Tarun: తరుణ్ ఆ కారణంతోనే సినిమాలు చేయడం లేదు
యువతను ఆకట్టుకున్న హీరో తరుణ్ సినీ రంగం నుండి ఎందుకు దూరమయ్యారో అతని తల్లి రోజా రమణి వెల్లడించారు. అనేక ప్రేమకథా చిత్రాలతో యువతకు దగ్గరైన తరుణ్ ఇప్పుడు వ్యాపార రంగంలో విజయవంతంగా రాణిస్తున్నాడని ఆమె తెలిపారు. బాలనటిగా ప్రారంభమై, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా విశేష సేవలు అందించిన రోజా రమణి, తరుణ్ భవిష్యత్తు గురించి ఆకాంక్షించారు. ఈ కథనంలో వారి కెరీర్ విశేషాలు.
తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన హీరో తరుణ్. ఎన్నో ప్రేమకథ చిత్రాలతో హిట్స్ అందుకున్నాడు. దాదాపు పదేళ్లపాటు బ్యాక్ టూ బ్యాక్ విజయాలను ఖాతాలో వేసుకుని.. యూత్ ఫేవరేట్ గా నిలిచాడు. అప్పట్లో లవ్ స్టోరీ సినిమాలతో ట్రెండ్ సెట్ చేసిన తరుణ్.. ఇప్పుడు మాత్రం సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఈ హీరో తల్లి రోజా రమణి.. తరుణ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని షేర్ చేసుకున్నారు. తరుణ్ ఎందుకు సినిమాలు మానేశాడనేది చెప్పుకొచ్చారు. 1967లో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసి, హీరోయిన్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా 54 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగించారు రోజా రమణి. ప్రహ్లాద వంటి పాత్రలతో పేరుపొందిన ఆమె, 500 పైగా చిత్రాలకు డబ్బింగ్ చెప్పి, ఎందరో హీరోయిన్లకు ప్రాణం పోశారు. హీరోయిన్‌గా, సహాయ నటిగా పలు భాషల్లో వందలాది చిత్రాలలో నటించిన ఆమె, వివాహం తర్వాత డబ్బింగ్ కళాకారిణిగా కొనసాగారు. 500 పైగా చిత్రాలకు డబ్బింగ్ చెప్పి, దాదాపు 400 మంది హీరోయిన్లకు ఆమె గాత్రాన్ని అందించారు. అయితే నటనకు విరామం ఇవ్వడం తన వ్యక్తిగత నిర్ణయమేనని, భర్త చక్రపాణి గానీ, ఇతర కుటుంబ సభ్యులు గానీ ఎప్పుడూ ఒత్తిడి చేయలేదని ఆమె స్పష్టం చేసిన ఈమె.. ఈక్రమంలోనే తరుణ్ సినిమాలకు దూరంగా ఉండడంపై నోరు విప్పారు. తన కొడుకు తరుణ్ ఇప్పుడు వ్యాపార రంగంలో బిజీగా ఉన్నాడని.. తన దృష్టిని కేవలం బిజినెస్ పై పెట్టాడని ఆమె చెప్పుకొచ్చారు. అటు సినిమాలతోపాటు.. ఇటు వ్యాపారరంగంలోనూ తన కొడుకు సక్సెస్ అయ్యాడంటూ చెప్పుకొచ్చారు. వ్యాపార రంగంలో తన కొడుకు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆమె ఆకాక్షించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అల్లుడి ముచ్చట చెబుతూ అత్త మాస్ సాంగ్ !! షేక్ అవుతున్న సోషల్ మీడియా
Bunny Vas: ఆ ఒక్క సినిమా వల్ల ఏకంగా 6 కోట్లు నష్టపోయా
Director Maruthi: ఈవెంట్లో అడ్రస్ చెప్పిన పాపానికి మారుతికి స్వీట్ షాకిచ్చిన అభిమాని
Sravana Bhargavi: మొన్న ఆయన.. ఇప్పుడు ఈమె !! అసలు విషయం దాస్తూ.. షాకింగ్ కామెంట్స్
Naa Anveshana: అన్వేష్‌పై BNS సెక్షన్.. ఇండియాకొస్తే బొక్కలోకే
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

