రూ. 25వేలు ఇస్తే ఏమైనా చేస్తుందా.? క్లారిటీ ఇచ్చిన సుష్మా భూపతి
సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది పాపులర్ అవుతున్నారు. కొంతమంది ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకుంటున్నారు. కొంతమంది తమలో ఉన్న డాన్స్ టాలెంట్, యాక్టింగ్ టాలెంట్ తో క్రేజ్ తెచ్చుకుంటున్నారు. కానీ మరికొంతమంది మాత్రం పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ పాపులర్ అవుతున్నారు.

సుష్మా భూపతి.. సోషల్ మీడియా పుణ్యమా అని విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. వృత్తిరీత్యా టీచర్ అయిన సుష్మా భూపతి సోషల్ మీడియాలో ఒకే ఒక్క డాన్స్ స్టెప్ తో పాపులర్ అయ్యింది. ఆ ఒక్క డాన్స్ స్టెప్ తర్వాత ఆమె లైఫ్ పూర్తిగా మారిపోయింది. ఎక్కడ చూసిన ఆమె వీడియోలే కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా వల్ల వచ్చిన క్రేజ్ తో పలు ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టింది సుష్మా భూపతి. దాంతో మరింత క్రేజ్ తెచ్చుకుంది. అలాగే ఆమె పై పలు నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సుష్మా భూపతి ఆసక్తికర విషయాలు పంచుకుంది.
కెరీర్ పీక్‌లో ఉండగానే యాక్సిడెంట్.. కట్ చేస్తే మూడు ఏళ్లు బెడ్ రెస్ట్.. ఇప్పుడు ఫుల్ బిజీ బ్యూటీ
ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్ లో నిర్వహించిన ఇంటర్వ్యూలో తనపై వచ్చిన కొన్ని ఆరోపణలకు ధైర్యంగా సమాధానమిచ్చింది సుష్మా భూపతి. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ సుష్మా భూపతిపై సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఒక ముఖ్యమైన ఆరోపణను ప్రస్తావించారు. సుష్మ రూ. 25,000 లేకుండా ఏ పని చేయదు. రూ.25,000 ఇస్తే ఆమె ఎలాంటి ప్రమోషన్ అయినా చేస్తుంది అనే కామెంట్లలో వైరల్ అయ్యాయని యాంకర్ అడగ్గా.. దానికి అదిరిపోయే రిప్లే ఇచ్చారు.
చేయని తప్పుకు నాకొడుకు 10ఏళ్లు మానసికక్షోభ అనుభవించాడు.. రాజాసాబ్ నటి సెన్సేషనల్ కామెంట్స్
ఈ ఆరోపణను ప్రస్తావించినప్పుడు, సుష్మా భూపతి నేరుగా యాంకర్‌ను ప్రశ్నిస్తూ. “నువ్వు నాకు ఎంత ఇచ్చావు? ఇక్కడ కూర్చోవడానికి ఏమివ్వలేదు. మరి రూ.25,000 తీసుకోకుండా నేను ఎందుకు ఇక్కడ కూర్చోవాలి.? నువ్వు అడిగిన దానికి ఎందుకు ఆన్సర్ ఇవ్వాలి.? అని ప్రశ్నించారు. ఒక యూట్యూబర్ ఇటీవల ఈ ఆరోపణను వైరల్ చేశారని, సుష్మా భూపతి ప్రమోషన్ల కోసం డబ్బులు తీసుకొని డాన్స్ లు చేస్తుంది అనేదాంట్లో ఎలాంటి నిజం లేదు. నేను అలాంటివి చేయను. ప్రమోషన్స్ చేస్తాను దాని వల్ల వచ్చినవే తీసుకుంటాను. కానీ డిమాండ్ చేయను అని సుష్మ క్లారిటీ ఇచ్చింది.
కష్ట సమయంలో నాకు అండగా నిలిచింది వాళ్లే.. సింగర్ శ్రావణ భార్గవి ఆసక్తికర కామెంట్స్
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.




