AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rana Daggubati : రానా దగ్గుబాటి రిజెక్ట్ చేసిన సినిమాలేంటో తెలుసా?అవి చేసి ఉంటే స్టార్ హీరో రేంజ్‌కు ఎదిగేవాడేమో!

దివంగత నిర్మాత రామానాయుడు మనవడిగా, నిర్మాత సురేశ్ బాబు వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు దగ్గుబాటి రానా. నటనా పరంగా మంచి మార్కులే తెచ్చుకున్నాడు. లీడర్, కృష్ణం వందే జగద్గురమ్ వంటి డిఫరెంట్ సినిమాలతో బాహుబలి వంటి పాన్ ఇండియా సినిమాలు చేశాడు. అయితే..

Rana Daggubati : రానా దగ్గుబాటి రిజెక్ట్ చేసిన సినిమాలేంటో తెలుసా?అవి చేసి ఉంటే స్టార్ హీరో రేంజ్‌కు ఎదిగేవాడేమో!
Rana Daggubati
Basha Shek
|

Updated on: Mar 12, 2026 | 10:55 AM

Share

2010లో లీడర్ సినిమాతో హీరోగా అరంగేట్రం చేశాడు రానా దగ్గుబాటి. మొదటి సినిమాతోనే నటనా పరంగా మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత నేను నా రాక్షసి, నా ఇష్టం, కృష్ణం వందే జగద్గురుమ్, ఘాజి, నేనే రాజు నేనే మంత్రి తదితర హిట్ సినిమాల్లో హీరోగా నటించాడు. ఇక బాహుబలి సినిమాలో భళ్లాల దేవ పాత్రతో పాన్ ఇండియా రేంజ్ లోనూ ఫేమస్ అయ్యాడీ టాలీవుడ్ హల్క్. హిందీ, తమిళ సినిమాల్లోనూ విలన్ గా, సహాయక నటుడిగా మెప్పించిన రానా నిర్మాతగానూ సక్సెస్ అయ్యాడు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించి తన అభిరుచిని చాటుకున్నాడు. అయితే స్టార్ హీరో రేంజ్ కు మాత్రం ఎదగలేకపోతున్నాడు రానా. దీనికి అతని నిర్ణయాలే కారణమని టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని సినిమాలు రిజెక్ట్ చేయడంతో రానా స్టార్ హీరో రేసులో వెనకబడ్డాడని ప్రచారం జరిగింది. డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడం వల్లనో, లేక ఇతర కారణాలతో రానా ఒప్పుకున్న కొన్ని సినిమాలు కార్యరూపం దాల్చలేదు. అవేంటంటే..

ప్రస్థానం డైరెక్టర్ దేవకట్ట డైరెక్షన్లో దగ్గుబాటి రానా ఒక సినిమా చేయాల్సిందట. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదట. దేవకట్టా సైతం ఆ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేసారట. అలాగే బోయపాటి శ్రీను డైరెక్షన్లో వచ్చిన ఊర మాస్ ఎంటర్ టైనర్ ‘జయ జానకి నాయక’ సినిమా సైతం మొదట రానా తోనే చేయాలని అనుకున్నారట. కానీ కుదరలేదట. దీంతో సేమ్ అలాంటి కటౌటే ఉన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమా చేసి హిట్ కొట్టాడు బోయపాటి. దగ్గుబాటి రానా ఈ రెండు సినిమాలు చేసి ఉంటే అతని కెరీర్ మరోలా ఉండేదని సినిమా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడున్న స్టార్ హీరోలతో పాటు పోటీ పడేవాడని అంటున్నారు.

జిమ్ లో దగ్గుబాటి రానా వర్కౌట్లు…

కాగా రానా దగ్గుబాటి చివరిగా కాంత సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ పోషించాడు. అలాగే శివ కార్తికేయన్ పరాశక్తిలో ఓ స్పెషల్ రోల్ లో మెరిశాడు. ఇక నిర్మాతగానూ బిజీ బిజీగా ఉంటున్నాడీ ట్యాలెంటెడ్ హీరో.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
NEET 2026 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. టాప్‌ 138లో 8 మంది మనోళ్లే!
NEET 2026 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. టాప్‌ 138లో 8 మంది మనోళ్లే!
నేడు పట్టాలెక్కనున్న తొలి హైడ్రోజన్ రైలు.. ప్రత్యేకతలు ఇవే..
నేడు పట్టాలెక్కనున్న తొలి హైడ్రోజన్ రైలు.. ప్రత్యేకతలు ఇవే..
లార్డ్స్‌లో లాస్ట్ మ్యాచ్.. లండన్ చేరుకున్న రోహిత్ పేరేంట్స్..!
లార్డ్స్‌లో లాస్ట్ మ్యాచ్.. లండన్ చేరుకున్న రోహిత్ పేరేంట్స్..!
అమరావతి భూములకు రికార్డు ధర.. ఎకరం ఎంతో తెలుసా..?
అమరావతి భూములకు రికార్డు ధర.. ఎకరం ఎంతో తెలుసా..?
ఏపీలో మళ్లీ ఎన్నికలు.. సమరానికి సై అంటున్న రాజకీయ పార్టీలు!
ఏపీలో మళ్లీ ఎన్నికలు.. సమరానికి సై అంటున్న రాజకీయ పార్టీలు!
NEET 2026 ఫలితాల్లో దుమ్ములేపిండ్రు..టాపర్ల మార్కులు, ర్యాంకులివే
NEET 2026 ఫలితాల్లో దుమ్ములేపిండ్రు..టాపర్ల మార్కులు, ర్యాంకులివే
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగనున్న మద్యం ధరలు..
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగనున్న మద్యం ధరలు..
శుక్రవారం ఇలా చేస్తే అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది..
శుక్రవారం ఇలా చేస్తే అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది..
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. సభల్లోకి వచ్చే కీలక బిల్లులు ఇవే!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. సభల్లోకి వచ్చే కీలక బిల్లులు ఇవే!
రోహిత్ రిటైర్మెంట్‌కు అసలు కారణం ఇదేనా..?
రోహిత్ రిటైర్మెంట్‌కు అసలు కారణం ఇదేనా..?