యూబర్ అన్వేష్ ఇన్‌స్టా ఐడీ వివరాలు ఇవ్వండి..’ పోలీస్ యాక్షన్ షురూ.. బిగ్ అప్‌డేట్ ఇదిగో
అతడో యూట్యూబర్…ఒక ట్రావెల్ వ్లాగర్, అయితే ఈమధ్య అతగాడి మైండ్ మైండ్‌లో లేదు. మాట గతితప్పుతోంది. చేష్టలు శృతిమించిపోతున్నాయి. అతడిప్పుడు చేస్తున్నది ప్రపంచ ప్రయాణం కాదు, సమాజాన్ని దిగజార్చే ప్రయోగం. లక్షల మంది చూసే వేదికపై, బూతులు, అశ్లీల సంకేతాలు…హిందువుల మనోభావాలను కించపరిచే మాటలు.

దేవుడు నోరు ఇచ్చాడు కదా అని.. ఏది పడితే అది మాట్లాడకూడదు. అలాగే చేతిలో ఫోన్.. సోషల్ మీడియాలో కొంతమంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నంత మాత్రాన ఇన్‌ఫ్లూయన్సర్లు అయిపోరు. తాజాగా యూట్యూబర్ అన్వేష్ హిందూ దేవతలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపిన సంగతి తెలిసిందే. దీనిపై కేసు కూడా నమోదు చేశారు. ఈ క్రమంలోనే అతడి ఆచూకీ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు పంజాగుట్ట పోలీసులు. అన్వేష్ యూజర్ ID వివరాలు ఇవ్వాలని ఇన్‌స్టాగ్రామ్ నిర్వాహకులకు లేఖ రాశారు. ఇన్‌స్టా నుంచి వచ్చే రిప్లై కోసం వేచి చూస్తున్నారు. అటు హిందూ దేవతలను కించపరిచాడని బీజేపీ నేత కరాటే కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైన విషయం తెలిసిందే. అతడిని అరెస్ట్ చేయాలంటున్న హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే అన్వేష్ అంశంపై కరాటే కళ్యాణి మాట్లాడుతూ.. ‘అన్వేష్‌ను రప్పించడానికి అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నాం. అతడిని అందరూ అన్‌సబ్‌స్క్రైబ్ చేయాలి. అన్వేష్ సమాజానికి పట్టిన వైరస్.. ఈ విషయంపై కేంద్రానికి సైతం లేఖ రాస్తాను’ అని పేర్కొన్నారు. మరోవైపు అన్వేష్ వివరాలు కోరుతూ ఇన్‌స్టాకు మెయిల్ పంపించామన్నారు పంజాగుట్ట సీఐ రామకృష్ణ. వివరాలు వచ్చిన తర్వాత నోటీసులు జారీ చేస్తామని.. స్పందించకపోతే లుక్ అవుట్ నోటీసులు ఇస్తామన్నారాయన.
ఇదిలా ఉండగా.. హిందూ దేవతలు, మత విశ్వాసాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అన్వేష్‌పై వరుసగా కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో అన్వేష్‌పై సినీ నటి, బీజేపీ నేత కరాటే కళ్యాణి ఫిర్యాదు చేశారు. దేవుళ్లను దూషిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలు చేశాడని ఆరోపిస్తూ కంప్లైంట్ చేశారు. దీంతో BNSసెక్షన్ 352, 79, 299లతోపాటు ఐటీ చట్టంలోని 67 సెక్షన్ కింద అన్వేష్‌పై కేసు ఫైల్ చేశారు పోలీసులు. ఇటు ఖమ్మంలోనూ, అటు ఏపీలోని విశాఖలోనూ కొందరు అన్వేష్‌పై ఫిర్యాదు చేశారు. విజయవాడ, తిరుపతిలోని బీజేపీకి చెందిన కొందరు నాయకులు కూడా అన్వేష్‌పై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ స్టేషన్ మెట్లెక్కారు. హిందువులు పూజించే సీతాదేవి, ద్రౌపదీ పట్ల అభ్యంతరకర రీతిలో మాట్లాడినందుకు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
దేశ దిమ్మరిగా ఊరూరా తిరగడం, గెంతడం, సొల్లు మాటలు చెప్పడం, ఫాలోవర్స్‌ను పెంచుకుని లక్షలు లక్షలు పోగేయడం అటుంచితే.. ఈ మధ్య అన్వేష్ హద్దులు దాటేశాడు. ప్రవచనకర్త గరికిపాటి గతంలో అమ్మాయిలు బిగుతుగా ఉన్న టీ షర్టులు వేసుకుంటే సభ్యతగా ఉండదని చెప్పారు. కానీ గరికపాటి మాటలు ఈ సంస్కార హీనుడికి రుచించలేదు. ఇక శివాజి విషయంలో కూడా స్పందిస్తూ “సీత, ద్రౌపది చీరలు కట్టుకున్నా బలాత్కారానికి గురయ్యారంటూ తనకి తోచిన కొత్త రామాయణ భారతాలు చెప్పేసాడు. తెలుగు సోషల్ మీడియాలో వ్లాగర్లకి మంచి ఫాలోయింగ్ ఉంది. క్రమం తప్పకుండా ట్రావెల్ వీడియోలు పెట్టేవాళ్లు ఎంతమంది వచ్చినా జనం ఆదరించారు. కానీ అందరి వీడియోల్లా అన్వేష్ వీడియోలుండవు.
ఏ దేశం వెళ్లినా అక్కడొక లోకల్ వైఫ్‌ని సెట్ చేసుకుంటాడు. చూడ్డానికి అసహ్యంగా ఉన్నా, అదొక స్టైల్ అని, “ఆటగాడి” స్వేచ్ఛ అని తన ఫాలోవర్స్‌కి అలవాటు చేసాడు. ఇప్పుడతన్ని చూసి కొంతమంది కొత్త వ్లాగర్లు లోకల్ వైఫుల్ని సెట్ చేసుకుని వీడియోలు తీయడం మొదలెట్టారు. ఇదంతా ఒకెత్తైతే, తాను 14 ఏళ్ల అమ్మాయిని బలాత్కరించినట్టు ఒక ఆడియోలో కమిటయ్యాడు. ఆ కన్-ఫెషన్ చాలు కదా అతనిని పోక్సో చట్టంలో బిగించి లోపలేయడానికి? కంటెంట్ క్రియేటర్‌ని గొప్పవాడిని చేసింది ప్రేక్షకుడే. అలాగే అతని పతనానికి కారణమయ్యేది కూడా ప్రేక్షకుడే. అందుకే వీడి పైత్యం చూసిన జనం..లక్షల్లో అన్‌సబ్‌స్క్రయిబ్ చేయడం ప్రారంభించారు. శివాజీకి సారి చెబుతూ, తానూ హిందువునే నంటూ చిలకపలుకులు అందుకుందీ చిలక. అయినా సరే అన్వేష్‌కు బుద్ది చెప్పాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున బాయ్‌కాట్ అన్వేష్ హ్యాష్‌ట్యాగ్ ట్రోల్ అవుతోంది. ఇన్నాళ్లూ అతగాడి కంపు భరించింది చాలు, అన్ ఫాలో కండి, రిపోర్టు చేయండి. అంటూ సోషల్ మీడియా అన్వేష్‌కు వ్యతిరేకంగా హోరెత్తిపోతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..




