AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఆమె నా కూతురు’ అంటూ.. షాకిచ్చిన టబు

‘ఆమె నా కూతురు’ అంటూ.. షాకిచ్చిన టబు

Phani CH
|

Updated on: Jan 03, 2026 | 11:07 AM

Share

నటి టబు ఇటీవల ఓ ఈవెంట్‌లో ఫాతిమా సనా షేక్‌ను తన కూతురుగా పరిచయం చేసి అందరికీ షాకిచ్చింది. 1997లో వచ్చిన 'చాచీ 420' సినిమాలో ఫాతిమా టబు కూతురిగా బాలనటిగా నటించింది. ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ టబు సరదాగా చేసిన ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వారి పాత బంధాన్ని, ప్రేమను చాటిన ఈ సంఘటన అందరినీ ఆకట్టుకుంది.

54 ఏళ్ల వయసులో కూడా.. బాలీవుడ్‌లో వరుస పెట్టి సినిమాలు చేయడమే కాదు.. ఇప్పటికీ యంగ్ హీరోయిన్స్‌కే పోటీనిచ్చే అందంతో అందర్నీ ఆకట్టుకుంటారు టబు. అలాంటి టబు ఓ ఈవెంట్‌లో అందరికీ స్వీట్ షాకిచ్చారు. ఆమె నా కూతురు అంటూ.. హీరోయిన్ ఫాతిమాను పరిచయం చేసి.. నోరెళ్లబెట్టి చూస్తున్న మీడియాను చూసి నవ్వేశారు. ఆ తర్వాత అసలు విషయం చెప్పి అందర్నీ నవ్వించేశారు. ఫాతిమా సనా..! ఇప్పుడు బాలీవుడ్‌లో వన్‌ ఆఫ్ ది బిజీయెస్ట్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న ఈమె.. అమీర్ ఖాన్ దంగల్ సినిమాతో సౌత్ లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాలో తన యాక్టింగ్‌తో బెస్ట్ పర్పార్మ్‌గా చాలా అవార్డులను కూడా అందుకుంది. ఇక ఆ సినిమా తర్వాత కమర్షియల్ హీరోయిన్‌గా మారిన ఈమె.. రీసెంట్‌గా ‘ఇక్కీస్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రీమియర్ షోకే వన్‌ ఆఫ్‌ ది గెస్ట్ గా విచ్చేసిన టబు.. ఫాతిమాను తన కూతురంటూ అందరికీ పరిచయం చేసింది. 1997లో ‘చాచి 420’ సినిమాలో టబు కూతురిగా ఫాతిమా సనా చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించింది. ఆ విషయాన్ని గుర్తు చేసుకున్న టబు.. ఫాతిమాను తన కూతురుగా పరిచయం చేస్తూ అక్కడున్న వారికి స్వీట్ షాకిచ్చింది. ఆ తర్వాత అసలు విషయం చెప్పేసింది. ఈ కారణంగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఘోరమైన పాపం చేశావ్.. హీరోయిన్‌పై ఫైర్ అవుతున్న మత పెద్దలు

Mohanlal: 70 కోట్లు పెట్టి సినిమా తీస్తే పాతిక లక్షల కలెక్షన్ మోహన్ లాల్‌ కెరీర్‌కే మచ్చలాంటి సినిమా

Vishwambhara: టార్గెట్ పిక్స్ !! విశ్వంభర కూడా వచ్చేస్తున్నాడు..

TOP 9 ET News: పవర్‌ ఫుల్ ట్రైలర్‌ వచ్చేస్తోందోచ్‌… | మధ్యలో వీళ్లిద్దరిదో గోల.. రచ్చే రచ్చ !!

న్యూ ఇయర్‌ వేళ డెలివరీ బాయ్ ఎమోషనల్‌..కారణం ఇదే