Sravana Bhargavi: మొన్న ఆయన.. ఇప్పుడు ఈమె !! అసలు విషయం దాస్తూ.. షాకింగ్ కామెంట్స్
సింగర్ శ్రావణ భార్గవి, హేమచంద్రతో విడాకులపై పరోక్షంగా స్పందించారు. ఒంటరి తల్లిగా ఆమె ప్రయాణం, పెరిగిన ఆత్మవిశ్వాసం, స్నేహితుల మద్దతు గురించి తెలిపారు. సీతా దేవిని ఉదహరిస్తూ, కష్ట సమయాల్లో నిజాయితీ, అంతర్గత బలం ఎలా బయటపడతాయో వివరించారు. తన గురించి తనకు స్పష్టమైన అవగాహన ఉందని, విమర్శలు ప్రభావితం చేయవని స్పష్టం చేశారు.
సింగర్ హేమ చంద్రను ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రావణ భార్గవి.. ఇప్పుడు తన బిడ్డతో సింగిల్‌గానే ఉంటున్నారు. హేమ చంద్రతో విడాకుల గురించి నేరుగా బయట కానీ.. అటు సోషల్ మీడియాలో కానీ ప్రస్తావించని ఈమె.. ఇప్పుడు మాత్రం ఇన్‌డైరెక్ట్‌గా.. ఓ ఇంటర్వ్యూలో కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే .. శ్రావణ భార్గవితో తన విడాకుల గురించి ఎందుకు చెప్పాలి. చిబితే ఎవరికి లాభమంటూ.. ఓ ఇంటర్వ్యూలో హేమ చంద్ర చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన కొన్ని రోజులకే.. ఈమె కూడా తన కష్ట సుఖాల గురించి మాట్లాటడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. సీతా దేవిని ఉదహరిస్తూ.. నిజాయితీగా ఉన్నప్పుడు, మనల్ని మనం నిరూపించుకోవాల్సిన టైం వచ్చినప్పుడు.. అది తప్పక జరుగుతుందని శ్రావణ భార్గవి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇది మానవులకు వర్తించే ఒక ముఖ్యమైన పాఠమని, మన లోపల ఉన్న బలం, వ్యక్తిత్వం అలాంటి సమయాల్లో బయటపడతాయని ఆమె చెప్పుకొచ్చారు. అంతేకాదు కెరీర్ కంటే.. వయసు పెరిగే కొద్దీ, తన ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని శ్రావణ భార్గవి అన్నారు. “మనల్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి మనం సిద్దమవుతాం కదా అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఇతరుల విమర్శలు, అభిప్రాయాలు తనను ఇప్పుడు ఏ మాత్రం ప్రభావితం చేయవని, తన గురించి తనకు స్పష్టమైన అవగాహన ఉందని శ్రావణ భార్గవి చెప్పుకుకొచ్చారు. వయసు పెరిగే కొద్దీ మహిళలు మరింత అందంగా, ఆకర్షణీయంగా, ఆత్మవిశ్వాసంగా మారతారని శ్రావణ భార్గవి అన్నారు. తనకు కష్ట సమయాలు ఎదురైనప్పుడు, తనను తాను ప్రశ్నించుకుంటున్నప్పుడు తన ఫ్రెండ్స్ ఎంతగానో మద్దతునిచ్చారని, ఎటువంటి ప్రశ్నలు వేయకుండా తోడు నిలిచారని ఆమె తెలిపారు. ఆంజనేయ స్వామికి తన శక్తి తెలియకపోయినప్పుడు ఎలా ఒకరు వచ్చి చెప్పారో, అలాగే తన స్నేహితులు తనకు సాయం చేశారని తెలిపారు. మనల్ని అర్ధం చేసుకునే స్నేహితులు దొరికినప్పుడు.. మనల్ని మనం మరింత స్ట్రాంగ్ గా మార్చుకుంటాం. అలాంటి స్నేహితులు అందరికీ దొరకరు అంటూ చెప్పుకొచ్చారు శ్రావణ భార్గవి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Naa Anveshana: అన్వేష్‌పై BNS సెక్షన్.. ఇండియాకొస్తే బొక్కలోకే
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

