AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కష్ట సమయంలో నాకు అండగా నిలిచింది వాళ్లే.. సింగర్ శ్రావణ భార్గవి ఆసక్తికర కామెంట్స్

టాలీవుడ్ సింగర్ శ్రావణ భార్గవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో సూపర్ హిట్ సాంగ్స్ పాడి ప్రేక్షకులను అలరించారు శ్రావణ భార్గవి. ప్రస్తుతం ఆమె ప్రైవేట్ సాంగ్స్ తో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఆమె ఓ కొత్త సాంగ్ ను రిలీజ్ చేశారు.

కష్ట సమయంలో నాకు అండగా నిలిచింది వాళ్లే.. సింగర్ శ్రావణ భార్గవి ఆసక్తికర కామెంట్స్
Sravana Bhargavi
Rajeev Rayala
|

Updated on: Dec 31, 2025 | 1:01 PM

Share

సింగర్ శ్రావణ భార్గవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించారు శ్రావణ భార్గవి. చాలా కాలంగా సైలెంట్‌గా ఉన్న శ్రావణ భార్గవి ఇప్పుడు తిరిగి బిజీ అవుతున్నారు. సినిమాల్లో సాంగ్స్ తో పాటు ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేస్తూ బిజీగా ఉన్నారు శ్రావణ భార్గవి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రావణ భార్గవి మాట్లాడుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం శ్రావణ భార్గవి వరుస ఇంటర్వ్యూలో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్త్రీల గురించి మహిళలు ఎంత స్ట్రాంగ్ గా ఉంటారో చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే శ్రావణ భార్గవి సీతాదేవి గురించి ప్రస్తావిస్తూ, ఆమెను సాధారణంగా ఓపికకు ప్రతీకగా చూసినప్పటికీ, తన స్వచ్ఛతను నిరూపించుకోవడానికి సీత ఎంత శక్తివంతంగా పోరాడిందో తెలిపారు శ్రావణ భార్గవి. నిజాయితీ ఉన్నప్పుడు, మనల్ని మనం నిరూపించుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు అది తప్పక జరుగుతుందని ఆమె అన్నారు. ఇది మానవులకు వర్తించే ఒక ముఖ్యమైన పాఠమని, మన లోపల ఉన్న బలం, వ్యక్తిత్వం అలాంటి సమయాల్లో బయటపడతాయని ఆమె చెప్పుకొచ్చారు.

Year Ender 2025: ఓజీ, సంక్రాంతికి వస్తున్నాం, హిట్3 కాదు.. ఈ ఏడాది బిగెస్ట్ హిట్ సినిమా ఇదే

అలాగే ఆమె మాట్లాడుతూ, కెరీర్ ప్రారంభంలో అది కొంతవరకు నటించి నేర్చుకోవడం వంటిదని శ్రావణ భార్గవి అన్నారు. అయితే, వయసు పెరిగే కొద్దీ, ముఖ్యంగా 20ల నుంచి  30లకు మారిన తర్వాత తన ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని ఆమె అన్నారు. “మనల్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి మనం సిద్దమవుతాం” అని ఆమె అన్నారు. ఇతరుల విమర్శలు, అభిప్రాయాలు తనను ఇప్పుడు ఏ మాత్రం ప్రభావితం చేయవని, తన గురించి తనకు స్పష్టమైన అవగాహన ఉందని శ్రావణ భార్గవి చెప్పుకుకొచ్చారు. వయసు పెరిగే కొద్దీ మహిళలు మరింత అందంగా, ఆకర్షణీయంగా, ఆత్మవిశ్వాసంగా మారతారని శ్రావణ భార్గవి అన్నారు.

ఇవి కూడా చదవండి

ఆ స్టార్ హీరో నన్ను బెదిరించే వాడు.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్ మీనా

తనకు కష్ట సమయాలు ఎదురైనప్పుడు, తనను తాను ప్రశ్నించుకుంటున్నప్పుడు తన ఫ్రెండ్స్ ఎంతగానో మద్దతునిచ్చారని, ఎటువంటి ప్రశ్నలు వేయకుండా తోడు నిలిచారని ఆమె తెలిపారు. ఆంజనేయ స్వామికి తన శక్తి తెలియకపోయినప్పుడు ఎలా ఒకరు వచ్చి చెప్పారో, అలాగే తన స్నేహితులు తనకు సాయం చేశారని తెలిపారు. మనల్ని అర్ధం చేసుకునే స్నేహితులు దొరికినప్పుడు.. మనల్ని మనం మరింత స్ట్రాంగ్ గా మార్చుకుంటాం. అలాంటి స్నేహితులు అందరికీ దొరకరు అంటూ చెప్పుకొచ్చారు శ్రావణ భార్గవి.

అందుకే ఇన్ స్టాలో అలాంటి ఫోటోలు షేర్ చేస్తా.. ఓపెన్‌గా చెప్పేసిన ఇనయ సుల్తానా

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.