ఆ ఇద్దరు హీరోలతో సినిమాలు చేయాలనుంది.. మనసులో మాట బయటపెట్టిన హీరో శ్రీకాంత్
టాలీవుడ్ లో ఉన్న హ్యాండ్సమ్ హీరోల్లో శ్రీకాంత్ కూడా ఒకరు. కెరీర్ ప్రారంభంలో విలన్ గా నటించిన అతను ఆ తర్వాత హీరోగానూ సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు ట్రెండ్ కు తగ్గట్టుగా విలన్ గా, సహాయక నటుడిగానూ మెప్పిస్తున్నాడు. ఇక శ్రీకాంత్ ఫ్యామిలీలో చాలా మందికి సినిమా ఇండస్ట్రీతో అనుబంధం ఉంది.

ఒకప్పుడు స్టార్ హీరోగా రాణించి ఇప్పుడు సహాయక పాత్రలు చేస్తున్నాడు నటుడు శ్రీకాంత్. ఇపుడు ఆయన కొడుకు రోషన్ గా హీరోగా సినిమాలు చేస్తున్నాడు. నిర్మల కాన్వెంట్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రోషన్. రీసెంట్ గా ఛాంపియన్ సినిమాతో హిట్ అందుకున్నాడు. కొడుకు విజయంతో హీరో శ్రీకాంత్ ఆనందంలో తేలిపోతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. టాలీవుడ్‌లోని పలువురు ప్రముఖ నటులపై తన అభిప్రాయాలను పంచుకున్నారు శ్రీకాంత్. తన రెమ్యూనరేషన్ ఇప్పుడు మెరుగ్గా ఉందని, ముఖ్యంగా టెన్షన్స్ లేకుండా పనిచేయడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. దాదాపు 25 సంవత్సరాలు హీరోగా కొనసాగిన తర్వాత, ఇప్పుడు తన కుమారుడు రోషన్ కెరీర్‌ను చూసుకుంటూ, తాను రిలాక్స్డ్‌గా సినిమాలు చేయాలనుకుంటున్నానని తెలిపారు శ్రీకాంత్.
కోట బొమ్మాళి వంటి విభిన్న పాత్రలు, కొత్త కాన్సెప్ట్‌లతో చిత్రాలను ఎంచుకోవాలని చూస్తున్నా అని అన్నారు శ్రీకాంత్. ఓటీటీల రాకతో ప్రొడ్యూసర్లకు, నటులకు కొత్త అవకాశాలు లభించాయని ఆయన పేర్కొన్నారు. చిన్న చిన్నవాళ్లతో చాలా చేశాను అని ఆయన అన్నారు. గతంలో ఈవీవీ సత్యనారాయణ, కె. రాఘవేంద్రరావు వంటి దిగ్గజ దర్శకులతో పనిచేసినట్లు గుర్తు చేసుకున్నారు. దాసరి నారాయణరావుతో కలిసి నటించినప్పటికీ, ఆయన దర్శకత్వంలో పనిచేయలేకపోయానని తెలిపారు. అలాగే ఎన్టీఆర్, శోభన్ బాబు వంటి గొప్ప నటులతో కలిసి పనిచేసే అవకాశం రాలేదని ఆయన ప్రస్తావించారు. నాగేశ్వరరావు, కృష్ణంరాజు, కృష్ణ, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ వంటి వారితో నటించినట్లు తెలిపారు.
చిరంజీవి, రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ.. చరణ్ కు చిరంజీవి పోలికలే ఉన్నాయి ఎక్కువ అని ఆయన అన్నారు. ఆర్టిస్టులను గౌరవించడం, సెట్‌లో భోజన ఏర్పాట్లు, యూనిట్‌లోని అందరినీ చక్కగా చూసుకోవడం వంటి విషయాల్లో ఇద్దరూ ఒకేలా ఉంటారని పేర్కొన్నారు. రామ్ చరణ్‌ను మెచ్యూర్డ్ గయ్, వెరీ ఇంటెలిజెంట్, డీసెంట్ పర్సన్ గా అని ప్రశంసలు కురిపించారు. చరణ్ తనను అన్న అని పిలుస్తారని, వారి మధ్య మంచి అనుబంధం ఉందని శ్రీకాంత్ పంచుకున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. తారక్ నాకు ఎప్పటినుంచో తెలుసు.. మేము ఫస్ట్ బిగినింగే మా ఇంటి పక్కన శ్రీనగర్ కాలనీలో ఉండేవాడు. ఇంకా హీరో అవ్వలేదు అప్పుడు. అప్పటి నుంచి తెలుసు నాకు అని తెలిపారు. ఎన్టీఆర్ ఎనర్జీ లెవెల్స్, సరదా స్వభావం అప్పటి నుంచి ఇప్పటి వరకు మారలేదని, అతను తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్నారని శ్రీకాంత్ అన్నారు. అదేవిధంగా మహేష్ బాబు, ప్రభాస్‌లతో ఇంకా కలిసి పనిచేయలేదని, అయితే భవిష్యత్తులో అలాంటి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నానని శ్రీకాంత్ చెప్పారు. తారక్‌తో నేను అనుకోలేదు, ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇప్పుడు దేవరలో తారక్‌తో వచ్చింది అవకాశం. అలాగే చూసి ఇవి కూడా ఎప్పుడైనా వస్తాయి, చూద్దాం అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు శ్రీకాంత్.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.




