Naa Anveshana: అన్వేష్‌పై BNS సెక్షన్.. ఇండియాకొస్తే బొక్కలోకే
"నా అన్వేషణ" యూట్యూబర్ అన్వేష్ హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదాల్లో చిక్కుకున్నారు. కరాటే కల్యాణి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా, అన్వేష్‌పై సెక్షన్లు 352, 79, 299 BNS మరియు 67 IT చట్టం కింద కేసు నమోదైంది. హిందూ సంఘాలు, ప్రజలు అతని ఛానెల్‌ను బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అతనికి వ్యతిరేకంగా పోస్టులు పెరుగుతున్నాయి.
నా అన్వేషణ పేరుతో యూట్యూబ్‌లో పాపులర్ అయిన అన్వేష్.. ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. రెండు రోజుల క్రితం హిందూ దేవతలపై ఇతను అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో హిందూ సంఘాలతో పాటు.. సామాన్యులు కూడా అన్వేష్‌ను అతని యూట్యూబ్ ఛానెల్‌ను బాయ్ కాట్ చేయాలంటూ పిలుపునిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇతనికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. ఈక్రమంలోనే అన్వేష్‌పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కరాటే కళ్యాణీ. దేవీ దేవతలను అన్వేష్ దూషించారంటూ పంజాగుట్ట PSలో ప్రముఖ నటి కరాటే కల్యాణి ఫిర్యాదు చేశారు. దీంతో BNSలోని సెక్షన్ 352, 79, 299లతోపాటు ఐటీ చట్టంలోని 67 సెక్షన్ కింద అన్వేష్‌పై కేసు ఫైల్ చేశారు పోలీసులు. త్వరలో అన్వేష్‌కి నోటీసులు పంపనున్నారు. అంతేకాదు అన్వేష్ వివాదాస్పద కామెంట్స్‌పై తెలంగాణలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అతడిని భారత్‌కు రప్పించాలని హిందూసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరో పక్క సోషల్ మీడియాలో అన్వేష్ డౌన్ ఫాల్ మొదలైందనే కామెంట్ ఉంది. అతని ఫాలోవర్స్ అండ్ సబ్ స్క్రైబర్స్ అందరూ ఇప్పుడు అన్వేష్‌ను అన్‌ఫాలో కొట్టడం కనిపిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
న్యూ ఇయర్ ట్రిప్‌కి పూజా, మాళవిక, మౌని రాయ్
దేశ ప్రజలకు కేంద్రం భారీ శుభవార్త..జనవరి 1 నుంచి
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

