Actress: ఆర్తీ అగర్వాల్ లైఫ్‌లో ఆయనే పెద్ద విలన్.. ఎలా చనిపోయిందంటే.! టాలీవుడ్ నిర్మాత కీలక వ్యాఖ్యలు
నిర్మాత చంటి అడ్డాల తన సినీ అనుభవాలను, నటి ఆర్తి అగర్వాల్ ఎదుగుదల, ఆమె పతనానికి సంబంధించి కీలక విషయాలు పంచుకుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా. ఓ సారి లుక్కేయండి. మరి అదేంటో ఇప్పుడు చూసేద్దాం..

నిర్మాత చంటి అడ్డాల ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించాడు. అల్లరి నరేష్‌తో నిర్మించిన ‘యముడికి మొగుడు’ సినిమా వెనుక ఉన్న ఆలోచనను వివరించాడు. ముందుగా యముడు కాన్సెప్ట్‌తో జూనియర్ ఎన్టీఆర్‌తో, ఆ తర్వాత అల్లు అర్జున్‌తో సినిమా చేయాలని అనుకున్నట్లు చెప్పాడు. అయితే, అల్లు అర్జున్ వయసు తక్కువగా ఉండటంతో ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదని తెలిపాడు. నెలతక్కువోడా అనే టైటిల్ ఆధారంగా అల్లరి నరేష్‌తో యముడికి మొగుడు చిత్రాన్ని రూపొందించినట్లుగా పేర్కొన్న్నాడు.
పూరి జగన్నాథ్ తనకు ఇడియట్, శివమణి అనే రెండు కథలు చెప్పినట్లు వెల్లడించాడు. ఇడియట్ కథను మహేష్ బాబుకు వినిపించినప్పటికీ, అది ఆయనకు సరిపోలేదని చంటి అడ్డాల పేర్కొన్నాడు. పూరి జగన్నాథ్ ఆ తర్వాత పునీత్ రాజ్‌కుమార్‌తో కన్నడలో ఆ చిత్రాన్ని రూపొందించి విజయం సాధించాడు. అనంతరం రవితేజతో ఇడియట్ సినిమా తీయగా అది అనూహ్య విజయాన్ని సాధించి రవితేజ, పూరి జగన్నాథ్ కెరీర్‌లలో కీలక మలుపుగా నిలిచిందని తెలిపాడు. ఎం.ఎల్. కుమార్ చౌదరి, అప్పటి వైజాగ్ మంత్రి ఒకరు ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించినట్లు చెప్పాడు. తన చేతికి వచ్చిన మంచి కథలను కోల్పోవడం పట్ల ఇప్పుడు బాధగా ఉందన్నాడు.
నటి ఆర్తి అగర్వాల్ కెరీర్ గురించి మాట్లాడుతూ.. ఇంద్ర సినిమా సమయంలో ఆమె స్టార్‌డమ్ ప్రభాస్ లాంటి హీరోలతో కూడా అవకాశాలు కల్పించిందని చెప్పాడు. రమ్యకృష్ణను కూడా మొదట్లో ‘ఐరన్ లెగ్’ అని పిలిచినా, ఆమె తర్వాత స్టార్ హీరోయిన్‌గా ఎదిగారని గుర్తు చేశాడు. ఆర్తి అగర్వాల్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన తీరు, ఆమె బబ్లీనెస్, ఇంద్ర సినిమాలో ఆమె లుక్ థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని వివరించాడు. అయితే, ఆమె తండ్రి ఇచ్చిన ‘బ్యాడ్ గైడెన్స్’ ఆమె పతనానికి ప్రధాన కారణమని చంటి అడ్డాల వెల్లడించాడు. ఆయన ఆమెను షూటింగ్‌లకు ఆలస్యంగా వెళ్లమని, ‘స్టార్‌డమ్’ను ఆరోగ్యకరంగా మెయింటెయిన్ చేయమని తప్పుగా సలహా ఇచ్చేవారని చెప్పాడు. మేకప్ మ్యాన్‌లు, మేనేజర్‌లు కూడా ఆమె తండ్రి వైఖరి వల్ల ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నాడు. వ్యక్తిగతంగా ఆర్తి అగర్వాల్ ఒక ‘బంగారు తల్లి’ అని, జ్వరంతో ఉన్నప్పటికీ షూటింగ్‌లో నిబద్ధతతో పాల్గొన్న ఘటనలను గుర్తు చేసుకున్నాడు. సరైన మార్గదర్శకత్వం లేకపోవడం వల్ల ఆమె తప్పు మార్గంలోకి వెళ్లిందని, చివరికి ఆమె జీవితం విషాదకరంగా ముగిసిందని, యూఎస్‌లో ఆమె మరణానికి ముందు హైదరాబాద్‌లోనే కొన్ని ఆత్మహత్యా ప్రయత్నాలు కూడా చేసినట్లు అడ్డాల తెలిపాడు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




