AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ సినిమా నుంచి తప్పుకుంటా అని చెప్పా.. అది క్లాసిక్ అవుతుందని అప్పుడే చెప్పా..: కృష్ణవంశీ

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.. ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు కృష్ణవంశీ. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరిర్ మొదలు పెట్టిన కృష్ణవంశీ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. గులాబీ సినిమాతో దర్శకుడిగా మారిన కృష్ణవంశీ తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నారు.

ఆ సినిమా నుంచి తప్పుకుంటా అని చెప్పా.. అది క్లాసిక్ అవుతుందని అప్పుడే చెప్పా..: కృష్ణవంశీ
Krishnavamshi
Rajeev Rayala
|

Updated on: Jan 06, 2026 | 8:07 PM

Share

ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించారు. చివరిగా రంగమార్తాండ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు కృష్ణవంశీ. గతంలో ఓ ఇంటర్వ్యూలో కృష్ణవంశీ మాట్లాడుతూ.. తన కెరీర్‌లో ఎదురైన అనుభవాలను, ముఖ్యంగా మురారి సినిమా మహేష్ బాబు కెరీర్‌కు ఎంత కీలకమో వివరించారు. నిర్మాతల పట్ల తనకు గౌరవం ఉందని, నిర్మాతలు తన సినిమా సెట్‌కు రావడం అభ్యంతరం కాదని స్పష్టం చేశారు. నిన్నే పెళ్లాడతా, సింధూరం, చంద్రలేఖ, అంతఃపురం, సముద్రం వంటి చిత్రాలలో నిర్మాతలు సెట్‌లో ఉన్నప్పటికీ, క్రియేటివ్ అంశాలలో తప్పుగా జోక్యం చేసుకోలేదని అన్నారు కృష్ణవంశీ. మురారి సినిమా నిర్మాణ సమయంలో నిర్మాత రామ్ లింగేశ్వర రావు గారితో చిన్నపాటి ఐడియా డిఫరెన్స్ వచ్చిందని, అది పెద్దది కాకుండా ఆయన తన బావమరిది బులి సుబ్బారావును అప్పగించి, దూరగా ఉన్నారని తెలిపారు కృష్ణవంశీ.

అయినప్పటికీ బులి సుబ్బారావు, మురారిలాంటి సినిమా తీయించడానికి అడ్డుపడకుండా తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని, ఆ విషయంలో ఇప్పటికీ ఆయన పట్ల గౌరవం ఉందని కృష్ణవంశీ అన్నారు. మురారి సినిమా తాను ఎవరికీ సమాధానం చెప్పకుండా, పూర్తి స్వేచ్ఛతో చేసిన సినిమా అని వెల్లడించారు. మురారి సినిమా విడుదల సమయానికి మహేష్ బాబు కెరీర్ యువరాజు, వంశీ వంటి డిజాస్టర్ల తర్వాత ప్రశ్నార్థకంగా ఉందని కృష్ణవంశీ అన్నారు. పవన్ కళ్యాణ్ అప్పటికే స్టార్‌గా దూసుకుపోతుండగా, మహేష్ బాబు కాస్త డల్‌గా ఉన్నారని, అప్పుడు మురారి ఒక్కటే ఆశ అని ఆయన అన్నారు.

ఈ చిత్రం ఒక ప్రయోగాత్మక సినిమాగా భావించబడిందని, బలమైన స్క్రిప్ట్ లేదా విలన్ లేకపోవడంతో ప్రొడక్షన్ నుంచి హీరో టీమ్ నుంచి అనేక సందేశాలు వ్యక్తమయ్యాయని పేర్కొన్నారు. ముఖ్యంగా అలనాటి రామచంద్రుడు అనే పెళ్లి పాట విషయంలో పెద్ద వివాదం జరిగిందని కృష్ణవంశీ గుర్తుచేసుకున్నారు. చివరి పాట మాస్ డ్యాన్స్‌తో ఉండాలని అంతా కోరగా, తాను దానికి పూర్తిగా వ్యతిరేకించానని చెప్పారు. ఆ పాట ఈ సినిమాకు అత్యవసరమని, అది క్లాసిక్ గా దశాబ్దాల పాటు నిలిచిపోతుందని తనకు తెలుసు అని చెప్పారట. ఈ విషయం కృష్ణ గారి దృష్టికి వెళ్ళగా, కృష్ణవంశీ రెండు ఆప్షన్లు ఇచ్చారు: ఒకటి, తనను ఈ పాట చేయనివ్వండి, అది కొన్ని దశాబ్దాల పాటు గుర్తుండిపోతుందని, రెండోది, తాను సినిమా నుండి తప్పుకొని, వారికి కావాల్సిన కమర్షియల్ పాటను చిత్రీకరించుకొని సినిమా విడుదల చేసుకోమని, కానీ తన పేరును తీసేయమని. తన దృష్టిలో ఆ కమర్షియల్ పాట సినిమాకు అవసరం లేదని, మహేష్ కెరీర్ కూడా ముఖ్యమే కాబట్టి వారికి నచ్చినట్లు చేసుకోవచ్చని చెప్పానని ఆయన వివరించారు. మురారి దశాబ్దాల పాటు గుర్తుండిపోతుందని తాను ముందే చెప్పానని, అది నిజమైందని కృష్ణవంశీ అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.

భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
పండక్కి ఊరెళ్లేందుకు ట్రైన్‌ టిక్కెట్లు దొరకట్లేదా?
పండక్కి ఊరెళ్లేందుకు ట్రైన్‌ టిక్కెట్లు దొరకట్లేదా?
టీ లవర్స్‌కు గుడ్ న్యూస్! ఈ జపాన్ చాయ్ గురించి తెలుసా?
టీ లవర్స్‌కు గుడ్ న్యూస్! ఈ జపాన్ చాయ్ గురించి తెలుసా?