కెరీర్ పీక్‌లో ఉండగానే యాక్సిడెంట్.. కట్ చేస్తే మూడు ఏళ్లు బెడ్ రెస్ట్.. ఇప్పుడు ఫుల్ బిజీ బ్యూటీ
చాలా మంది హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలతోనే పాపులర్ అవుతున్నారు. చాలా మంది హీరోయిన్స్ ఓవర్ నైట్ లోనే స్టార్ గా మారిపోయారు. కానీ కొంతమంది మాత్రం ఎంత ప్రయత్నించినా కూడా స్టార్ డమ్ దక్కించుకోలేకపోతున్నారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న భామ ఒకరు.

మోడలింగ్ తో కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత హీరోయిన్ గా మారిన అందాల తారల్లో ఈ అమ్మడు ఒకరు. కెరీర్ బిగినింగ్ లోనే స్టార్ హీరోల సరసన ఛాన్స్ అందుకుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ నటించి మెప్పించింది. రామ్ పొతినేని, రవితేజ, సాయి ధరమ్ తేజ్, సుధీర్ బాబు, బెల్లం కొండ సాయి శ్రీనివాస్ తదితర యంగ్ అండ్ సీనియర్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది.. కొన్ని హిట్లు, కొన్ని ఫ్లాప్స్ కూడా అందుకుంది. అయితే ఉన్నట్లుండి సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. కెరీర్ పీక్స్ లో ఉండగానే యాక్సిడెంట్ కు గురైంది. దాంతో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడేళ్లు బెడ్ రెస్ట్ తీసుకుంది. కెమెరా ముందుకు రాలేదు. సోషల్ మీడియాలోనూ సందడి లేదు దీంతో ఈ ముద్దుగుమ్మకు ఏమైపోయిందోనని సినీ అభిమానులు టెన్షన్ పడ్డారు. అయితే ఒక రోజు సోషల్ మీడియా ద్వారా టచ్ లోకి వచ్చిన ఈ బ్యూటీ సంచలన విషయాన్ని బయట పెట్టింది.
తనకు యాక్సిడెంట్ అయ్యిందని, అదృష్టం కొద్దీ ప్రాణాపాయం తప్పిందని చెప్పుకొచ్చింది. సుమారు మూడేళ్లు బెడ్ పైనే ఉన్నానంటూ తెలిపింది. దీంతో అభిమానులు షాక్ అయ్యారు. అయితే మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిందీ అందాల తార. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. ఆమె ఎవరో కాదు.. క్రేజీ బ్యూటీ నభా నటేష్. సుధీర్ బాబు హీరోగా నటించిన నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.
ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా భారీ హిట్ అందుకోవడంతో పాటు కలెక్షన్స్ కూడా భారీగా రాబట్టింది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అందుకుంది. అయితే ఈ అమ్మడికి అవకాశాలు క్యూ కడుతున్న సమయంలో ఊహించని విధంగా రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో నభా తీవ్రంగా గాయపడింది. దాంతో ఆమె రెండేళ్లు బెడ్ పైనే ఉండాల్సి వచ్చింది. ఇక కోలుకున్న తర్వాత తిరిగి సినిమాలతో బిజీగా మారింది. మొన్నామధ్య డార్లింగ్ అనే సినిమా చేసింది కానీ ఆ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు స్వయంభు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిన్నది సోషల్ మీడియాలో చురుకుగా ఉండే నభా .. హాట్ హాట్ ఫొటోలతో కుర్రాళ్లను కవ్విస్తుంది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.




