కనువిందు చేస్తున్న హిమపాతం.. పోటెత్తిన పర్యాటకులు
నూతన సంవత్సరం వేళ హిమాచల్‌ప్రదేశ్‌లో పర్యాటకుల రద్దీ పెరిగింది. సిమ్లా, మనాలి వంటి హిల్ స్టేషన్లలో హిమపాతాన్ని ఆస్వాదించేందుకు వేలాది మంది తరలివస్తున్నారు. అయితే, ఈ రద్దీ వల్ల తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు, పార్కింగ్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఢిల్లీ కాలుష్యం కూడా పర్యాటకులు హిమాచల్‌కు రావడానికి ఒక కారణం. భద్రతా ఏర్పాట్ల మధ్య పర్యాటకులు మంచు విన్యాసాలను ఆనందిస్తున్నారు.
హిమాచల్‌ప్రదేశ్‌లో టూరిస్టుల రద్దీ కొనసాగుతోంది. హిల్ స్టేషన్లలో హిమపాతాన్ని ఎంజాయ్ చేయడానికి జనం భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. అయితే టూరిస్టుల రద్దీ కారణంగా చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. న్యూఇయర్ వేళ హిమాచల్‌ప్రదేశ్‌కు టూరిస్టులు పోటెత్తారు. సిమ్లా, కులూ, మనాలి లాంటి హిల్ స్టేషన్లలో హిమపాతం కనువిందు చేస్తోంది. దేశం నలమూలల నుంచి టూరిస్టులు పోటెత్తారు. అటల్ టన్నెల్, రోహ్‌తాంగ్ పాస్‌కు వెళ్లే మార్గంలో అనేక ప్రాంతాల దగ్గర భారీగా హిమవర్షం కురుస్తోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన పర్యాటకులతో సందడిగా కన్పిస్తోంది. అయితే గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లు ఇబ్బందిగా మారాయి. చాలా ప్రాంతాల్లో పార్కింగ్ సౌకర్యం లేకపోవడం సమస్యగా మారింది. నూతన సంవత్సరం మొదటి రోజునే, హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలిని రికార్డు స్థాయిలోటూరిస్టులు సందర్శించారు. ముంచుకురిసే వాతావరణాన్ని టూరిస్టులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. డల్హౌసీ లాంటి నగరాలకు కూడా శీతాకాల శోభ వచ్చింది. అయితే చాలా చోట్లు ఇరుకైన రోడ్లు కావడంతో పలు చోట్ల వాహనాలు మెల్లగా కదులుతున్నాయి. చిన్నారులతో పాటు పెద్దలు కూడా ఈ సీజన్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. టోల్‌గేట్ల దగ్గర కూడా విపరీతమై రద్ద కన్పిస్తోంది. చంబా వ్యాలీలో కూడా తొలిమంచు కురిసింది. వందలాదిమంది టూరిస్టులు చంబా వ్యాలీని సందర్శించారు. టూరిస్టులు వింటర్ గేమ్స్‌లో కూడా సెదతీరుతున్నారు. టూరిస్ట్ స్పాట్‌లతో పాటు హిమాచల్ లోని అధ్యాత్మిక క్షేత్రాలు కూడా జనంతో కిటకిటలాడుతున్నాయి. న్యూఇయర్ వేడుకల వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. గత ఏడాది కంటే ఈసారి హిమాచల్‌ప్రదేశ్‌కు టూరిస్టుల సంఖ్య చాలా పెరిగిందని పర్యాట శాఖ అధికారులు వెల్లడించారు. ఢిల్లీ , పంజాబ్ , హర్యానా రాష్ట్రాల నుంచి ఎక్కువ సంఖ్యలో టూరిస్టులు హిమాచల్‌ను సందర్శిస్తున్నారు. ఢిల్లీలో కాలుష్యం లెవెల్స్ ఇంకా ప్రమాదకర స్థాయిలోనే ఉన్నాయి. అందుకే న్యూఇయర్‌ను హిమాచల్‌ప్రదేశ్ , జమ్ముకశ్మీర్ లాంటి ప్రాంతాల్లో జరుపుకునేందుకు జనం తరలివచ్చారు. హిమాచల్‌ప్రదేశ్‌లో ఈసారి న్యూఇయర్ వేడుకలు జరుపుకున్న తీరును జీవితంలో ఎప్పటికి గుర్తుంచుకుంటామని చెబుతున్నారు పర్యాటకులు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కనువిందు చేస్తున్న హిమపాతం.. పోటెత్తిన పర్యాటకులు
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్

