Gold Price Today: భయపెట్టేస్తోన్న గోల్డ్, సిల్వర్ ధరలు.. గోల్డ్ ప్రియులకు ఇక ద..ద..దరువు..దరువే.! ఇప్పుడే కొనకపోతే
గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు గమనిస్తున్నారా? ఒక్కోరోజు ధరలు అమాంతం పెరుగుతున్నాయ్. ఒక్కోరోజు అనూహ్యంగా ఢమాల్‌మంటున్నాయి. ఈ కన్‌ఫ్యూజన్‌లో లక్షో, పదిలక్షలో పెట్టి బంగారమో, వెండో కొన్నాక వాటి రేటు పడిపోతే గుండెల్లో ఎక్కడో చివుక్కుమంటుంది. మరి ఇంతకీ తాజాగా గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయంటే.?

ఒకరోజు ఎగుడు.. ఒకరోజు దిగుడు.. పబ్లిక్ బ్రెయిన్‌తో గోల్డ్, సిల్వర్ రేట్స్ గేమ్స్ ఆడుతున్నాయి. అమాంతం ఎందుకు స్పీడ్ అందుకుంటున్నాయ్? అంతలోనే ఎందుకు బ్రేక్ పడుతున్నాయ్? పదిరోజుల్లోనే ఫజిల్‌గా మారిన లోహాల ధరలు కొత్త సంవత్సరంలో ఎలా ఉండబోతున్నాయి. అలాగే ఇవాళ బులియన్ మార్కెట్‌లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయి. ఇప్పుడు చూసేద్దాం. సాధారణంగా అంతర్జాతీయ పరిణామాలు సరిగ్గా ఉండి ఉంటే.. ఈ మెటల్స్ ధరల్లో మార్పులు పెద్దగా ఉండేవి కాదు. కానీ అమెరికాలో ఆర్థిక పరిణామాలు, అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు ఈ మెటల్స్ ధరల పెరుగుదలకు ఊతం అందిస్తున్నాయి. రెండు రోజుల క్రితం ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించంతోపాటు లాంగ్ పొజిషన్ల నుంచి వెనక్కి తగ్గడంతో ఈ గోల్డ్, సిల్వర్ ధరలు యూటర్న్ తీసుకున్నాయి. అయితే ఇప్పుడు మరోసారి ధరలు ఆకాశాన్ని చూస్తున్నాయ్. తాజాగా ఒక్క రోజులోనే భారీగా పెరిగాయి. శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1140 మేరకు పెరగగా.. కిలో వెండి ధర రూ. 4 వేలు పెరిగింది. మరి దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి, బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.?
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,36,200 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం రూ. 1,24,850గా కొనసాగుతోంది. బెంగళూరు, ముంబై, కోల్‌కతాలోనూ ఇదే ధరలు ఉన్నాయి. ఇక చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,37,240గా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,25,800గా ఉంది. అటు ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,36,350గా.. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,25,000గా కొనసాగుతోంది. ఇక సిల్వర్ ధరల విషయానికొస్తే.. ఇప్పటికే కేజీపై రూ. 4 వేలు పెరిగిన ధర.. రూ. 3 లక్షల దగ్గరకు క్రమంగా చేరుతోంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 2.60 లక్షలు కాగా.. చెన్నైలోనూ ఇదే ధర కొనసాగుతోంది. ఇక ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, పూణేలో కిలో వెండి ధర రూ. 2.42 లక్షలుగా ఉంది.
మరోవైపు 2026 చివరికి 10 గ్రాముల బంగారం ధర లక్షన్నరకు చేరుతుందని.. లక్షా 60వేలు కూడా దాటే చాన్స్ ఉందని గోల్డ్‌మన్ శాక్స్ సంస్థ చెప్తోంది. అంతర్జాతీయ అనిశ్చితులు, అమెరికా టారిఫ్‌లు, గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడుల పెరుగుదల లాంటి కారణాలతో బంగారం ధరలు పెరగనున్నాయి. వాస్తవానికి.. గోల్డ్ రేట్ ఈ ఏడాది 70శాతం పైగానే పెరిగింది. ఈ రేంజ్‌లో 1979లో 120 శాతం పెరిగినట్లు రికార్డులు చెప్తున్నాయి. 2024 డిసెంబర్ 31న పది గ్రాముల బంగారం 78వేల 950రూపాయలు ఉంటే 2025 ఏప్రిల్ 22న లక్ష రూపాయలు దాటి రికార్డ్‌లు సృష్టించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




