Ayushman Health Account: జస్ట్ ఆధార్ నెంబర్ చెబితే చాలు.. మీ హెల్త్ ప్రొఫైల్ మొత్తం చేతికి.. కేంద్రం కొత్త ప్లాన్
జస్ట్ ఆధార్ నెంబర్ చెబితే చాలు.. మీ హెల్త్ ప్రొఫైల్ మొత్తం వచ్చేస్తుంది. మీ బ్లడ్ గ్రూప్ ఏంటి..? మీకు ఉన్న వ్యాధులు ఏంటి..? గతంలో ఏయే మెడిసిన్స్ వాడారు..? లాంటి అన్ని వివరాలు తెలిసిపోతాయి. ఇందుకోసం కేంద్రం డిజిటల్ హెల్త్ మిషన్‌ను ప్రారంభించింది.

దేశంలోని ప్రజలకు ఆరోగ్య సేవలు వేగంగా అందించేందుకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్(ABHA)ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆధార్ కార్డ్ తరహాలో ప్రతీవ్యక్తికి ఒక ఆభా అకౌంట్ అందిస్తారు. ఈ అకౌంట్ ఒక డిజిటల్ హెల్త్ ఐడెంటిటీగా పనిచేస్తుంది. దేశంలోని ప్రతీ వ్యక్తి మెడికల్ హిస్టరీ దీని ద్వారా సులువుగా తెలుసుకోవచ్చు. దీంతో హాస్పిటళ్లకు వెళ్లినప్పుడు రోగి మెడికల్ మిస్టరీ తెలుసుకుని వేగంగా డాక్టర్లు చికిత్స అందించవచ్చు. వేగంగా ఆరోగ్య సేవలను అందించేందుకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆధార్ కార్డ్ నెంబర్ ఆధారంగా ఈ ప్రత్యేక ఆభా అకౌంట్‌ను క్రియేట్ చేస్తారు. బ్లడ్ గ్రూప్ ఏంటి..? ఏయే వ్యాధులతో బాధపడుతున్నారు? ఏయే మెడిసిన్స్ వాడుతున్నారు? లాంటి వివరాలు సులువుగా తెలుుకోవచ్చు.
ఆభా అకౌంట్ నెంబర్ చెబితే చాలు..
మీరు ఏదైనా ఆస్పత్రికి వెళ్లినప్పుడ డాక్టర్లకు వివరాలు అన్నీ చెప్పాల్సిన అవసరం ఉండదు. కేవలం ఆభా నెంబర్ లేదా ఆధార్ నెంబర్ చెబితే సరిపోతుంది. మీ వివరాలు అన్నీ డాక్టర్లు ట్రాక్ చేసి దాని ఆధారంగా వేగంగా చికిత్స అందించవచ్చు. ఒక వ్యక్తికి సంబంధించిన ఆరోగ్య సమాచారం మొత్తం కంప్యూటరైజ్డ్ చేసి ఉంటుంది. దీంతో ఒక డిజిటల్ హెల్త్ ఐడెంటిటీగా ఇది పనిచేస్తూ ఉంటుంది. ఇక ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ కోసం క్యూలైన్లలో నిల్చోవాల్సిన అవసరం ఉండదు. కేవలం ఆభా అకౌంట్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఓపీ చీటీ మొబైల్‌లోనే సులువుగా పొందవచ్చు. ఇక ప్రభుత్వ డాక్టర్ల వివరాలను కూడా యాప్‌లో నమోదు చేస్తారు. దీని వల్ల నకిలీ డాక్టర్లను గుర్తించడం, గుర్తింపు లేని మెడికల్ దుకాణాలను గుర్తించడం సులభంగా ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణలో ఇప్పటివరకు 25,162 మంది డాక్టర్లు ఇందులో రిజిస్టర్ చేసుకున్నారు. ఇక రాష్ట్రంలో 75 లక్షల మంది వ్యక్తులు ఇందులో వివరాలు నమోదు చేసుకున్నారు.
స్పీడ్ పెంచిన కేంద్రం
ఇక తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్‌పై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రతీఒక్క వ్యక్తి రికార్డును నమోదు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. హాస్పిటళ్లకు రోగులు వస్రరతే వారి వివరాలు తెలుసుకుని అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు. ఇలా ఇప్పటివరకు 75 లక్షల మందివి నమోదు చేయగా.. మరింతమందికి నమోదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇక ప్రతీ రికార్డుకు కేంద్రం రూ.20 ప్రోత్సాహకం కూడా ఆస్పత్రులకు అందిస్తోంది. మెదటి విడతగా రూ.5 కోట్లు రాష్ట్రంలోని హాస్పిటళ్లకు అందాయి. ఇక మరో రూ.5 కోట్లు త్వరలో అందనున్నాయి.
