న్యూ ఇయర్ వేళ డెలివరీ బాయ్ ఎమోషనల్..కారణం ఇదే
న్యూ ఇయర్ వేళ కస్టమర్ ఇచ్చిన రూ.501 టిప్, ఫుడ్ డెలివరీ బాయ్ బిట్టు హృదయపూర్వక స్పందన సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పెట్రోల్ డబ్బులు లేవని చెప్పిన బిట్టుకు కస్టమర్ చూపిన దయ, గిగ్ వర్కర్ల జీవితంలోని కష్టాలను, చిన్నపాటి సహాయం వల్ల కలిగే గొప్ప ప్రభావాన్ని తెలియజేసింది. ఇది సానుభూతి, మానవత్వం యొక్క శక్తిని చాటింది.
న్యూ ఇయర్ వేడుకల వేళ ఓ ఫుడ్ డెలివరీ బాయ్ కి కస్టమర్ ఇచ్చిన భారీ టిప్, దానికి ఆ యువకుడు ఇచ్చిన ఎమోషనల్ రిప్లై సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన గిగ్ వర్కర్ల కష్టాలను అర్ధం చేసుకొని, చిన్నపాటి దయ చూపడం వల్ల కలిగే గొప్ప ప్రభావాన్ని తెలియజేస్తోంది. డిసెంబర్ 31 రాత్రి ఓ కస్టమర్ ఓ యాప్‌లో ఫుడ్ ఆర్డర్ చేశారు. రాత్రి 8:34 గంటలకు చేసిన ఆర్డర్, సుమారు గంటన్నర ఆలస్యంగా రాత్రి 10 గంటలకు డెలివరీ అయింది. డెలివరీ చేసిన బిట్టు అనే యువకుడు, తనకు ఇంకా 30 ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయంటూ తీవ్ర ఒత్తిడికి గురవుతూ చెప్పాడు. అందరూ కొత్త సంవత్సర వేడుకల్లో ఉన్నప్పుడు, బిట్టు నవ్వుతూ తన పని తాను చేసుకుపోవడం చూసి కస్టమర్ చలించిపోయాడు. అతనికి మంచి నీళ్లు ఇచ్చి, కాసేపు విశ్రాంతి తీసుకోమని సూచించాడు. ఆ తర్వాత డెలివరీ బాయ్ బిట్టు అక్కడ్నించి వెళ్లిపోయాడు. అయితే, ఆ కస్టమర్ సదరు ఫుడ్ యాప్ నుంచి బిట్టు నంబర్ తీసుకుని, యూపీఐ ద్వారా రూ.501 టిప్‌గా పంపాడు. “హ్యాపీ న్యూ ఇయర్, ఇది మీ కుటుంబానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా” అని మెసేజ్ పెట్టాడు. దీనికి బిట్టు వాట్సాప్‌లో స్పందిస్తూ, సార్, చాలా చాలా ధన్యవాదాలు. పెట్రోల్ కు డబ్బులు లేని సమయంలో… మీరు పంపిన డబ్బుతో నాకు పెట్రోల్ ఖర్చు తీరిపోతుంది (“వెరీ వెరీ థాంక్ యు సో మచ్ సర్, ముఝే పెట్రోల్ కే లియే పైసా హో గయా”) అని రిప్లై ఇచ్చాడు. ఈ చాట్‌ను కస్టమర్ ‘ఎక్స్’ లో పోస్ట్ చేస్తూ, ఈ రైడర్లు మన హీరోలు. మన జీవితాలను సులభతరం చేస్తారు. ఏ పనీ చిన్నది కాదు అంటూ రాసుకొచ్చారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సిగరెట్ రూ.18 కాదు.. ఇక రూ.72
తప్పతాగి రెచ్చిపోయిన ఎస్‌ఐ.. ఏం చేశాడంటే
న్యూ ఇయర్ వేళ మహేష్ ఫ్యామిలీ ఫొటోలు పంచుకున్న నమ్రతా
ఈ రైతు ఆలోచనకు ఎవడైనా సలాం కొట్టాల్సిందే
రూ.50 పందెం కోసం పెన్ మింగిన విద్యార్థి..
ప్రాణం తీసిన బిర్యానీ.. అస్సలు ఏం జరిగిందంటే
అయ్యబాబోయ్.. రూ.6 లక్షల బిర్యానీలు హాంఫట్
ఎంతకు తెగించావురా !! రీల్స్ కోసం ఇంత రిస్క్
అంతా ధనవంతులే.. చిన్న వయసులో సన్యాసం ఏంటి ??
న్యూ ఇయర్ వేళ డెలివరీ బాయ్ ఎమోషనల్..కారణం ఇదే

